మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు.

పరీక్షల వేళ ఫీజులుo

మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు

విద్యార్థులను ఇబ్బంది చేస్తే ఊరుకోం

బిఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్

శాయంపేట నేటిధాత్రి;

రేపు జరగబోయే ఇంటర్మీ డియట్ వార్షిక పరీక్ష వేల విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరిగింది.ఇంటర్ ఎగ్జామ్స్ నీ బేసిక్ చేసుకొని ప్రవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేస్తే ఏ కాలేజీ అయినా ఊరుకునే సమస్యలేదని బి ఎస్ యు బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడుమాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఆవేదన గురవుతున్నారు ఇంటర్మీడి యట్ సెకండియర్ విద్యా ర్థులతో పాటు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు పేద మధ్యతరగతి పిల్లలను చాలీచాలని జీతాలతో తల్లిదండ్రులు చదివించడం జరుగుతుంది.కానీ ఈ టైంలో ఎగ్జామ్స్ బేసిక్ చేసుకొని హాల్ టికెట్ ఆపి పిల్లల తల్లిదండ్రుల నుండి అదనంగా డబ్బులు దండుకోవాలని చూస్తే
ఆ కాలేజీలపై బి ఎస్ యు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని యజమాన్యాలకు, అధికా రులకు డిమాండ్ చేశారు.

శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా.!

శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా

వర్దన్నపేట (నేటిదాత్రి) :

ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా వర్దన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థిని-విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అన్మిరెడ్డి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ లు మరియు పెన్నులను పంపిణి చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మైస సురేష్ , జిల్లా SC సెల్ అధ్యక్షులు తూల్ల రవి,జిల్లా నాయకులు MD.ఆఫ్సర్ మార్కెట్ డైరెక్టర్ నాను నాయక్ నాయకులు సమ్మెట సుదీర్, సిలివేరు శ్రీధర్ యాదవ్, MD.అన్వర్,బెజ్జం పాపారావు, పులి శ్రీను,మంచాల రామకృష్ణ,తుమ్మల రవీందర్, చీటూరి రాజు,కొండేటి మహేందర్,విలాసారపు వెంకట్, ముంజ కృష్ణ,పాక సుజాత,లింగం రజిత రెడ్డి, అన్మిరెడ్డి నరేందర్ రెడ్డి,SK. మంజూరు అహ్మద్, సూరారపు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు..

రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారి.

రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేసిన కమ్మరిగూడెం రైతులు..

మొక్కజొన్న బహుళ జాతి కంపేనీ చేత మోసపోయా..

మోసపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి.

నూగుర్ వెంకటాపురం
(నేటి ధాత్రి ),మార్చి 3 ములుగు జిల్లా వెంకటాపురం మండలం

బహుళ జాతి కంపెనీ మొక్కజొన్న పంట వేసి పూర్తిగా నష్టపోయామని కమ్మరిగూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం నాడు వ్యవసాయ అధికారి జాడి ప్రియాంకకు రైతులు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ. ఎకరాకు 4 టన్నులు వస్తుందని మాయ మాటలు చెప్పి బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలైనా సింగెంటా కంపెనీ వెంకటాపురం డీలర్స్ మాతో పంట సాగు చేయించారు.ఒక ఎకరానికి రెండు టన్నుల దిగుబడి కూడా రాలేదని, పండించిన పంట కూలీలకు మాత్రమే సరిపోతుందని వాపోయారు,ఇంకా పెటిలైజర్ షాపులకు ప్రతి ఎకరానికి 50వేల రూపాయలు అప్పు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ఇలా అప్పుల పాలైతే మరణమే మార్గమని అన్నారు.ప్రభుత్వం స్పందించి నష్ట పోయినా ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మరిగూడెం రైతులు పూనెం శ్రీను,విజయ్,రవి,ప్రసాద్ , సొయం నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం.

ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం
– సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలి
సిరిసిల్ల, (నేటి ధాత్రి):

రెయిన్బో ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ను మంగళవారం ఘనంగా నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి పూర్ణచందర్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ సివి రామన్ భారత దేశంలో జన్మించి తన పరిశోధనల ద్వారా నోబెల్ ప్రైస్ పొందిన మొట్టమొదటి ఆసియా ఖండానికి చెందిన వ్యక్తి.

Science Day

సి.వి రామన్ విజ్ఞాన రంగంలో చేసిన కృషికి గుర్తుగా ఈ రోజు జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.
అందులో భాగంగా ఈరోజు జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని రెయిన్బో ఉన్నత పాఠశాలలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల ముఖాల్లో సంతోషం వారి సృజనాత్మకత ఆలోచనా విధానం వివరణ విశ్లేషణ చూస్తుంటే ఈరోజు నాకు చాలా సంతోషం కలిగిందని అన్నారు..
విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఉపాధ్యాయులు మరియు విజ్ఞాన పుస్తకాల నుండి మంచి జ్ఞానాన్ని పొంది భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలని తద్వారా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని సృజనాత్మకతతో తమ చదువులు సాగించాలని అన్నారు…
అదేవిధంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలు వాటి పని విధానాలను వాటి ఉపయోగాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెయిన్బో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం..

విచారణ పారదర్శకంగా చేయాలని కోరిన ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ..

కంపెనీల ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్..

రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు..

ఆర్గనైజర్లకు సంబందించిన ఎరువుల దుకాణాలను సీజ్ చేయాలి..

నష్టపరిహారం ఇవ్వకపోతే పోరుబాట పడతాం..

నూగుర్ వెంకటాపురం
(నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండల

వ్యవసాయ శాఖా పనితీరు సరిగాలేదని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆరోపించారు. సోమవారం వ్యవసాయ సహాయ సంచాలకులు అవినాష్ వర్మ ని నాయకులు కొర్స నర్సింహా మూర్తి, ఉయిక శంకర్, పూనెం సాయి వెంకటాపురం మండల కేంద్రం లోని వ్యవసాయ కార్యాలయం లో కలిశారు. మొక్కజొన్న కంపెనీల పేరుతో ఆర్గనైజర్లు రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని రైతులను కోట్ల రూపాయలకు ముంచేసారని అవినాష్ వర్మ కి తెలిపారు. బాండ్ మొక్కజొన్న వ్యవసాయం అని చెప్పి రైతులకు కంపెనీ అగ్రిమెంట్స్ ఏమి ఇవ్వలేదనని అన్నారు. ఎకరానికి మూడు నుండి ఐదు టన్నులు దిగుబడి వస్తుందని నమ్మబలికి నట్లు వివరించారు. పంట దిగుబడి రాకపోతే కంపెనీ నుండి నష్టపరిహారం ఇప్పిస్తానని రైతులకు తెలిపినట్టు వ్యవసాయ అధికారికి తెలియజేసారు. గత పదిహేను రోజుల నుండి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కంపెనీ ఆర్గనైజర్లు రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు. సింజెంట, హైటేక్, మోన్సెంట, సీపీ వంటి విదేశీ విత్తన కంపెనీల ఆర్గనైజర్ల పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని వ్యవసాయ సహాయ సంచాలకులు అవినాష్ వర్మ ని నాయకులు నిలదీశారు. ఆర్గనైజర్ల ఎరువుల దుకాణాలను తక్షణమే మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి లక్ష యాభై వేలు, ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు కంపెనీ నుండి అందేలా చూడాలని వినతిపత్రం లో పేర్కొన్నట్టు తెలిపారు. రైతులు కంపెనీ మేనేజర్ల తో కలిపి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. విచారణ పారదర్శకంగా జరిపించాలని కోరినారు. రైతులకు న్యాయం చేయకపోతే పోరుబాట పడతామని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుల పైన రాజకీయ పార్టీల వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే ఆర్గనైజర్లను పార్టీల నుండి బహిస్కరించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు.

రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.!

బాండ్ మొక్కజొన విత్తనా,శుద్ధి పైన.ఏ డి. అవి నాష్ వర్మ,ఆరా.

రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా..

బినామీ పేర్ల తొ ఏజెన్సీ మొక్క జొన్న సిండికెట్ వ్యాపారం..

ఆదివాసీల చేతిలో వ్యాపారం ఉండాలి..

ఈ ప్రాంతం లో (ఏజెన్సీ ),రాజే, ఆదివాసీ.

ఏజేన్సీలో పెత్తనం ఎవరిది..

నూగుర్ వెంకటాపురం,మర్చి
(నేటి దాత్రి ):-ములుగు జిల్లా వెంకటాపురం మండలం

రాసపల్లి గ్రామ పంచాయతీకి వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి, సందర్శించారు. మొక్కజొన్న పంటలను పర్యవేక్షణలో నష్టపోయినటువంటి రైతులతో మాట్లాడుతూ, నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం ఇప్పిచ్చేలా చూస్తానని, ఏ డి,రైతులతొ మాట్లాడారు. రైతులకు న్యాయం చేస్తాం అని అయన చెప్పారు. ఆ ఏ డి తో హామీలు నెరవేరకపోతే ములుగు కలెక్టరేట్ వరకు పాదయాత్ర తో బయలుదేరి కలెక్టరేట్ ముట్టడిస్తానని, రైతులు డిమాండ్ చేశారు. బినామీ పేర్లతోనే రైతులని నట్టేట ముస్తున్నారని,రైతులు ఆవేదంతో మాట్లాడారు. బాండు మొక్కజొన్న రైతులకు, ప్రభుత్వం, సంబంధిత అధికారులు న్యాయం చేయాలని రైతులు అన్నారు. మొక్కజొన్న రైతులంతా ఐక్యతగా ఉండి, బాండ్ సంస్థల మీద ఉద్యమం చేపడతామని రైతులు మాట్లాడారు.

శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు.

శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు

మరిపెడ నేటిధాత్రి.

నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ సంఘానికి మలుపు లాంటిదని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత నెల రోజులుగా శ్రీపాల్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పిఆర్టీయూ సంఘ రాష్ట్ర,జిల్లా,మండల బాధ్యులకు,మండల కార్యవర్గ సభ్యులకు, సంఘానికి పట్టుకొమ్మలైన ప్రాథమిక సభ్యులందరికీ మరియు ఈ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లందరికి కూడా పేరుపేరున పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నమని అన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించే విధంగా పిఆర్టీయూ సంఘం చొరవ తీసుకుంటుందని అన్నారు.

గుండెపుడి నందు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెపుడి నందు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెపుడి లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ తెలిపారు. విద్యార్థులే ఉపాధ్యాయులు అయి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనగా స్వయం పరిపాలన దినోత్సవంలో విధ్యార్థులు ప్రధానోపాధ్యాయినిగా,ఉపాధ్యాయుని నీ, ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నివేదిత,దోమల లింగన్న గౌడ్,మురళీ,సునీత,మాధవి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు
– దీక్ష సమయంలో బిజెపి మద్దతు
– బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు
సిరిసిల్ల, (నేటి ధాత్రి):

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో గురించి దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసిన తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకొని మల్క కొమురయ్యకు ఓటు వేశారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ సీనియర్ నాయకులు గర్రెపల్లి ప్రభాకర్,ఆడెపు రవీందర్,పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేవైఎం అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్,మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు,నరేష్, మోర రవి, విష్ణు, రాంప్రసాద్, పట్టణ అధ్యక్షురాలు పండుగ మాధవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ అధికార ప్రతినిధి కోడం శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల బిజెపి అధ్యక్షులు వేన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పే ల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు పోకల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సిలివేరి ప్రశాంత్ గోనపల్లి శ్రీనివాస్ ఇటుకల మహేందర్ కిషన్ మోర్చా మండల అధ్యక్షులు ఆసాని ప్రభాకర్ రెడ్డి ఓబిసి మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్.బక్క శెట్టి రాజశేఖర్ గౌడ్ కటకం మధుసూదన్ మేకల సురేష్ గోగు పరిచయ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రాచన్న స్వామి జాతరకు సర్వం సిద్ధం..

రాచన్న స్వామి జాతరకు సర్వం సిద్ధం

జహీరాబాద్:నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో కొనసాగుతున్న బడంపేట రాచన్న స్వామి 3 రోజుల జాతర కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి విభూతి శివ రుద్రప్ప మంగళవారం ఉదయం తెలిపారు. మార్చి 4, 5, 6 మూడు రోజుల పాటు రాచన్న స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు, ఇఓ శివరుద్రప్ప వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి..

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ

మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు

నడికూడ:నేటిధాత్రి

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్ధన సమయాని కంటే ముందుగానే పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థన చేశారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిత్యం పాఠశాలలను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని ప్రార్థన జరుగుతున్న విధానాన్ని పరిశీలించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.ఆ తర్వాత పాఠశాలలోనే మధ్యాహ్న భోజన రికార్డులను, విద్యార్థుల హాజరు పట్టికలను,ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయలు అచ్చ సుదర్శన్ ఉపాధ్యాయులు లకావత్ దేవా ఉన్నారు.

చిత్రపురి కార్మిక లోకానికి ఊపిరి తమ్మినేని.

`చిత్రపురి అక్షర పోరాటంలో ఎప్పుడూ ముందుంది నేటిధాత్రి.

`జౌర్‌ ఏక్‌ దక్కా చిత్రపురి కార్మికుల గెలుపు పక్కా!

`కార్మికపక్షాన పోరాటంలో తమ్మినేని.

`కార్మికుల పోరులో అక్షర సహకారం నేటిధాత్రి.

`పోరాడితే పోయేదేమీ లేదంటున్న తమ్మినేని.

`ఉద్యమానికి నిరంతర చేయూతనందిస్తున్న నేటిధాత్రి.

`అటు పోరు జెండాలు, ఇటు అక్షర గాండీవాలు తోడుగా వున్నాయి.

`కార్మికులు మరింత గట్టిగా గళం వినిపించాలి.

`చిత్రపురిలో జరిగిన అన్యాయన్ని ధైర్యంగా ఎదిరించాలి.

`హక్కుల సాధన కోసం పరిశ్రమించాలి.

`విశ్రమించకుండా కల సాకారం చేసుకోవాలి.

`దిక్కులన్నీ ఏకమయ్యేలా దీక్షలు చేయాలి.

`కార్మిక వాణి ప్రపంచానికంతటికీ తెలియాలి.

`ప్రభుత్వ దిగివచ్చి న్యాయం చేయాలి.

`ఇప్పటికీ మించి పోయింది లేదు.

`చిత్రపురిలో జొచ్చిన పాములను తరిమేయాలి.

`విషనాగుల కోరలు పీకేయాలి.

`సినిమా గద్దల పని పట్టాలి.

`ఇప్పుటి దాకా వేడుకున్నది చాలు.

`వేడుకోలుతోనే ఒక తరం చీకట్లో కలిసిపోతోంది.

`మలితరానికైనా వెలుగులు నిండాలంటే కార్మికులు పోరుబాట పట్టాలి.

`మీ ఇల్లు మీరు సొంతం చేసుకోవాలి.

`చిత్రపురి స్థలం మీది..

`సొసైటీ సొమ్ము మీది..

`ఆ ఇండ్లు మీవి.

`మీ ఆకలి కేకలేకాదు…ఆగ్రహం కూడా చూపించండి.

`అప్పుడు గాని పేదవాడి కోపం కనిపించదు.

`చిత్రపురిలోని గద్దలు పారిపోవు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఇంత కాలం అడిగింది చాలు..అడుక్నున్నదిచాలు. వేడుకున్నది చాలు. కన్నీళ్లతో కాలం గడిపింది చాలు. ఏడ్చిన కాలం తుడిచేయండి. ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన కండ్లను తెరవండి. ఎరుపెక్కిన కళ్లతో నిలదీయండి. ప్రశ్నించండి. మా భూమి మాకేనంటే నినదించండి. చిత్రపురి మాదే అని గర్జించండి. చిత్రపురి మాది. స్ధలం మాది. సొసైటీ మాది. సొమ్ము మాది. అని తేల్చి చెప్పండి. ఇంకెంత కాలం మోసం చేస్తారని ఎదిరించండి. మీ స్ఠలాలు మీకు సొంతమయ్యేదాకా పోరాటంచేయండి. పోరాడితే పోయేదేమీ లేదన్నది తెలుసుకోండి. చేతులెత్తి మొక్కిన చేతులతో జెండాలు పట్టుకోండి. ఎవరో చెప్పిన జెండాలు, ఇప్పటిదాకా అనుసరించి ఎజెండాలు పక్కన పెట్టండి. పోరాటం చేసేవారు కార్మికులకోసం వున్నారు. పోరాటాలలో విజయాలుసాధించిన సిపిఎం. అగ్ర నాయకుడు తమ్మినేతి వీరభద్రం లాంటి వారు అండగా వున్నారు. నిరంతరం కార్మికుల హక్కుల కోసం అక్షర పోరు సాగిస్తున్న నేటిదాత్రి అండగావుంది. కార్మికులకు న్యాయం జరిగేదాక వుంటుంది. ప్రతి కార్మికుడికి ఇల్లు వచ్చేదాకా అక్షర గాండీవాలను ఎక్కు పెడుతూనే వుంటుంది. కార్మికుల పొట్టగొట్టిన వారిని కడిగేస్తూనే వుంటుంది. కార్మికుల గూడులో చేరిన వారి బైట ప్రపంచానికి చూపిస్తూనే వుంటుంది. ఇంకా మీకెందుకు అలసట. ఇంకెందుకు మీకు ఆవేదన. ఏడ్చే కన్నీళ్లను ఎవరూ తూడ్వలేరు. ఎరుపెక్కిన కళ్లనే అందరూ చూస్తారు. చిత్ర పురి మీది. చిత్రపురిలో హక్కు మీద. సినిమా చాన్స్‌ల కోసం పడిన మీ తపన మీ గూడు కోసం కూడా చూపించండి. చిత్రపురిలో ఇంటి కోసం కొట్లాడితే అవకాశాలు రావనే భయంలో బతక్కండి. సినిమాలో పని దొరకక్కదన్న అభద్రతలో వుండకండి. కార్మికులు లేకుండా సినిమా లేదు. కార్మికులులేకుండా సినిమా ఒక్క అడుగు ముందుకు పడదు. అసలు సినిమా నిర్మాణమే జరగదు. సినీ కార్మికులను కాదని సినిమా తీస్తే అడ్డు పడండి. అడ్డుకోండి. ఇతర ప్రాంతాల కార్మికులను తెచ్చుకొని సినిమా తీస్తామంటే తరిమేయండి. లేకుంటే మీకు ఇల్లు రాదు. సినిమా అవకాశాలు రావు. అర్ధించినంత కాలం మీరు బానిసలే..సనీ గద్దలకు బానిసలే. మీ కష్టం దోచుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. మీ కష్టాన్ని ఇటుకలు చేసుకొని ఇండ్లు లాక్కుంటున్నారు. ప్రతి మనిషికి కూడు, గూడు,గుడ్డ అవసరం. అవి తీరాలంటే పనులు కావాలి. ఆ బలహీనతే కార్మికులను రోడ్డున పడేస్తుంది. సినిమా పెద్దల చేతుల్లో కీలుబొమ్మలను చేస్తోంది. కార్మికులకు ఆకలే కాదు. ఆవేశం కూడ వుండాలి. ఆందోళన చేసి సాధించుకోవాలి. ప్రశ్నించి నిలదీయాలి. ఎదిరించి హక్కులు సాధించుకోవాలి. దేశ స్వాతంత్య్రం కూడా కొట్లాడితేనే వచ్చింది. పోరాటం చేస్తేనే వచ్చింది. అలుపెరగని ఉద్యమం సాగిస్తేనే వచ్చింది. ఒక్కసారి విశ్రమిస్తే ఇక ఎప్పుడైనా వెనుకడుగే..అప్పుడప్పుడూ చేసేది ఉద్యమం కాదు. విరామాలు ఇచ్చుకుంటూ పోరాడితే న్యాయం జరగదు. పోరాటమే కాదు ఆరాటం కూడా వుండాలి. అందుకు ఆచరణ కావాలి. ముందడుగు వేసే ధైర్యం కావాలి. ఆ శక్తి ప్రతి కార్మికుడిలోనూ వుండాలి. అప్పుడే చిత్రపురి కార్మికుల సొంతమౌతుంది. ఎవరో వస్తారని , ఏదో చేస్తారని ఎదురుచూడడం మానుకోండి. మీ కోసం కలిసి వచ్చే వారితో కలిసి పోరు బాట ఎంచుకోండి. సిపిఎం. అగ్రనేత ఎప్పటి నుంచో చెబుతున్నారు. మీకు అండగా కలిసి సాగారు. మీ కోసం ఉద్యమాలు చేశారు. కాని కార్మికులలో ఐక్యత ఇంకా పూర్తిగా లేదు. ప్రతి సమాజంలోనూ అవకాశవాదులుంటారు. అలాంటి వారు మీ సమూహంలోనే వుంటారు. అలాంటి అవకాశవాదులను గుర్తించండి. మీ కోసం కలిసి రాని కార్మికులను పక్కన పెట్టండి. ఎందుకంటే అవకాశవాదులు కలిసి రాదు. కార్మికులందరనీ ఏకం కానివ్వరు. సినీ పెద్దల జేబులుగా పనిచేసే వారు మీ పక్కనే వుంటారు. మీకు ఎప్పటికిప్పుడు వెన్ను పోటు పొడుస్తూనే వుంటారు. వెళ్లకున్న ఎంగిలి మెతుకులు మీకు విసిరేసి వడ్డించిన విస్తరి సుష్టుగా సినీ పెద్దలు బోంచేస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములు సినీ గద్దలు సొంతం చేసుకొని కార్మికులకు పని కల్పిస్తున్నారు. ఎంగిలి మెతుకుల కార్మికుల మొహాన కొడుతున్నారు. ఇప్పటికైనా కార్మికులు కళ్లు తెరవండి. అమాయకపు ఆలోచనల నుంచి దూరంగా జరగడండి. కార్మికుల్లో వుండే కలతలు పక్కనపెట్టుకోండి. అంతా ఏకమైతే వేల కోట్ల రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకోండి. చిత్రపురి సొసైటీలో సినీ పెద్దలెందుకు? కార్మికులకు చేతగాదా? కార్మికులు సొసైటీని నడుపుకోలేరా? చిత్రపురిలో కార్మికులకు చోటు లేకుండాపోవడానికి కారణమేమిటి? నటులందరికీ ఆస్ధులున్నాయి. నిర్మాతలకు, దర్శకులకు ఆస్దులున్నాయి. భూములున్నాయి. మీ భూముల మీదకు వస్తుంటే ఏం చేస్తున్నారు. కార్మికులకు మాయ మాటలు చెప్పి, ఎప్పుడో మోసం చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. అసలు చిత్ర పురిలో జరిగిన స్కామ్‌ అంత ఇంతా కాదు. 67 ఎకరాల భూమి విలువ వేల కోట్లు. సుమారు 3వేల కోట్ల విలువైన స్ధలం. ఆ స్థలమే మీ సొంతమైమతే ప్రతి కార్మికుడు ఒకసినిమా తీయొచ్చు. కార్మికులే నిర్మాతలు కావొచ్చు. లారీ డ్రైవర్లు ఓనర్లు కాలేదా? కార్మికులు నిర్మాతలు కాలేరా? ఇతర రంగాలలో రాణించలేరా? మీరే దర్శకులు కాలేరా? మీరే నటులై పాత్రలు పోషించలేరా? తరం మారుతోంది. నిన్నటి తరం హీరోల వారసులే హీరోలా…కార్మికులలో కళలేదా? కళాకారులు కాలేదు. ఇతర రంగాలలో వారికి ప్రతిభ లేదా? ముందు మీరు మేలుకోండి. చిత్రపురి సొంతం చేసుకొని, సొసైటీ పేరుతో సినిమాలు తీయండి. మీ ఇల్లు మీ సొంతం చేసుకొని గూడు సమకూర్చుకోండి. కార్మికులలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. కార్మికుల సలహాలు తీసుకుంటూ సినిమాలు తీస్తున్నవారున్నారు. కార్మికులు చెప్పే కథలను సినిమాలకు అలులతున్నవారున్నారు. మొత్తం సినిమా అంతా కార్మికులచుట్టే తిరుగుతుంది. ఒక్కసారి ఇప్పుడున్న సినీ గద్దల సినిమాకు దూరంగా వుండండి. అప్పుడు సినీ లోకమంతా విలవిలలాడుతుంది. కాని ఎక్కడ కడుపు కాలుతుందో…ఆకలి దహిస్తుందో..అని వాళ్లకన్నాముందే కార్మికులు తమ అచేతనం చూపిస్తున్నారు. నిర్మాతులు లేకుంటే బతకలేమనుకుంటున్నారు. సినిమాలు రాకపోతే బువ్వ తినలేమనుకుంటున్నారు. అందుకే కార్మికులంతా గొడుగు పట్టుకోవడంతోనే ఆగిపోతున్నారు. కార్యవాన్‌ల తలుపులు తెరిచేందుకే పనికొస్తున్నారు. సినిమాలో ఓ మూలన నిలబడి ఒక్కసారి తెరమీద కనిపిస్తే చాలనుకుంటుకుంటున్నారు. తెలంగాణలో ఎంతో మంది స్వతహసిద్దితో కళాకారులౌతున్నవాళ్లున్నారు. తెలంగాణ మట్టిలో పాట వుంది. సంగీతంవుంది. తెలంగాణ జీవితమే ఒక కథలా వుంటుంది. వాటిని పట్టుకొని సినిమా తెరకెక్కించండి. అంతే కాని ఎవరి కాళ్లో పట్టుకుంటేనే బతుకుతామన్న భావన నుంచి బైటకు రండి. సమాజంలో ఏ రంగంలో చూసినా ఎదుగూ బొదుగూ వుంటుంది. కాని సినీ కార్మికుల జీవితాలు ఎందుకు అక్కడే వుంటున్నాయి. ఒక బట్టలషాపులో పనిచేసే వ్యక్తి కొంత కాలం తర్వాత చిన్నగా బట్టల దుకాణం పెట్టుకుంటాడు. కొంత కాలం టైలరింగ్‌ నేర్చుకున్నవ్యక్తి సొంతంగా టైలరింగ్‌ షాపు పెట్టుకుంటాడు. కాని ఒక్క సినీ రంగంలోనే జీవితాంతంకార్మికుడిగానే వుంటాడు. వయసైపోయిన తర్వాత ఎవరు సాయం చేస్తారా? అని ఎదురు చూస్తుంటాడు. అసంఘటిత కార్మికులకు వున్న వెసులుబాటు సినీ కార్మికులకు లేదు. అందువల్ల మీ చిత్రపురిని మీరు సొంతం చేసుకోవడమే అందుకు పరిష్కారం. కార్మికులకు చిత్రపురి విషయంలో తీరని అన్యాయం జరిగిందని అన్ని వర్గాలలో సానుభూతి వుంది. కాని కార్మికుల పోరాటంలోకొంత అలసత్వం వుంది. నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. చిత్ర పురి విషయంలో నేటిధాత్రి లాంటి మీడియా ఎంతో ఆది నుంచి సపోర్టు చేస్తున్నప్పటికీ కార్మికుల విడతల వారీ పోరాటం వల్ల ప్రతిసారి మళ్లీ మొదటికొస్తోంది. ఇప్పటికైనా సరే కార్మికులు అందరూ ఒక్కతాటి మీదకు రావాల్సిన అవసరం వుంది. పాలకులు మారినప్పుడల్లా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాత్రమే కార్మికులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తర్వాత మర్చిపోతున్నారు. పూర్తి స్దాయి చిత్తశుద్దితో కూడా కార్మికులు పోరాటంచేయాల్సిన అవసరం వుందన్నది కూడా అంగీకరించాలి. విరామం లేని ఉద్యమం సాగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదన్నది తెలుసుకోవాలి.

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి నేటి ధాత్రి : 

తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని 26 వ వార్డులో గల టి.పి. ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై ఉన్న చిన్న చిన్న గుంతలను కూడా వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. హోటల్స్ వద్ద తడి, పొడి చెత్త సేకరణను పరిశీలించి, క్రమం తప్పకుండా చెత్త సేకరణ మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల అనుమతులు పరిశీలించాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, డి.ఈ. లలిత, ఏసిపి లు బాలాజి, మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

2025 మార్చ్ 9వ తేదీన విజయవాడలో శ్రీ శ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో

నారీ రత్న అవార్డుకు ఎంపికైన
భద్రాచలవాసి ఎర్రంశెట్టి పూర్ణిమ.

భద్రాచలం నేటి ధాత్రి

మన భద్రాచల మహిళ..
తెలుగు పండిట్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజీ కౌన్సిలర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం జిల్లాకమిటీ మెంబర్,
పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు అయిన ఎర్రంశెట్టి పూర్ణిమ
భద్రాచల పరిసర ప్రాంతాలలోని గిరిజన పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల యందు ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ గా విద్యార్థులకు లైఫ్ సెట్టింగ్, లైఫ్ గోల్, టైం మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉచిత సెమినార్లునిర్వహిస్తున్నారు.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా) నందు జిల్లా కమిటీ మెంబర్ గా మహిళా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, మహిళాచట్టాలు, మహిళాసాధికారతలపై మహిళలకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు.
కుటుంబ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ను నిర్వహిస్తున్నారు.
భద్రాచలపట్టణంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత నిర్వహించే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ,
సాహిత్యాభిలాషతో తనవంతు సాహితీసేవలను అందిస్తున్నందుకుగానూ అభినందిస్తూ
శ్రీశ్రీ కళావేదిక నిర్వహించే ఆమెకు వందనం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నారీరత్న అవార్డుకు ఎంపిక చేసారు.
ఈ అవార్డును స్వీకరించవలసినదిగా
శ్రీ శ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత గారు పూర్ణిమకు ఆహ్వానాన్ని పంపించారు.
ఈ సందర్భంగా ఎర్రంశెట్టి పూర్ణిమను భద్రాచల పట్టణ ప్రముఖులు, సాహితీవేత్తలు అభినందించారు.
ఈ విషయంపై ఆమె హర్షాన్ని వ్యక్తం చేస్తూ..
వివిధ రంగాలలో విజయపథం వైపు దూసుకెళ్తున్న మహిళా మణులకు పట్టంకట్టే బృహత్తర కార్యక్రమంలో తనను ఎంపికచేసి నారీరత్నను అందిస్తున్నందుకు, జాతీయస్థాయిలో భద్రాచల పట్టణంలో సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలను ప్రోత్సహిస్తున్నందుకుగానూ..
శ్రీ శ్రీ కళావేదిక సి.ఈ.ఓ. డా. కత్తిమండ ప్రతాప్ కు, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలితకు ఎర్రంశెట్టి పూర్ణిమ ధన్యవాదాలు తెలియజేసారు.

అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు?

అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు?

నోటీసులకే పరిమితం అవుతున్న అధికారుల చర్యలు

పిర్యాదులు చేసిన పట్టింపు లేదాయే.

అస్తవ్యస్తంగా మున్సిపల్ పాలన?

నర్సంపేట,నేటిధాత్రి:

Actions have been taken on illegal constructions?

నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల అలసత్వంతో అక్రమ కట్టడాలు, అక్రమ భూకబ్జాలు రోజురోజుకు ఒక మాఫియాల పేట్రేకి పోతున్నది. ప్రభుత్వ భూములను, చెరువు మొత్తానికి కాల్వలను గ్రీన్ ల్యాండ్లను అక్రమదారులు కబ్జా చేసిన, నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలను అక్రమ కట్టడాలు చేపట్టిన సంబంధిత అధికారులకు పట్టింపు లేకుండా పోతున్నదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నర్సంపేట పట్టణంలో ప్రధాన ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.నర్సంపేట పట్టణం నెక్కొండ రోడ్డులో గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనకాల మరియు నెక్కొండ రోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలో , మరియు ద్వారకపేట రోడ్డులో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలో అక్రమంగా నిబంధనలు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలతో నేటిధాత్రి దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది.కథనాలకు స్పందించిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సంబంధిత అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.కాగా వాటిపై చర్యలకు వెనుకాడిన అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ
ఎంసిపిఐ[ యు ] రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ ,నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి మరోసారి మున్సిపల్ కమిషనర్ కు,టౌన్ ప్లానింగ్ అధికారులకు పిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో ఒక వైపు నేటిధాత్రి వరుస కథనాలకు,మరో వైపు ఎంసిపిఐ పార్టీ ఫిర్యాదులతో మూడు అక్రమ భవన నిర్మాణ యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు.పట్టణ భౌగోళికల పట్ల

 

Actions have been taken on illegal constructions?

కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతున్నారని చర్చలు జరుగుతున్నాయి.అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులకు చేతులురావడం లేదా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.గతంలో కూడా ఒక ప్రముఖ వైద్యునికి సంబంధించిన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అక్రమంగా కట్టారని మున్సిపల్ అధికారులు కూలగొట్టారని ప్రజలు గుర్తుకు చేస్తున్నారు.ఆ అక్రమ భవన నిర్మాణాల పట్ల నోటీసులు ఇచ్చిన అధికారులు చర్యలు తీసుకోకుండా ఆ నోటీసులకే పరిమితం చేయడం వెనక ఏమైన ముడుపులు ముట్టాయా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు.

రంగంపేట వద్ద
పి.జి హాస్టల్ యాజమాన్యం,
విద్యార్థులకు
మత్తు పదార్థాలపై

అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు

తిరుపతి(నేటి ధాత్రి)

అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.
ఆదేశాల మేరకు రంగంపేట పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి, తనిఖీ మరియు అవగాహన కార్యక్రమం చేపట్టారు.
విద్యార్థుల భవిష్యత్ తోపాటు భద్రత దృష్ట్యా పీ.జీ. ప్రైవేటు హాస్టల్ నందు తనిఖీలు నిర్వహించిచారు.
సైబర్ క్రైమ్ నార్కో ట్రిక్స్ మరియు గంజాయి పై సుబ్బరాయుడు సి.ఐ.అవగాహన కార్యక్రమం ఎర్పాటు చేశారు.
రంగంపేట లోని ప్రతి హాస్టల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బ్యాకప్ 30 రోజు ఉండాలని సూచించడం అయినది.
రంగంపేట పరిసర ప్రాంతాలలో పి.జి హాస్టల్ యాజమాన్యల తోపాటు మత్తు పదార్థాలపై విద్యార్దులకు అవగాహన నిర్వహించారు..
గంజాయి సేవించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుందని, దానివల్ల జరిగే నష్టాలు అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు..
దినితో పాటు విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలు గురించి నార్కో ట్రిక్స్ డ్రగ్స్ గురించి, వాటి వల్ల జరిగే నష్టాలు గురించి తెలపడం అయింది..
రంగంపేట పరిసర ప్రాంతాలులో గల గంజాయి స్పాట్లను కూడా గుర్తించి వాటిని ద్వంసం చేశారు..

pg

అంతే కాకుండా ఈ ప్రదేశాలలో గంజాయి సేవించిన, లేదా ఇతరేతర కార్యక్రమాలు చేపట్టిన అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యాజమాన్యం కు మీకు ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
నార్కోడ్ ట్రిక్స్ డ్రగ్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్1972 కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు తెలిపారు.
గంజాయి పై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీస్ వారికి డయల్ 100/112/8099999977 సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీజీ హాస్టల్లో యాజమాన్యం ఆటో డ్రైవర్లు ఎస్టిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు..

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

 

పరకాల నేటిధాత్రి :

ఎక్సైజ్ స్టేషన్ పరకాల పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన టువంటి వాహనం లకు బుధవారం రోజున ఉదయం 11 గంటలకు డిస్టిక్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వరంగల్ రూరల్ ఆధ్వర్యంలో పరకాల ఎక్సైజ్ స్టేషన్ నందు వేలం నిర్వహించబడునని ఆసక్తి కలవారు వాహనంలో వేలంలో పాల్గొనవలెనని పరకాల ఎక్సైజ్ సీఐ పి.తాతజీ తెలిపారు

ఆర్టిసి కార్మికులను వేధిస్తున్న డిఎం ను సస్పెండ్ చేయాలి.

ఆర్టిసి కార్మికులను వేధిస్తున్న డిఎం ను సస్పెండ్ చేయాలి.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కార్మికుల మొర

బెల్లంపల్లి నేటిధాత్రి :

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న డిపో మేనేజర్ విశ్వనాథ్ ను సస్పెండ్ చేయాలని , కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, ఆర్ టి సి కార్మిక సంఘం నాయకులు కె. ఎస్. రావు డిమాండు చేశారు. ఈ రోజు ఆర్ టి సి కార్మికులతో కలిసి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులపై భారం పెంచి వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే సర్వీసులను నడిపితే మూడు రోజుల పని దినాలుగా ఉన్న దానిని రెండు రోజులకు కుదించే కుట్ర చేస్తున్నారని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పెరుతో పని చేయని మిశన్ ద్వారా టెస్ట్ చేసి కార్మికులపై తప్పుడు నివేదికలు ఇచ్చి సస్పెండ్ చేయడం, సర్వీస్ నుండి రిమూవల్ చేయడం చేస్తున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో 216 మంది కార్మికులను సస్పెండ్, రిమూవల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ సొలొమాన్, ఆసిఫాబాద్ డిపో మేనేజర్ విశ్వనాథ్ వేధింపులు ఆపాలని, ఆర్ ఎం ను ట్రాన్స్ఫర్ చేయాలని, డి ఎం విశ్వనాథ్ ను సస్పెండ్ చేయాలని విన్నవించగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించారని, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారని ఏమాజి తెలిపారు. కేంద్ర మంత్రినీకలిసిన వారిలో బిజెపి సీనియర్ నాయకులు కేశవరెడ్డి, ఆర్ టి సి కార్మికులు పాల్గొన్నారు.

కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్..

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్
చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి

చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ విరాజిల్లుతున్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.ఇందులో భాగంగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా
శ్రీ బుగ్గులు వెంకటేశ్వర దేవస్థాన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తోపాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగాచార్యులు మరియు
ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.దీనిలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లతో పాటు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఇతర ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని చైర్మన్ శ్రీధర్ రావు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version