తెలంగాణలో భారీ వర్షాలు.. నీటమునిగిన పంట పొలాలు….

 తెలంగాణలో భారీ వర్షాలు.. నీటమునిగిన పంట పొలాలు

 

సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలల్లో వరి పంటకు అపార నష్టం వట్టిల్లింది. చేర్యాల మండలంలో.. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కరీంనగర్: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిస్తున్నాయి. హుజురాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేశవపట్నం వాగు ఉప్పొంగడంతో ఐకేపీ కేంద్రం గోడ కూలి నిల్వ ఉంచిన వరి ధాన్యం కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. వాగు ఉప్పొంగడంతో.. సైదాపూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. హుజురాబాద్‌లో కూడా చిలుకవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. జూపాక రోడ్డు తెగి పోయింది. భారీ వర్షం కారణంగా రోడ్డుపై ఆరబెట్టిన వడ్లు కూడా కొట్టుకుపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..

 గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..

 

ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్ పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్‌డ్), ఫ్లోటింగ్ అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరికి ఎన్నో కలలకు ఉంటాయి. అలాంటి వాటిల్లో సొంత ఇల్లు ఉండాలనే కల ఒకటి. అందుకే కొందరు రేయింబవళ్లు కష్టపడి ఈ డ్రీమ్ ను నెరవేర్చుకుంటారు. మరోవైపు ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్(Home Loans) పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్‌డ్), ఫ్లోటింగ్ (Fixed vs Floating Interest Rate)అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఫిక్స్‌డ్ వడ్డీ రేటు:

ఇందులో మనం తీసుకున్న హోం లోన్(Home Loans) కు ఈఎంఐ(EMI Plans) ప్రతి నెలా ఒకే విధంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా మనం కట్టే ఈఎంఐ స్థిరంగా ఉంటుంది. ఇది సామాన్యుల బడ్జెట్‌ను సులభతరం చేస్తుంది. దీని వలన నెలవారీ బడ్జెట్ ప్రణాళిక ఈజీ అవుతుంది. ఫిక్స్‌డ్ (Fixed Interest Rate)వడ్డీరేటు ఫ్లోటింగ్ రేటు కంటే 1 నుంచి 1.5 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గితే.. ఫిక్స్‌డ్ వడ్డీ రేటు వల్ల ఆ బెనిఫిట్స్ దక్కవు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version