వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం..

విచారణ పారదర్శకంగా చేయాలని కోరిన ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ..

కంపెనీల ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్..

రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు..

ఆర్గనైజర్లకు సంబందించిన ఎరువుల దుకాణాలను సీజ్ చేయాలి..

నష్టపరిహారం ఇవ్వకపోతే పోరుబాట పడతాం..

నూగుర్ వెంకటాపురం
(నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండల

వ్యవసాయ శాఖా పనితీరు సరిగాలేదని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆరోపించారు. సోమవారం వ్యవసాయ సహాయ సంచాలకులు అవినాష్ వర్మ ని నాయకులు కొర్స నర్సింహా మూర్తి, ఉయిక శంకర్, పూనెం సాయి వెంకటాపురం మండల కేంద్రం లోని వ్యవసాయ కార్యాలయం లో కలిశారు. మొక్కజొన్న కంపెనీల పేరుతో ఆర్గనైజర్లు రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని రైతులను కోట్ల రూపాయలకు ముంచేసారని అవినాష్ వర్మ కి తెలిపారు. బాండ్ మొక్కజొన్న వ్యవసాయం అని చెప్పి రైతులకు కంపెనీ అగ్రిమెంట్స్ ఏమి ఇవ్వలేదనని అన్నారు. ఎకరానికి మూడు నుండి ఐదు టన్నులు దిగుబడి వస్తుందని నమ్మబలికి నట్లు వివరించారు. పంట దిగుబడి రాకపోతే కంపెనీ నుండి నష్టపరిహారం ఇప్పిస్తానని రైతులకు తెలిపినట్టు వ్యవసాయ అధికారికి తెలియజేసారు. గత పదిహేను రోజుల నుండి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కంపెనీ ఆర్గనైజర్లు రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు. సింజెంట, హైటేక్, మోన్సెంట, సీపీ వంటి విదేశీ విత్తన కంపెనీల ఆర్గనైజర్ల పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని వ్యవసాయ సహాయ సంచాలకులు అవినాష్ వర్మ ని నాయకులు నిలదీశారు. ఆర్గనైజర్ల ఎరువుల దుకాణాలను తక్షణమే మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి లక్ష యాభై వేలు, ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు కంపెనీ నుండి అందేలా చూడాలని వినతిపత్రం లో పేర్కొన్నట్టు తెలిపారు. రైతులు కంపెనీ మేనేజర్ల తో కలిపి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. విచారణ పారదర్శకంగా జరిపించాలని కోరినారు. రైతులకు న్యాయం చేయకపోతే పోరుబాట పడతామని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుల పైన రాజకీయ పార్టీల వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే ఆర్గనైజర్లను పార్టీల నుండి బహిస్కరించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version