డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్…

డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్

మహాదేవపూర్ ఆగస్టు 01 (నేటి ధాత్రి) *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కేంద్రంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో శుక్రవారం రోజున క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎస్టి గర్ల్స్ హాస్టల్, స్కూల్ కాంప్లెక్స్, హెల్త్ సెంటర్ లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం దూర ప్రాంతాల వారికి హాస్టల్ సదుపాయం ను అందుబాటులో ఉంది కావున వినియోగించుకొని విద్య లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, హాస్టల్ లలో ఆహారవిషయం లో సమయ పాలన పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని అన్నారు. హెల్త్ సెంటర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాకాలం లో ఎక్కువ గా ప్రజలు ఎలాంటి సమస్యలకు గురి అవుతారో ముందే గ్రహించి ప్రజలకు అవగాహన తో పాటు అన్ని రకాల వైద్యం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆఫీసర్ కిరణ్, ఎంపీ ఓ ప్రసాద్, గ్రామ కార్యదర్శి కల్పన ఎస్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరిత తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన..

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన జిల్లా కమిటీ

మంచిర్యాల జులై 23, నేటి ధాత్రి

ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నం బట్టి వాడ 100 పిట్ల రోడ్డులో గల భారతీయ మజ్దూర్ సంఘ్(బి.ఎమ్.ఎస్) జిల్లా కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావించి నేటితో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్ బి.ఎమ్.ఎస్. జెండా ఎగరవేసి కార్మికులతో కలిసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటాల శంకర్ మాట్లాడుతూ, జూలై 23, 1955 సంవత్సరంలో బాల గంగాధర్ తిలక్ జన్మదినం సందర్భంగా దత్తోపంత్ టెన్గ్డే జీ భారతీయ మజ్దూర్ సంఘ్(బి.ఎమ్.ఎస్) కార్మిక సంఘాన్ని ప్రారంభించారు,కార్మిక హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ దేశములోని రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న ఏకైక సంఘం బి.ఎమ్.ఎస్. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఎం.ఎస్. జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, ఉపాధ్యక్షులు కృష్ణ రెడ్డి, రత్నాకర్ మహానంద్,సంగెం లక్ష్మణ్, వేల్పుల స్వామి,బండి వెంకటేశ్వర్లు, సిద్దు, సంతోషం లో పాల్గొన్నారు

నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం.

నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-4-1.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రపంచవ్యాప్తంగా న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కుల రక్షణను పెంపొందించే లక్ష్యంతో ఏటా జులై 17న ‘నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం’గా నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల మధ్య నిరాయుధీకరణను సాధించడం, వివిధ దేశాల మధ్య తలెత్తే సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడం, మానవాళి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు వారి హక్కులను పరిరక్షించేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారు.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాలు చాలా అవసరమని, నైపుణ్యాలతోటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే చదువుతో పాటుగా వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాజీవ్ యువ వికాసం లాంటి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకుఅనేక కార్యక్రమాలను, నైపుణ్య శిబిరాలను నిర్వహిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం- 2025 యొక్క ఉద్దేశం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని చంద్,రమేష్,నరసింహారెడ్డి, కృష్ణవేణి,అనిత,హేమలత, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.

 

 

 

 

నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,650 రూపాయల దగ్గర..

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,890 రూపాయల దగ్గర..

10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,170 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

బంగారం కొనాలనుకునే వారికి వరుస షాక్‌లు తగులుతున్నాయి.

గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు.

వారం క్రితం స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 93 వేల దగ్గర ట్రేడ్ అయింది.

వారం రోజుల్లోనే ఊహించని విధంగా ..

98 వేలకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

బంగారం కొనాలనుకునే వారు ముందుగానే జాగ్రత్త పడాలని, ధరలు తగ్గినపుడు కొని పెట్టుకోవటం ఉత్తమమని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.

భాగ్య నగరంలో బంగారం ధరల వివరాలు..

హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,650 రూపాయల దగ్గర..

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,890 రూపాయల దగ్గర..

10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,170 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై..

గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,900 రూపాయల దగ్గర..

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,660 రూపాయల దగ్గర..

10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ..

74,180 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

నగరంలో వెండి ధరలు ఇలా ..

మొన్నటి వరకు బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు మాత్రం పెరుగుతూ పోయాయి.

కానీ, ఈ రోజు వెండి ధరలు తగ్గాయి.

నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12000 దగ్గర ట్రేడ్ అయింది.

కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది.

ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది.

100 గ్రాముల వెండి ధర నేడు 11990 దగ్గర ట్రేడ్ అవుతోంది.

కేజీ వెండి ధర 1,19,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.

బాలాజీ టెక్నో స్కూల్లో ఎంఎస్ఎంఈ డే.

బాలాజీ టెక్నో స్కూల్లో ఎంఎస్ఎంఈ డే

నర్సంపేట నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు ఎంఎస్ఎం ఈ డే 2025 ఉద్యమి భారత్ కార్యక్రమం పాఠశాల ఎన్సిసి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ పాత్ర ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ప్రభుత్వాలు సూక్ష్మ, చిన్న ,మధ్య తరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి ద్రవ్యల్బణం తగ్గి ఆర్థికంగా ఎదుగుతారని దీంతో ఆత్మనిర్భర్ భారత లక్ష్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ రంగాన్ని మరింత బలంగా పోటీ తత్వంతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా దృష్టి సారించాలని కోరారు. ప్రతి విద్యార్థి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, రవీందర్ రెడ్డి ,రామ్మూర్తి ,రాజేష్ ,లక్ష్మణ్ మరియు ఎన్.సి.సి క్యాడెట్లు పాల్గొన్నారు.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడాతూ..
యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ 1975 లో అధికారం కొరకు, అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణిచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మరచిపోలేని చీకటి రోజు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారం, అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బిజెపి అగ్రనాయకులు అద్వానీ, వాజపేయి, మోడీ లు నినదిస్తే అణిచివేసేందుకు కుట్రలు పన్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

 

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ శ్వాస మీద,ధ్యాస,మనకై మనం చేసే అన్వేషణే యోగాని,అదేవిధంగా తనువును,మనసును, ఆత్మను ఏకం చేసే ఒకే ఒక సాధనం యోగాని, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని,ఈ యోగా దినోత్సవాన్ని 2014 సెప్టెంబర్ 27 న భారత ప్రధాన నరేంద్ర మోడీ ఐక్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపు కోవడం గురించి ప్రతిపాదన చేశారని,ఈ ప్రతిపాదనకు 193 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారని,భద్రతా కమిషన్ లో శాశ్వత సభ్యులుగా ఉన్న భారతదేశం,అమెరికా, ఇంగ్లాండ్,చైనా,ఫ్రాన్స్,రష్యా దేశాలు కూడా ఈ తీర్మానానికి సహప్రతినిధులు అని,విస్తృతమైన చర్చల అనంతరం డిసెంబర్ 2014లో ఆమోదించబడి 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు.యోగా జూన్ 21న జరుపుకోవడానికి గల కారణం జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుందని ఎక్కువ ప్రగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ సూచించారని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు
తెలంగాణ ఉద్యమ పితామహుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజకుమార్, మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,విద్యార్థిని,విద్యార్థులు మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

గర్భిణీ మహిళలకు యోగ ఒక వరం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

ఈరోజు మహిళా శిశు దివ్యాంగులు వయవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో ఆడిటోరియంలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మహిళల ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్య జనని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మహిళలు గర్భిణీ సమయంలో బాలింత సమయంలో చేయవలసినటువంటి ప్రత్యేక ఆసనాలు ప్రత్యేక ధ్యానం ప్రత్యేక యోగా పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం వివరించారు. అలాగే జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ యోగ పద్ధతులు నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రసవాలు జరుగుతాయనిచెప్పారు. మన దేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు సిరిసిల్ల జిల్లా సి సెక్షన్ లలో అత్యధిక శాతంతో ముందున్నాయి.

కాబట్టి యోగ నేర్చుకోవడం ఆసనాలు ధ్యానం ద్వారా మనం సాధారణ ప్రసవాలకు మళ్ళించవచ్చని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం నుండి డాక్టర్ అంజలి,దీప్తి చాలా సాధారణ పద్ధతులతో ఏ విధంగా యోగాను పూర్తి చేయవచ్చు ధ్యానం గురించి కూడా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఒక్కో మెట్టు గురించి వివరించడం జరిగింది. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి వివరించారు. మంచి సంకీర్తన వినడం మంచి చిత్రాలు చూడడం ఆహ్లాదకర వాతావరణము ప్రశాంత వాతావరణము సమయానికి ఆహారం తీసుకోవడం కనీసం 8 గంటల నిద్ర ఇలాంటివి కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ సురేంద్రబాబు పీడియాట్రిషన్ అతిథిగా హాజరై పిల్లల ఆరోగ్యానికి మంచి చేస్తాయని యోగా ధ్యానం పద్ధతులు వాడుకుని ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని సదస్సుకు హాజరైన అందరు సిబ్బందికి తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో సిడిపివోలు సౌందర్య ఉమారాణి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా సూపర్వైజర్లు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ ఇన్చార్జ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ , చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖి కో ఆర్డినేటర్ మమత, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు

హాజరైన బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు హాజరయ్యారు.ఈసందర్బంగా మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక,మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం ‘యోగ’అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది మరియు శరీరం మరియు మనస్సు కలయికకు ప్రతీకగా చేరడం లేదా ఏకం చేయడం అని,నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించబడుతోంది మరియు జనాదరణ పొందుతూనే ఉందని,దాని సార్వత్రిక విజ్ఞప్తిని గుర్తించి,11 డిసెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి 69/131 తీర్మానం ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు.యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థాపించే ముసాయిదా తీర్మానాన్ని భారతదేశం ప్రతిపాదించింది మరియు రికార్డు స్థాయిలో 190 సభ్య దేశాలు ఆమోదించాయన్నారు.

జనరల్ అసెంబ్లీ 69వ సెషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ ప్రతిపాదనను మొదట ప్రవేశపెట్టారు.యోగా అనేది మనస్సు మరియు శరీరం,ఆలోచన మరియు చర్య యొక్క ఐక్యతను కలిగి ఉంటుందని మన ఆరోగ్యానికి మరియు మన శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం. యోగా అంటే వ్యాయామం మాత్రమే కాదు,మీతో, ప్రపంచంతో మరియు ప్రకృతితో ఏకత్వం యొక్క భావాన్ని కనుగొనడానికి ఇది ఒక మార్గం,యోగా అనేది శారీరక శ్రమ కంటే ఎక్కువ మరియు రోజువారి జీవితంలో సమతుల్య వైఖరిని కొనసాగిస్తుందని పనితీరులో నైపుణ్యాన్ని ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాచం గురుప్రసాద్,ఆర్పి జయంతి లాల్,కాసగాని రాజ్ కుమార్, ఎరుకలు దివాకర్,మార్తా రాజభద్రయ్య,ఎర్రం రామన్న, సంగా పురుషోత్తం,బాసాని సోమరాజు పటేల్,మార్త బిక్షపతి,సందీప్,కుమారస్వామి నరసయ్య,పావుశెట్టి సునీత,దంచనాదుల కిరణ్ కుమార్,కందుకూరి గిరి ప్రసాద్,కాలుగుల గోపీనాథ్, గోగుల రాజిరెడ్డి,రవీందర్ యాదవ్,నగేష్,బాలాజీ మురళి,ఆర్పీ సంగీత,చెట్ల రజినీకాంత్,సంగా ప్రభాకర్, బండి యాదగిరి,మధుసూదన్ రెడ్డి, రాంబాబు,ప్రజా ప్రతినిధులు,బిజెపి నాయకులు,పతాంజలి వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఠాగూర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు.

ఠాగూర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన సింగ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తలపెట్టినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. యోగ ప్రాచీన భారతీయ సంప్రదాయమని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కళాధర్ రెడ్డి, పద్మ, కట్ట ఈశ్వర చారి, రమేష్, పోషం,చంద్రమౌళి, సతీష్, ప్రసాద్, తిరుపతిరెడ్డి, నూనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రం గా స్థానిక రభాసా అతిథి గృహంలో అబ్రహం మాదిగ అధ్యక్షతన ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు రామరాపు శ్రీనివాస్ మాదిగ,విఎస్ రాజు మాదిగలు  మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత,మందకృష్ణ  తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత  మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారా మాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ,  వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో… పెద్ద గీత మాదిగ మాదిగ మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు,ఆనంద్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,బుచెంద్రయ్య మాదిగ ఎమ్మార్పియిస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,జాన్ సోషల్ మీడియా ఇంచార్జి సంగారెడ్డి,వివిధ మండల అధ్యక్షులు జైరాజ్ మాదిగ, టీంకు మాదిగ, మైకీల్ మాదిగ,నిర్మల్ మాదిగ, ప్రభాకర్ మాదిగ,సుకుమార్, కిట్టు, శ్రీనివాస్, ప్రేమ్, సుదర్శన్, దాస్, జీవన్,వీరయ్య మాదిగ,దేవయ్య, చంద్రకాంత్, శాంతకుమార్, మోహన్, చంద్రపాల్, దిలీప్, సంతోష్, సునీల్ కుమార్, ప్రశాంత్, లాజర్, సుందర్, సుశీల్ కుమార్, ప్రవీణ్, దుర్గాదాస్, మాదిగలు పాల్గొన్నారు.

అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం.

సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనైనది. ఈ రక్తదాన శిబిరం ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో తో సమానమని, మనం ఇచ్చే రక్తం వేరొకరి నిండు ప్రాణాలను కాపాడాలని సంకల్పంతో రక్తదానం చేస్తున్న రక్తదాతల స్ఫూర్తి ఎంతో గొప్పదని , తెలియజేస్తూ రక్తదానం తో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, పెద్ద పేగు క్యాన్సర్లు, సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని, మన ఆరోగ్య స్థితిని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ అభినయ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి

◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.

◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:

విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం

సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం

విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం

ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:

వ్యాసరచన పోటీలు

చర్చా వేదికలు, సదస్సులు

విద్య ప్రదర్శనలు

విద్యా అభివృద్ధిపై చర్చలు

వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.

75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా అతను జన్మత భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని
ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.

11వ అంతర్జాతీయ యోగ డే జూన్ 21 నుంచి నిర్వహించబడును.

11వ అంతర్జాతీయ యోగ డే జూన్ 21 నుంచి నిర్వహించబడును…

తంగళ్ళపల్లి నేటి దాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సిరిసిల్ల వృద్ధ ఆశ్రమంలో ఈనెల 11వ తారీకు నుంచి అంతర్జాతీయ యోగా డే 21 వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా దశాబ్ది ఉత్సవాలు ప్రతిరోజు యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుక వృద్ధాశ్రమంలో ఉన్న సీనియర్ సిటిజన్ వారి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగ చేయాలని తెలుపుతూ వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయుష్ యు నాని. డిస్పెషనరీ. యోగ శిక్షకులు బి శ్రీనివాస్. టి సప్న సీనియర్ సిటీ జనులతోఆసనాలు ప్రాణామాయం ముద్రలు ధాన్యం చేస్తూ వాటి ఉపయోగాలు ఫలితాలు వివరించారు. ఇట్టి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా తిరుపతి స్థానిక గ్రామ మండల పల్లి. ఆశ వర్కర్లు సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని పురపాలక సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ను ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది.అదే విధంగా అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు పట్టణం లోని పురపాలక సంఘం ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి సాధించుటకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ యొక్క 100రోజుల కార్యాచరణ లో శానిటేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక మరియు మెప్మా విభాగాలు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రతి విభాగం అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది అని ప్రజలు కూడా మాకు సహకరించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగినది.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు
బలుగూరి తిరుపతిరావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బలుగురు తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా బారాస అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు పోరాటం ద్వారా అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమళ్ళ రమేష్ మల్సాని బాపురావు దేవునూరికుమారస్వామి బొల్లేని రవికుమార్ ఎల కంటి మూర్తిలింగాచారిపడిదల జగ్గారావు బండారి రామస్వామి చెక్క సురేష్ వనం కార్తీకు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్దిదారులకు మరియు నస్పూర్ కు చెందిన 529 మంది లబ్ధిదారులకు మరియు హజీపూర్ కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును ఇస్తామని చెప్పి మాటను నిలబెట్టుకొని మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలో ఈ రోజు మొత్తం1,193 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చామని చెప్పారు.

మంచిర్యాల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మొత్తం 3,098 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రెడ్డి గారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి కి, రాష్ట్ర రెవెన్యూ ,గృహ నిర్మాణం & సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ఈ కార్యక్రమంలో సంబంధింత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన…ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెప్పినట్టు చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు

సోనియా గాంధీ చోరువుతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది

జోహార్లు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు

ఎఏం సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య

( నేటిధాత్రి )వర్ధన్నపేట:

మండలం, ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంగణం నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఏంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…సబ్బండ వర్గాల పోరాటాల ఫలితం, సకల జనుల ఉద్యమాల ఫలితం వెరసి సోనియా గాంధీ గారి సాహసోపేతమైన నిర్ణయ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని తెలిపారు.సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరువతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన సోనియమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్ననన్నారు.
చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం లోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయి నష్టపోయినప్పటికిని మరి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు ఉండదని చెప్పి పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ తలుపులు మూయించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బిల్లు పాస్ చేయించిన ఘనత అమ్మ సోనియమ్మకు దక్కుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి అయిందన్నారు.ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి,డైరెక్టర్లు బచ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,ఎండి ఖజామియా,బండి సంపత్ గౌడ్, కటబోయిన సంపత్,ఎండి మహమూద్, పుల్లూరు దామోదర్, మార్కేట్ కార్యదర్శి శ్రీనివాస్ రాజు గారు లు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇబ్రహీంపట్నం నేటి దాత్రి:

జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్
వర్షకొండ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి 2025 సంవత్సరం పాఠశాల నుండి 100% ఫలితాలు సాధించడం జరిగింది అలాగే 527 మార్కులతో ఎన్ లహరి.ప్రథమ స్థానంలో స్కూల్ టాపర్ గా నిలిచింది దానితో పాటు స్కూల్ సెకండ్ టాపర్ ఎస్ వర్షిని.ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు గ్రామ మాజీ సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం మరియు మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు ఫోనుకంటి చిన్న వెంకట్. మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరియు ప్రధానోపాధ్యాయులు రాజేందర్. ఘనంగా మొమెంటోలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్ కి సీసీ కెమెరాలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version