విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శనివారం టేకుమట్ల మండలంలోని కస్తూరి భా గాంధీ గురుకుల పాఠశాలలో 2.30 కోట్ల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగ శాల భవనాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూపాలపల్లి కలెక్టర్ గా విధులలో చేరిన సంవత్సర కాలంలో విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మండల ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్ సైతం గురుకుల పాఠశాలల్లో తనికీలు చేపడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు అడిగిన మేరకు పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి, చేతిపంపు, డయాస్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. జిల్లా లోని అన్ని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలో కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…
విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని విద్యాశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో గవర్నమెంట్ పాఠశాలలో సీట్లు కోసం రికమెండ్ చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు. గురుకులాల నుండి పాఠశాలలకు బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించే రోజులు త్వరలో రాబోతున్నాయని.
విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యా బోధన అందించేందుకు మన నియోజకవర్గంలో ఘనపురం మండలం గాంధీ నగర్ గుట్ట వద్ద 30 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ క్యాంప్లెక్స్ ను నిర్మించబోతున్నామని తెలిపారు. తన ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు పాఠశాలలకు 7 కోట్లు వరకు కేటాయించడం జరిగిందని
ప్రభుత్వ గురుకుల పాఠశాలలులో విద్యార్థుల కు వేడి నీళ్లు కొరకు గీజర్లు , దుప్పట్లు అందించామని
త్వరలో గురుకులాల్లో కావలసిన బెడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
విద్యార్థులు చక్కగా చదువుకొని
తమ లక్ష్యాలను చేరుకోవాలని
ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి స్థానిక సంస్థల
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిసిడిఓ శైలిజ, తహసీల్దార్ విజయ లక్ష్మీ, ఎంపీడీవో అనిత, ప్రిన్సిపల్ సప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి .

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట . గ్రామంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్ అధ్యక్షతన మండల మహాసభ జరిగింది. ఈమండల మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీ అభ్యర్థులుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని, అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం, లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ పార్టీ అని నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని వెంకటస్వామి హెచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మండల నాయకులు ఎగుర్ల మల్లేశం, శంకరయ్య, లక్ష్మి, నర్సయ్య, ఐలయ్య, రాజేష్, అజీమ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి..

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ

మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు

నడికూడ:నేటిధాత్రి

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్ధన సమయాని కంటే ముందుగానే పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థన చేశారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిత్యం పాఠశాలలను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని ప్రార్థన జరుగుతున్న విధానాన్ని పరిశీలించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.ఆ తర్వాత పాఠశాలలోనే మధ్యాహ్న భోజన రికార్డులను, విద్యార్థుల హాజరు పట్టికలను,ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయలు అచ్చ సుదర్శన్ ఉపాధ్యాయులు లకావత్ దేవా ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version