ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు

-సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు

 

-మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు

-క్షమించి మమ్మల్ని రమ్మంటారా?

-వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా!

-రమ్మంటే పరుగెత్తుకొస్తాం

-మేమక్కడ నెగలలేకపోతున్నాం…

-కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం

-ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు

-ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు

-మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు

-ప్రజల ముందు చులకనయ్యాం

-ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం

-కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు

-ముందు నుయ్యి, వెనుక గొయ్యి తొవ్వుకున్నారు

-ఎమ్మెల్యేలను ఆదరించకపోవడంలో కాంగ్రెస్‌ నాయకుల తప్పేం లేదు

-పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వేధించింది వీళ్లే

-పదేళ్లు పడరాని పాట్లు పడి కాంగ్రెస్‌ కోసం పనిచేశారు

-అనేక కేసులు ఎదుర్కొన్నారు

-నిర్భంధాలు చూశారు…పోలీసు దెబ్బలు తిన్నారు

-పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తనం లేక కాంగ్రెస్‌ నాయకులు సలసల కాగుతున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యే లకు సలాం కొట్టలేకపోతున్నారు

-కాంగ్రెస్‌ నాయకులు పాత బకాయిలు తీర్చుకునే సమయంలో వచ్చి చేయందుకున్నారు

-ఇది కాంగ్రెస్‌ నేతలకు సుతారం ఇష్టం లేదు

-అప్పుడు అదే ఎమ్మెల్యే పెత్తనం.. ఇప్పుడు అదే ఆధిపత్యం

-కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు

-ఎమ్మెల్యేలైనా సరే లెక్క చేయడం లేదు

-ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుల వెంటనే కార్యకర్తలుంటున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు

-కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కుబిక్కుమంటున్నారు

-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్‌లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్‌ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్‌ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్‌ఎస్‌ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్‌లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్‌ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్‌ దక్కకపోవచ్చు. కాంగ్రెస్‌లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్‌పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌నుంచి బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్‌ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్‌ఎస్‌కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్‌ఎస్‌ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్‌పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్‌లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్‌లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్‌ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్‌ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్‌ఎస్‌ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్‌ఎస్‌ను అణచివేయొచ్చు. బిఆర్‌ఎస్‌ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్‌ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్‌ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్‌ఎస్‌ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్‌ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్‌ఎస్‌ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్‌ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్‌లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్‌ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్‌లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్‌ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్‌ఎస్‌ ఛీప్‌తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్‌, హరీష్‌రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్‌ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ టికెట్‌ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్‌లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్‌ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్‌ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్‌ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్‌ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్‌ఎస్‌ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.

మందమర్రి హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించ.!

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి కార్మల్ హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించి రంగులతో ముగ్గులు వేసి అలరించారు.

మందమర్రి నేటి ధాత్రి

Science

ఈ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తేదీ 4 -3 -2025 రోజున మన కార్మెల్ పాఠశాలలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ రంగోలి కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవ శాస్త్రాలు యొక్క పటాలను విద్యార్థులు చాలా చక్కగా డ్రా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి డాక్టర్ ఫాదర్ జె.వి.ఆర్ రెక్స్ జె, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎమ్ కుమారస్వామి, జీవశాస్త్ర ఉపాధ్యాయిని ఐ సునీత మేడం ఇతర సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పిఈటి కృష్ణ గారు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని ఈ రంగోలి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన.

ఝరాసంగం: ఆయిల్ పామ్తో అధిక ఆదాయం

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన

జహీరాబాద్. నేటి ధాత్రి:

మహిళా రైతు చంద్రమ్మ 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటను సాగు చేశారు. కేవలం 15 నెలల్లోనే మొక్కలు పుష్పించాయి. మంచి వృద్ధిని చూపుతున్నాయి. తోటల అభివృద్ధి శాఖ రాయితీపై మొక్కలను అందించగా, ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఎకరానికి నాలుగు సంవత్సరాలపాటు రూ.4,200 మంజూరు చేస్తోంది. పంటకు గిట్టుబాటు ధర రూ. 20,871 ప్రకటించడంతో ఈ పంట రైతులకు లాభదాయకంగా మారుతోంది.

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

పంపిణీ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

గత ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు కుట్టు
మిషన్లు పంపిణీ చేయకుండా రైతు వేదికలో ఉంచిన 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పాడవుతున్నాయని వేంటనే తహాశీల్దార్ హేమ మహిళా దినోత్సవం రోజున అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ* చేయాలి.
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు.
మంగళవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు వేదికలో ఉంచిన కుట్టు మిషన్లు పరిశీలించి అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని తహాశీల్దార్ కార్యాలయంలో ఎంపీఎస్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన మహిళలకు మండలంలో ఉన్న గ్రామాలల నుండి కొంతమందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషను ఇచ్చి వారి కుటుంబం అభివృద్ధి చెందడం కోసం కుట్టు మిషన్లు తెప్పించి రైతు వేదికలో ఉంచిందని మహిళలకు పంపిణీ చేయకుండా అది రైతు వేదికకే పరిమితం అయ్యిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తహశీల్దార్ హేమ చొరవ తీసుకుని తక్షణమే అర్హులైన మహిళలకు మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతు వేదికలో ఉన్న 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పోతాయని అన్నారు. మహిళలు వీటి ద్వారా సాధికారత సాధించి అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం వలన 60 కుటుంబాలను ఆదుకున్న వారిమి అవుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి కార్యవర్గం సభ్యులు పుల్యాల సురేష్ నద్దునూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.

నేటిధాత్రి కథనం,తో ఉద్యోగుల పై “ఆ అధికారి” ఆగ్రహం.!?

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!?

నేను మీ బాస్,మీకు ఉద్యమం నుండి తొలగిస్తా అంటూ సీరియస్.!?

అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!?

ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!?

ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!?

ఆ అధికారి బండారం బయటకు వచ్చిన ఉన్నత అధికారులు స్పందన కరువు ఎందుకు.!?

మహాదేవపూర్-నేటిధాత్రి:

నేటి రాత్రి దినపత్రిక ప్రచురించిన “అవినీతికి పాల్పడితేనే, సై లేదంటే విజిలెన్స్ దాడులు.” అనే శీర్షికపై మండలంలోని ఆ శాఖ అధికారి తన సిబ్బందిపై విరుచుక పడినట్లు సమాచారం. శాఖలోని విభాగాలకు సంబంధించిన బాధ్యతలను విధుల నుండి తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా శాఖలో జరిగే వ్యవహారం బయటకు ఎలా వెళ్లిందని సిబ్బందితోపాటు శాఖలోని విభాగాలకు సంబంధించిన పలువురిని ప్రత్యేకంగా మీరే చెప్పారంటూ వార్నింగ్లు ఇవ్వడం జరిగిందని, ఇదే క్రమంలో ఆ అధికారి ప్రత్యేకంగా కొందరు శాఖలోని ఉద్యోగులతో పాటు విభాగాలకు సంబంధించిన బాధ్యులపై మరింత ఒత్తిడి పెంచినట్లు విశ్వ నీ సమాచారం. ఆ శాఖ అధికారి వ్యవహారం తిర పైకి వచ్చినప్పటికీ కూడా ఉన్నత అధికారులు విచారణ జరిపించకపోవడం అధికారిపై చర్యలు తీసుకోకపోవడం శాఖలోని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!?

మండలంలోని ఆ శాఖ అధికారి వ్యవహారం సొంత శాఖలో విజిలెన్స్ దాడులు, అవినీతికి పాల్పడకుంటే సిబ్బందితోపాటు, విభాగాల బాధ్యులపై కక్ష సాధింపుతో విజిలెన్స్ దాడులు ఉద్యోగం నుండి వెళ్లిపోయేలా హింసించడం, ఆ అధికారికి గత కొన్ని నెలలుగా మహాదేవపూర్ మండల ఆ శాఖ సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు హింసను తట్టుకోలేకపోతున్న క్రమంలో విజిలెన్స్ దాడులు తెరపైకి రావడం ఆ శాఖ అధికారి వ్యవహారం అంతర్గతంగా మండలమంతా ఇతర శాఖల్లో కూడా చర్చనీయంగా మారడంతో, నేటి ధాత్రి ఆదివారం రోజు,” అవినీతికి పాల్పడితేనే సై లేదంటే విజిలెన్స్ దాడులు” అనే శీర్షికను ప్రచురించింది. ఆదివారం శీర్షిక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న క్రమంలో ఆ శాఖ అధికారి వ్యవహారమంతా ఆ శీర్షికలో ఉండడం తన శాఖ తన గురించి ఇలా బయటికి వచ్చిందని,ఆదివారం సెలవు రోజు తన మొబైల్ ఫోన్ ను పనిలో పెట్టడం చేశాడట అధికారి, కిందిస్థాయి ఉద్యోగులతో పాటు శాఖలోని ఇతర విభాగాల బాధ్యులకు ఫోన్ ద్వారా వార్నింగ్ లు ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం. తనకు ఏమనుకుంటున్నారు, మీ శాఖ అధికారిని అంతర్గత వ్యవహారం ఏలా బయటికి పొక్కింది, నేను ఏమైనా చేస్తా మీరు ఎలా సమాచారం బయటకి చెప్తారు, ఉద్యోగం పై ప్రేమ లేదా, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి మీ ఉద్యోగం పోయేలా చేస్తానని సిబ్బంది మరియు, ఆ శాఖలోని విభాగాల బాధ్యులకు వార్నింగ్ లు ఇవ్వడం తో ప్రస్తుతం శాఖలోని కిందిస్థాయి సిబ్బంది తమపై అన్యాయాలు చేసి అవినీతికి పాల్పడాలి అనే అధికారి తమకు ఉన్నత అధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకుంటున్నట్లు సమాచారం.

అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!?

ఆ శాఖ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కింది స్థాయి ఉద్యోగులకు శాఖలోని ఇతర విభాగాలకు సంబంధించిన బాధ్యులకు, కచ్చితంగా అవినీతి చేసి తమ వాటా ఇవ్వాలని ఒత్తిడి తట్టుకోలేక ఆ శాఖకు సంబంధించిన కొందరు బాధ్యులు కిందిస్థాయి ఉద్యోగులు బదిలీ చేసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అలాగే మరికొందరు ఉద్యోగులు సైతం తమ రిటైర్మెంట్ కాలం దగ్గర ఉందని అధికారి ఒత్తిడికి చెప్పుకోలేక విధులు నిర్వహిస్తున్నట్లు, మరికొందరు అధికారిని ప్రశ్నించే సత్తా ఉన్నప్పటికీ పై అధికారులు కూడా ఆ అధికారికి అంతర్గతంగా సహకారం ఉందని తెలుసుకున్న సిబ్బంది ఇతర శాఖల బాధ్యులు, చేసేదేమీ లేక వీరి ప్రాంతానికి బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం ఆ శాఖ పరిస్థితి ప్రతి ఒక్కరూ బదిలీపై వెళ్లే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో శాఖలోని విభాగాలు కిందిస్థాయి ఉద్యోగులు లేక శాఖ కార్యాలయం తో పాటు కార్యకలాపాలు త్వరలో ఆగిపోయే పరిస్థితి నెలకొల్పే విధంగా కనబడుతుంది.

ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!?

మండలంలోని ఆ శాఖ అధికారి ప్రస్తుతం మూడు ప్రధాన విభాగాలను టార్గెట్ చేసి ఎక్కువ మోతాదులో ఆదాయ వనరులు ఉండడంతో ఆ విభాగాలకు సంబంధించిన బాధ్యులను ప్రధానంగా టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో నెలసరి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ శాఖలోని మిగతా విభాగాలు తక్కువ మోతాదులో ఆదాయ వనరులు ఉండడంతో వారిని కూడా వారి స్తోమతకు మించి అవినీతికి పాల్పడాలని హింసిస్తూ తనకు నెలసరి వాటా కచ్చితంగా ఇవ్వాలని నికిత చిన్న తరహాలో నిర్వహించబడుతున్న విభాగాల బాధ్యులకు హుకుం జారీ చేసి వారి వద్ద నుండి నెలసరి జీతంల అక్రమ సొమ్మును పీడించి వసూలు చేయడం జరుగుతుందని లేదంటే విజిలెన్స్ దాడులకు సిద్ధంగా ఉండాలని అధికారి హుకుం జారీ చేయడం జరుగుతుందని సమాచారం. అధికారి ఒత్తిడికి తట్టుకోలేక సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు అవినీతికి పాడు పరిస్థితి లేకపోవడంతో తమ జీతాల నుండి అధికారికి రూపాయలు ఇచ్చి ఎలాగో అలా తమ ఉద్యోగాన్ని దక్కించుకొని విధులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నట్లు సమాచారం.

ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!?

జిల్లాలోని సొంత శాఖలో కిందిస్థాయి ఉద్యోగులు విభాగాల బాధ్యులకు అవినీతి కొరకు ప్రోత్సహించి నెలసరి జీతం లాగా అక్రమాలు చేసి సొమ్ము అందించాలని లేదంటే విజిలెన్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి ఉద్యోగం లేకుండా చేస్తానని సొంత శాఖ సిబ్బంది విభాగాల బాధ్యులకు పీడిస్తున్న ఆ అధికారి బండారం బయటపడినప్పటికీ, శాఖకు సంబంధించిన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరోవైపు ఆ శాఖలోని సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు పీడించే ఆ అధికారికి జిల్లాలోని కొందరు ఉన్నత అధికారులు అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నారని అందుకొరకు ఆ అధికారి తనకంటే పై అధికారులకు కూడా గౌరవం భయం లేనివిధంగా ప్రభాస్ తీస్తున్నాడని చెప్పుకుంటూ ఆశ్చర్యా పోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ అధికారి ఎక్కడ విధులు నిర్వహించిన, కింది స్థాయి ఉద్యోగులకు పీడించడమే లక్ష్యంగా అవినీతికి పాల్పడి తనకు సొమ్ము అందించడమే సిబ్బంది విభాగాల బాధ్యులు చేసే ప్రధాన పని అని పీడించడం ఆ అధికారికి కొత్తవి కాదని, కానీ జిల్లా మరియు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటివరకు ఆ అధికారిపై చర్యలు తీసుకోకపోవడం ప్రధాన కారణం ఏమిటో ఆ శాఖ పలు అధికారులకు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ఏది ఏమైనా సొంత శాఖలో ఇలా అవినీతి చేసి ప్రతినెలా మామూలు ఇవ్వాలని పీడిస్తున్న మండలంలోని ఓ శాఖ అధికారి ఇలాంటి అధికారి మరియు శాఖ రాష్ట్రంలోని ఎక్కడ ఉండదు, కానీ ఈ అధికారి మాత్రం నిర్భయంగా సొంత శాఖలో సిబ్బందికి విభాగాల బాధ్యులకు పీడించి అక్రమ సొమ్ము నెలసరి జీవితంలో దోచుకోవడం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆ శాఖలో ఈ అధికారిపై రోజుకు ఒక కొత్త రకమైన అవినీతి తెరపైకి రావడం అధికారులు ఇలాంటి చర్యలపై మొగ్గు చూపుతారు అన్నది వేచి చూడాల్సిందే.

సింగరేణి సి&ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశానుసారంగా.

సింగరేణి సి&ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశానుసారంగా సింగరేణి విద్యా సంస్థలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దడానికి అడుగేస్తున్నాము :

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి విద్యా సంస్థలలో 9 పాఠశాలలు ఒక మహిళా జూనియర్ కాలేజ్, ఒక మహిళా డిగ్రీ మరియు పీజీ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ను మొత్తం 7642 విద్యార్థులతో విజయవంతంగా నడిపిస్తున్నాము.

C&MD

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ది కై అకాడమిక్స్ & క్రీడలు అథ్లెటిక్స్ మ్యూజిక్, NCC మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ఇస్తున్నాం.

విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యని అందించాలనే ఉద్దేశంతో యోగా మరియు మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది

అధ్యాపకులు మరియు ఆచార్యులకు ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం.

అధ్యాపకులను వివిధ విద్యాసంస్థలకు పంపి అక్కడి మంచి పద్ధతులు తెలుసుకొని మన విద్యాసంస్థల్లో ఆచరణలో పెట్టడానికి చర్యలు తీస్కుకొవడం జరుగుతుంది

సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ లో ఎన్ పి టీ ఈ ఎల్ చాప్టర్ NPTEL Chapter ను ప్రారంభించి విద్యార్థులను మరియు అధ్యాపకులను అనేక కోర్స్ లలో నమోదు చేయించడం జరిగింది.

C&MD

2024-25 సంవత్సరానికి గాను సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కి NAAC అక్రిడేషన్ రావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాం.

సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీ మరియు సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ లో కొత్త కోర్సలు పెట్టబోతున్నాం. పాలిటెక్నిక్ కాలేజీలో ఏఐఎంఎల్ అనే కొత్త కోర్సుని ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు వస్తాయని యాజమాన్యం ఈ యొక్క కోర్స్ ను ప్రవేశ పెట్టబోతుంది.

సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్ లొ NBA అక్రిడేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఐఐటీ జేఈఈ నీట్ మరియు బిట్సాట్ పరీక్షలపై అవగాహన మరియు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది

సింగరేణి కాలరీస్ హై స్కూల్, సెక్టార్-3 గోదావరిఖని సీబీఎస్సీ సిలబస్ ను ఈ సంవత్సరం ప్రారంభించనున్నారు.

C&MD

పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహించి గైర్హాజారు నీవారించడం మరియు సమయపాలన పాటించడం గురించి చెప్పడం జరుగుతుంది అలాగే వారిని మంచి శిక్షణ పద్ధతులు లైఫ్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ ఎలా ఇవ్వాలో చెప్పడం జరుగుతుంది.

స్కూల్ విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ సైన్స్ ఎగ్జిబిషన్ మరియు ఎడ్యుకేషన్ టూర్ లకు తీసుకు వెళ్లడం జరుగుతుంది

సింగరేణి పాఠశాలల కరస్పాండెంట్ల ఎప్పటికప్పుడు special focus పెడుతున్నారు.
సుమారు అధ్యాపకులు మరియు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే పదవ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం

సింగరేణి కాలరీస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు మరియు అధ్యాపకులు ఇస్రో స్టార్ట్ ప్రోగ్రాం లో పాల్గొనడం జరిగింది

అలాగే సింగరేణి విద్యార్థిని విద్యార్థులు గౌరవ ప్రధానమంత్రి వర్యుల పరీక్ష పే చర్చ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

సింగరేణి పాఠశాలలో మొదటిసారిగా పాఠశాల
విద్యార్థిని విద్యార్థులు సైన్స్ మరియు మ్యాథ్స్ ఒలింపియాడ్స్ లో పాల్గొనడం జరిగింది

అలాగే సీఎం కప్ క్రీడలలో లో సుమారు 500 విద్యార్థులు పాల్గొనడం జరిగింది

సింగరేణి విద్యా సంస్థల అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు
టీచర్స్ యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది
మరియు ఐఐటీ ప్రవర్తక్ కెరీర్ కౌన్సెలింగ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
విద్యార్థుల పరీక్షల దృష్ట్యా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పెట్టి దృష్టి పెడుతున్నాం
ఇందులో భాగంగా వారికి అల్పాహారం/స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది

పాఠశాలల ఆవరణలో భారతదేశ మరియు ప్రపంచంలో పేరుగాంచిన శాస్త్రవేత్తల మరియు స్వాతంత్ర సమరయోధుల ఫ్లూట్ బోర్డ్ లను పెట్టడం జరిగింది

అన్ని సింగరేణి పాఠశాలలో NCC ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఈ సంవత్సరం సింగరేణి కాలరీస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు సింగరేణి కాలరీస్ హై స్కూల్ మందమర్రి 50 వసంతాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవములు జరుపుకోబోతున్నది అని వ్యక్తపరిచారు.

ముఖ్య అతిథి;
సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రటరీ జి శ్రీనివాస్ పాల్గొన్నవారు;
నస్పూర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నరసింహస్వామి,

సిసిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ దేశాయ్,

మందమర్రి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం, తదితరులు పాల్గొనడం జరిగింది.

అక్రమాలకు అందా ఏజెన్సీ సర్కార్ భూముల సంతర్పణ.

 

ఏజెన్సీ లో భుదాందా
అక్రమాలకు అందా ఏజెన్సీ

సర్కార్ భూముల సంతర్పణ

నూగుర్ వెంకటాపురం
(నేటి ధాత్రి ) మార్చి 4 ములుగు జిల్లా వెంకటాపురం మండలం

ఆదివాసి సంక్షేమ పరిషతమంగళవారం నాడు వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు హాజరై మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70,పీసా చట్టాలకు వ్యతిరేకంగా వెంకటాపురం (Z) సర్వేనెం 4/1,4/2,68,69 ప్రభుత్వ భూములను కబ్జా చేసి క్రయాయిక్రయాలు చేస్తూ భూదందా కి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.ఏజన్సీ చట్టాలను, కఠినంగా అమలు చేయాల్సిన ప్రభుత్వ రెవిన్యూ ఆఫీసర్లు నాటి సర్కార్ పెద్దలు కుమ్మక్కై ప్రభుత్వ భూములను కబ్జా చేసి భూదందాకు తెరలేప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా బహుళ అంతస్తులు నిర్మిస్తుంటే వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ,రెవెన్యూ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెంకటాపురం (Z) సర్వే నెంబర్లలో సమగ్ర విచారణ జరిపి కబ్జాకు పాల్పడిన గిరిజనేతరులపై ఎల్.టి.ఆర్ కేసులు నమోదు చేసి ఆ ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూములేని నిరుపేద ఆదివాసులకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, బొగ్గుల రాజ్ కుమార్, సంపత్, పూనెం అర్జున్, నవదీప్ తదితరులు

 పాల్గొన్నారు.

 

 

శంభునిపేట సబ్ డివిజన్లో ఘనంగా లైన్మెన్ దినోత్సవం.

శంభునిపేట సబ్ డివిజన్లో ఘనంగా లైన్మెన్ దినోత్సవం

వరంగల్, నేటిధాత్రి

వరంగల్ శంభునిపేట కరెంట్ సబ్ డివిజన్ ఆఫీసులో
మంగళవారం నాడు లైన్మెన్ దినోత్సవ సందర్భంగా మల్లికార్జున్ డీఈ, చంద్రమౌళి ఏడిఈ ల ఆధ్వర్యంలో, సబ్ డివిజన్ పరిదిలోని శంభునిపేట, కరీమాబాద్, మామునూర్ సెక్షన్ల విద్యుత్ సిబ్బందికి, విద్యుత్ భద్రత నియమాలపై, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించుట గురించి, వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే వేసవికాలంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేసవికి ముందే లైన్లు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని నిర్వహణ చేసుకొని రాబోవు వేసవిలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అందరికీ భద్రతా పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు సిబ్బంది అందరికి లైన్ మెన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన పనితీరు కనబరిచిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు రవి, సంపత్, సురేందర్ మరియు సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.

సమానత్వంతోనే సమాజ పురోగతి.

సమానత్వంతోనే సమాజ పురోగతి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ, నేటిధాత్రి :

ఎలాంటి అవాంతరాలు లేకుండా స్త్రీ, పురుష సమానత్వంతోనే సమాజం పురోగతిని సాధిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
మంగళవారం హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో యాక్సిలరేట్ యాక్షన్ అనే అంశం పై సమావేశాన్ని నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరై అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గతంలో బాలబాలికల నిష్పత్తితో పాటు విద్యలోనూ వ్యత్యాసం ఉండేదని, కానీ అది నేడు తగ్గిపోతూ వస్తుందన్నారు. సమాజంలో వివిధ అవకాశాలను పొందేందుకు మహిళలకు సమాన హక్కులు రాజ్యాంగంలో కల్పించబడ్డాయన్నారు. మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలికలు విద్యా, ఉద్యోగ, ఇతర రంగాలలో సమాన అవకాశాలను సాధించాలన్నారు. స్త్రీ,పురుష సమానత్వం సాధించినప్పుడే సమాజం పురోగమిస్తుందన్నారు.
మహిళా సాధికారతను సాధించాలని ఆకాంక్షించారు . విద్యా,ఉద్యోగం, ఇలా ఏ రంగంలోనైనా మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విభిన్న రంగాలలో మహిళలు రాణిస్తున్నారని, ఎంచుకున్న లక్ష్యం కోసం కష్టపడాలన్నారు. ఎంచుకున్న లక్ష్యం కోసం కష్టపడి సాధించి నిరూపించుకోవాలన్నారు. స్త్రీ పురుషులు సమానం అనే భావన సమాజంలో నెలకోనాలన్నారు. ఈ సందర్భంగా ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
గౌరవ అతిథిగా హాజరైన కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం మాట్లాడుతూ భిన్న రంగాలలో మహిళలు రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. సమాజంలో మహిళలు అనేక విధాలుగా హింసలను, అవమానాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నేటి అభివృద్ధి చెందిన సమాజంలోనూ అలాంటి పరిస్థితులు పోయి మహిళలకు సమున్నత స్థానం కల్పించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమాజంలోని బాలికలను, మహిళలను గౌరవించే విధంగా పెంచాలన్నారు. ఎలాంటి అంతరాలు లేకుండా బాలబాలికలను తల్లిదండ్రులు సమానంగా పెంచాలని అన్నారు. నేడు సమాజంలో బాలికలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, విదేశాల్లోనూ విద్య, ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. విభిన్న రంగాలలో మహిళల మరింతగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ సమాజంలోని మహిళలను గౌరవించాలని అన్నారు. విభిన్న రంగాలలో మహిళలు రాణించినప్పుడే సమాజం ఎదుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ సమాజంలో బాలబాలికలకు సమాన గౌరవం ఉండాలన్నారు. బాల బాలికలను సమానంగా తల్లిదండ్రులు పెంచాలన్నారు. భావి జీవితం కోసం ఒక ప్రణాళికతో లక్ష్యం కోసం బాలికలు బాగా చదవాలన్నారు. బాలికలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ డాక్టర్ కె.అనితా రెడ్డి మాట్లాడుతూ విభిన్న రంగాల్లో మహిళలు సాధికారతను సాధిస్తున్నారని అన్నారు. ఎంచుకున్న ఏ రంగంలోనైనా ముందుకెళ్లాలన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని మహిళలు సాధించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, తదితరులను మహిళా అధ్యాపకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉమెన్స్ సెల్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీధర్ కుమార్ లోథ్, తిరునహరి శేషు, మహిళా అధ్యాపకులు, విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.

స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి.!

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి

విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డి ఈ వో కు వినతి పత్రం అందజేత

హనుమకొండ, నేటిధాత్రి :

అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తూనా స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు 7 నెల నుండి రాలేకపోవడం వలన కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారుతుందని అన్నారు. పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రత, పాఠశాల ఆవరణం మొత్తం పరిశుభ్రం చేస్తున్న క్రమంలో వేతనాలు రాలేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కావున జిల్లా కలెక్టర్, డీఈవో జ్ఞానేశ్వర్ స్పందించి స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది.

పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ప్రజా భవన్ ముట్టడి కొరకు హైదరాబాద్ కు వెళ్తున్న 11 మంది అంగన్వాడి సిబ్బందిని రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ ఏరియాలో 11 మంది అంగన్వాడీ సిబ్బంది ఓకే చోట చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా వారి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయనే ఉద్దేశంతో అంగన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

ఎల్ఆర్ఎస్ 2020 స్కీం పై ప్రభుత్వం రాయితీ.

ఎల్ఆర్ఎస్ 2020 స్కీం పై ప్రభుత్వం రాయితీ….

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

2020 వ సంవత్సరంలో ప్లాట్ ను ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం భూమి రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఫీజు పై 25 శాతం రాయితీ ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులరైజ్ చేసిన ఫ్లాట్లకు భవన అనుమతులు సులభంగా అందుతాయని, మార్కెట్ విలువను డాక్యుమెంట్ విలువ ఆధారంగా అంచనా వేయబడుతుందని, బ్యాంకు లోన్ ప్రాసెసింగ్ సమయంలో ప్రయోజనాలు ఉంటాయని, భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు 33% జరిమానా చార్జీలను నివారించవచ్చని కమిషనర్ తెలిపారు.

ఎమ్మెల్సీగా శ్రీ పాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల విజయం.

ఎమ్మెల్సీగా శ్రీ పాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల విజయం

నడికూడ,నేటిధాత్రి:
వరంగల్,ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం ఉపాధ్యాయుల విజయమని నడికూడ మండలశాఖ పి ఆర్ టి యు అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు.ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయమని, ఎవరెన్ని కుట్రలు చేసినా టీచర్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనీ చూసిన అంతిమంగా ఉపాధ్యాయులు విజయం సాధించారని అన్నారు.ఈ విజయం లో పాలుపంచుకున్న ప్రతి ఉపాధ్యాయునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.నడికూడ మండల కేంద్రంలో అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలలో భాగంగా ఉపాధ్యాయులకు స్వీట్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖదికారి హనుమంతు రావు,నడికూడ మండల శాఖ ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల సతీష్,రాష్ట్ర అధ్యక్షులు గొట్టేముక్కుల శ్రీనివాస్ రెడ్డి, మోడెం రాజేందర్ బాబు, నన్నే సాబ్,బూరుగు శంకర్,ప్రేమానందం,బాలాజీ, దొంతుల శ్రీనివాస్, శివచేతన్,శ్రావణ్ కుమార్,రాజు నాయక్, కృపమ్మ, సుమలత, జయ,శివకుమార్,రవీందర్, క్రిష్ణమ్ రాజు సింగ్,రామయ్య,సదానందం, సుభాని తదితరు లు పాల్గొన్నారు.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో మంగళవారం రోజున విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ను జరుపుకున్నారు.
విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మంచి వేషధారణతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులను మరిపించే విధంగా బోధన చేశారు వీరి తీరును చూసి ఎంఈఓ కోడపాక రఘుపతి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పుల్ల హర్షవర్ధన్ ఎంఈఓ గా వెళ్దండి సహస్ర, డిఈఓ గా మొగుళ్ళ సాయి చరణ్,లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి జడ్జిలుగా తుపాకుల వందన,గడ్డం శంకర్,కుచనపల్లి శ్రీనివాసులు వ్యవహరించారు.
అనంతరం వారి అనుభవాలను పంచుకున్నారు. పవిత్రమైన బోధనా వృత్తి తమకంతో ఆనందం కలిగించిందని, అందులోని కష్టసుఖాలను ఈ కార్యక్రమంలో ద్వారా తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోడపాక రఘుపతి ఎంఈఓ , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి గారు ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, సరళాదేవి,నీలిమారెడ్డి, విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, బుర్ర సదయ్య,సుజాత,బుజ్జమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు

పాల్వాయి శ్రీనివాస్ కి స్వాగతం పలికిన పరకాల.!

పాల్వాయి శ్రీనివాస్ కి స్వాగతం పలికిన పరకాల ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ మంగళవారం రోజున సందర్శించారు.మార్కెట్ కి విచ్చేసిన శ్రీనివాస్ ని పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికడం జరిగింది.

అక్రమ రేషన్ బియ్యం దందా అరికట్టాలి.

అక్రమ రేషన్ బియ్యం దందా అరికట్టాలి.

రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించాలి

తాసిల్దార్ కు వినతి
పత్రం అందజేత

చిట్యాల,నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోకొంతమంది రేషన్ డీలర్లు రేషన్ లబ్ధిదారుల నుండి అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొంటూ సొమ్ము చేసుకుంటున్నారని జూకల్ మరియు మండలంలోని రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించాలని మండల రెవెన్యూ వ్యవస్థను కోరుచున్నాము
పై విషయాలపై మంగళవారం రోజున మండల తహసిల్దార్ కార్యాలయంలోని ఎంపీఎస్ఓ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
మాట్లాడుతూ కొంతమంది రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి కేజీకి 7నుండీ 10 రూపాయలకు రేషన్ బియ్యాన్ని కొంటూ వాటిని మధ్య దళారీలకు ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నాం. అదేవిధంగా మండలంలోని రైస్ మిల్లర్లు పిడిఎస్ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్నబియంగా మార్చి గ్రామాలలోని కిరాణాలలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నాం.
పై విషయాలన్నిటిపై మండల రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దొడ్డు బియ్యం అక్రమ రవాణా రైస్ మిల్లర్ల రీసైక్లింగ్ వ్యవస్థలపై ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులు ఉక్కు పాదం మోపాలని కోరుతున్నాం. లేనిపక్షంలో మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు కనకం తిరుపతి పాల్గొన్నారు.

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు.

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు
చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి ముల్క కొమురయ్య భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతా తెలియజేస్తూ మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు, ఈ సంబరాల కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముల్క కొమురయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ పొంచేట్టి రాకేష్,మండల ప్రధాన కార్యదర్శి గంగరాజు, పత్తిపాక శ్రీనివాస్, కొక్కుల నరేష్, తోట శంకర్,అయోధ్య పర్శరాములు, మట్కామ్ మల్లేశం,లింగాల రాజయ్య, సిరికొండ తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిధులు మంజూరైన చెల్లింపులో జాప్యం ఎందుకు.?

నిధులు మంజూరైన చెల్లింపులో జాప్యం ఎందుకు…..??

సర్వే చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇంకా చెల్లించని రెమ్యూనరేషన్..!!!

చెల్లించినట్లుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన

సర్వేలో ఒత్తిడి పెంచిన అధికారులు – రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం

అధికారుల తీరు సరికాదు

రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:

మంగళవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో సర్వే రెమ్యునరేషన్ చెల్లింపు జాప్యం పై నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొన్న ఉద్యోగ ,ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో సర్వే పూర్తి చేయుటకు గాను ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. సర్వే పూర్తయిన వెంటనే ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందని వివరించారు .కానీ అధికారులు నేటికీ ఉద్యోగ ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించలేదని విమర్శించారు. సర్వే త్వరగా పూర్తి చేయాలని ప్రతిరోజు తీవ్ర వత్తిడి తెచ్చిన అధికారులు రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం ఎందుకింత జాప్యం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా సర్వే రెమ్యూనరేషన్ చెల్లించినట్లుగా అసెంబ్లీలోనే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రెమ్యూనరేషన్ సత్వరమే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

job and teachers

ఈ నిరసన కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు కార్యదర్శి వీసం నరసయ్య ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఏ.రమాదేవి, ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్ , అప్పాల నాగరాజు , ఎం . నరసింహస్వామి, సురేష్ కుమార్ , భూక్య శ్రీనివాస్, టీ బీ విజయ్ లు పాల్గొన్నారు.

రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు.

మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు

– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

– మల్కపేట రిజర్వాయర్, పంప్ హౌస్, కంట్రోల్ రూం తనిఖీ

కోనరావుపేట/సిరిసిల్ల(నేటి ధాత్రి):
మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. మల్కపేట రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది అని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి ని ఆరా తీయగా, ఈ రోజు 0.75 టీ ఎం సీ ల నీరు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

water

అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈ రోజు 0.5 టీఎంసీల నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్ కు చేరుకోగానే.. దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు. ప్రాజెక్ట్ పరిధిలో పంటలు వేసిన రైతులు సాగు నీరు విషయమై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రాజెక్ట్ లో నీటి నిలువలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ వెంట ఈఈ కిషోర్, డీఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా లైన్మెన్ దినోత్సవం నిర్వహణ.

ఘనంగా లైన్మెన్ దినోత్సవం నిర్వహణ

కామారెడ్డి జిల్లా/పిట్లం నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని సెక్షన్ ఆఫీసులో లైన్ మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎల్, ఏఎల్ఎం, ఎల్ఎం, ఎల్ఐ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంచి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏడిఈ అరవింద్ మాట్లాడుతూ, లైన్ మెన్ లు విధిని అత్యంత ప్రతిభావంతంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అలాగే, విధి నిర్వహణలో సేఫ్టీ జాగ్రత్తలను పాటించవలసిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సురక్షిత మార్గదర్శకాలను అందజేశారు. లైన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రెడ్డి మరియు సెక్షన్ స్టాఫ్ మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version