ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….

ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-86.wav?_=1

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని బిజొన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి ఆధ్వర్యంలో రజకుల కుల దైవం మడేలేశ్వర స్వామి,సీతాలమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి రజక సంఘం కార్యాలయం నుండి అమరవాది చెరువు సమీపంలోని మడేలేశ్వర స్వామి గుడి వద్దకు పెద్ద ఎత్తున వెళ్లి బోనాలు సమర్పించారు. అనంతరం బిజొన్ రజక సంఘం అధ్యక్షుడు నడిగోట తిరుపతి మాట్లాడారు.

Seethalamma Bonala Jatara.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రజకుల కుల దైవం అయిన మడేలయ్య కు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తామని అన్నారు.దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నడిగోట శంకర్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పున్నం సమ్మయ్య,తిరుపతి, కనకయ్య,రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, జిల్లా కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శి పైతరి ఓదెలు, సంఘం సభ్యులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు..

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-56.wav?_=2

జహీరాబాద్ నేతి ధాత్రి:

దక్షిణ కాశీగా పిలిచే ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కృష్ణపక్షం, బహుళ దశమి పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సహస్రనామాలు, కుంకుమార్చన, బిల్వార్చన తదితర పూజలతో మంగళహారతి చేశారు. సోమవారం కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

వనపర్తి లో వీరభద్ర స్వామి సమేత శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు.

వనపర్తి లో వీరభద్ర స్వామి సమేత శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు
వనపర్తి నెటిదాత్రి:

 

వనపర్తి పట్టణంలో పాత కోటలో పురాతన వీరభద్ర స్వామి సమేత శివకేషవ ఆలయం
అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకము నిమ్మకాయలతో అలంకరణ ప్రసాద వితరణ చేయడం జరిగినదనిఆలయ చైర్మన్ పూరి సురేష్ శెట్టి తెలిపారు అనారోగ్యం వల్ల దేవాలయానికి రావడం లేదని పూరి తెలిపారు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానం చేశామని పూరి సురేష్ తెలిపారు ఈ సమావేశంలో ఆలయ కమిటీ కార్యదర్శి ఏర్పుల సాయి కోశాధికారి ఈశ్వరమ్మ ఉపాధ్యక్షులు శ్రీరామమూర్తి స్వప్న ఫోటో స్టూడియో రవి రామస్వామి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

పాలక మండలి సభ్యులు కే మల్లయ్య స్వామి సన్మానించిన గ్రామ పెద్దలు.

పాలక మండలి సభ్యులు కే మల్లయ్య స్వామి సన్మానించిన గ్రామ పెద్దలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం కే మల్లయ్య స్వామి ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నాగేష్ సజ్జన్ బొగ్గుల నాగన్న సార్ మర్యాద పూర్వకముగా కలిసి
మల్లయ్య స్వామి గారికి పూలమాలలతో షాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ తమ్మలి మరియు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న.!

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న అంబటి వీరభద్రo గౌడ్

కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్

మరిపెడ కురవి నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు, ఆలయ ఆవరణలో పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నియోజకవర్గంలో ఏనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని,రైతులు అందరూ పాడి పంటలు సమృద్ధిగా పండి అభివృద్ధి పథంలో నడవాలని ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ కు మంత్రి పదవి రావాలని కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామన్నారు “ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను పాటిస్తూ ఆలయాలను దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందాలి,” అని అన్నారు. ప్రజల సంక్షేమం మరియు మండల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి.

పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం

ఓదెల(పెద్దపల్లి జిల్లా):

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో 28వ రైల్వే గేట్ దగ్గర పోచమ్మ తల్లి దేవాలయంలో పోతలింగేశ్వర స్వామి విగ్రహాన్ని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని పరిశీలించి ఆ సంఘటన హిందువులకు చాలా బాధాకరమైన సంఘటన కావున హిందూ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోక నిర్వహించిడం జరిగింది. విషయం తెలుసుకున్న పోత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్ సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడుతూ విగ్రహాన్ని పరిశీలించి త్వరలోనే ఈ సంఘటన కు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలియజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి:

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం.!

గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం లో సిరిసిల్ల జడ్జి ప్రత్యేక పూజలు

సిరిసిల్ల టౌన్ మే 20 (నేటిధాత్రి):

ఈరోజు పట్టణ కేంద్రంలోని బహుళ అష్టమి సందర్భంగా సిరిసిల్లలోని గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి వారి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాధికా జైస్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్ , ఆలయ కార్యదర్శి కుడిక్యాల శంకర్ మేజిస్ట్రేట్ ని శాలువాతో సన్మానించారు. అలాగే ఆలయ పూజారి గోషికొండ సత్తయ్య పంతులు జడ్జి కి ఆశీర్వచనాలు అందించారు. వీరి వెంట ఆలయ కమిటీ సభ్యులు పంతం రవి, శ్రీపతి పరుశరాం, చిలగాని శ్రీనివాస్ ఉన్నారు.

శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో.!

మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మహా అన్నప్రసాద వితరణ

పరకాల నేటిధాత్రి:

 

పరకాల మండలంలోని
మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం మల్లక్కపేట
లో సోమవారం రోజున విఎస్స్సార్ ఫ్యామిలీ మార్ట్ యాజమాన్యం పరకాల,నర్సంపేట
మరియు దోషిని మహేష్,శ్రీనివాస్ నాగారం లు మహా అన్న ప్రసాద వితరణ హనుమాన్ మాలాధారణ దీక్ష స్వీకరణలో ఉన్న హనుమాన్ స్వాములకు మహా అన్నప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అలాంటి అవకాశాన్ని కల్పించిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ అంబీర్ మహేందర్ కి సహకరించిన ఆలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాచన్న స్వామి ఆలయంలో.!

రాచన్న స్వామి ఆలయంలో సీనీయర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో జహీరాబాద్ సినియర్ సివిల్ జడ్జి కవిత దేవి శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేదాశీర్వాదం చేయడం జరిగింది.

దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం.!

రేపు రంజోల్ దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ. స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. లియో క్రాఫ్ట్, ఇంటిరియర్స్ అధినేత చెవుల ఉమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి గణపతి పూజ, పంచామృత అభిషేకం, 9గం. లకు దత్త హోమం, 11. 30 కి పూర్ణహుతి, మ. 12 గం. లకు స్వామివారికి హారతి, 12. 30 కి అన్నప్రసాద కార్యక్రమలు జరుగునని తెలిపారు.

జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు. !

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో శంకర్ గంజ్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి ఊరేగింపు శంకర్ గుంజీ నుండి బయలుదేరి కమాన్ చౌరస్తా రాజీవ్ చౌక్ ద్వారా భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు

వైభవంగా శ్రీ మత్స్య గిరి స్వామి కళ్యా ణోత్సవం.!

అంగరంగ వైభవంగా శ్రీ మత్స్య గిరి స్వామి కళ్యా ణోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాల యంలో తిరు కళ్యాణ బ్రహ్మో త్సవాలలో భాగంగా భూదేవి శ్రీదేవిలతో శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.గుడి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి దంపతులు తమ ఇంటి నుంచి పట్టు వస్త్రాలను తలంబ్రాలను మంగళ వాయి ద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించినారు వేదమంత్రాల మధ్య దేవాల య అర్చకులు ఆరుట్ల కృష్ణ మాచారి యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాల చారి  .స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరుపుకున్నారు.గట్లజయపా ల్ రెడ్డి సరోజన దంపతులు కళ్యాణదాతగా నిర్వహించి.  నారు కళ్యాణ అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాపసేనారెడ్డి, గట్ల భగవాన్ రెడ్డి, జిన్నా కృపాకర్ రెడ్డి, శివరామకృష్ణరెడ్డి ,మనీష్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేశ్వరరావు , చిందం రవి, బాసని మార్కండేయ, వినుకొం డ శంకరాచారి,సుమన్, వనం దేవరాజు, మార్త సుమన్,దిండి గాల వంశీ , బాసని బాలకృష్ణ, గిద్దెమారు సురేష్, రామ్ గోపాల్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు .!

శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు

మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్

జవహర్ నగర్ నేటి దాత్రి:

 

 

మేడ్చల్ మార్కాజిగిరి జిల్లా

జవహర్ నగర్ మున్సిపాలిటీలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం లో భాగంగా యాదవ సంఘం మరియు జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్,మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్,సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానంద,తదితరులు పాల్గొన్నారు

శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి .

శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు.

మందమర్రి నీటి ధాత్రి :

 

 

మందమర్రి పట్టణ అంగడి బజార్ లోని శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు. మందమర్రి పట్టణంలోని అంగడి బజార్ లో గల శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాలను శుక్రవారం నుండి శనివారం వరకు అత్యంత వైభవంగ నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు దిలీప్ శుక్ల శర్మ తెలిపారు.

Silver Jubilee.

 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క 25 వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీ నుంచి పదవ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం మహా అన్నప్రసాద్ వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈనాటి.

Silver Jubilee.

ఆలయ రజిత ఉత్సవ వేడుకలకు హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన జరిగిందని అలాగే స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం .

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం అలంకరణ…

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహానికి హనుమాన్ భక్తులు గోవిందుల రమేష్, వెంకట నరసింహ స్వామి ఇద్దరు కలిసి సూర్య చక్రం రూపకల్పన చేయించి ఆంజనేయ స్వామికి అలంకరించారు. నిత్యం తిరుగుతూ ఉండే సూర్య చక్రం ఆంజనేయ స్వామికి అలంకరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సతీష్ శర్మ, ప్రవీణ్ శర్మ,హనుమాన్ భక్తులు రవి, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం.

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం అలంకరణ…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహానికి హనుమాన్ భక్తులు గోవిందుల రమేష్, వెంకట నరసింహ స్వామి ఇద్దరు కలిసి సూర్య చక్రం రూపకల్పన చేయించి ఆంజనేయ స్వామికి అలంకరించారు. నిత్యం తిరుగుతూ ఉండే సూర్య చక్రం ఆంజనేయ స్వామికి అలంకరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సతీష్ శర్మ, ప్రవీణ్ శర్మ,హనుమాన్ భక్తులు రవి, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి.!

శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి మహోత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఝరాసంగం మండలం ఈధులపల్లిలో శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి మహోత్సవాలు ఆలయ కమిటీ అద్వార్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంత్ రావు పాటిల్, పెద్దలు రాచయ్య స్వామి,శంకర్ పాటిల్,యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ ,పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మరియు పలువురు పెద్దలు, నాయకులు,భక్తులు పాలుగొన్నారు..

వైభవంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి.!

వైభవంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వేడుకలు

 

నడికూడ నేటిధాత్రి:

 

శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వేడుకలు నడికూడ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కడివెండి నరేందర్ చారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు.వీర బ్రహ్మేంద్రస్వామి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి, వేద పండితుల మంత్రోచ్ఛారాల నడుమ పూజలు చేశారు.అనంతరం స్వామి వారికి పాలకాయలు సమర్పించి,కర్పూర హారతి ఇచ్చి పూజలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రామకమిటీ అధ్యక్షుడు ఎలకంటి రాజు చారి, ఉపాధ్యక్షుడు బెజ్జంకి రాజేందర్ చారి,కార్యవర్గ సభ్యులు క్రిష్ణాది సాంబయ్య చారి, మసంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి ఉత్సవాలు.

శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి ఉత్సవాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 


శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత సమేత జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణం,శిఖర పూజ, కార్యక్రమాలు నిర్వహించారు ఇట్టి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు

 

Mata Jayanti celebrations.

 

శ్రీ చంద్రశేఖర శివచార్య మహాస్వామి బెమల్ ఖేడ్, బసవలింగ అవధూత గిరి మహరాజ్ , మాతృశ్రీ మఠం శివలీలమ్మ, రాచయ్య స్వామి, కేతకీ టెంపుల్ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్, సిద్దయ్య స్వామి, నాగరాజ్ పటేల్,లింగం గౌడ్ , ఈశ్వరప్ప పాటిల్, తదితర భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version