చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే జైలుశిక్ష తప్పదు..

చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే జైలుశిక్ష తప్పదు

జైపూర్,నేటి ధాత్రి:

ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లో భాగంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ (ఎస్ఎమ్ టిసి) పోలీస్ కమీషనరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది.ట్విటర్‌,ఫేస్‌బుక్‌, వాట్సాప్‌,ఇతర సోషల్‌ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్‌గా చేసుకుని పోస్టులు పెడితే,మరికొందరూ కులాలను,మతాలను, మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్‌గా చేసుకుని పోస్టులు పెడుతున్నారు.ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్‌ చేసినా,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.అలాంటి వారికి జైలు శిక్ష,జరిమానాతోపాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.అదేవిధంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేముందు,వచ్చిన పోస్టులను ఫార్వర్డ్‌ చేసేముందు అవి నిజమా కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 24×7 నిరంతరం సోషల్‌ మీడియా పోస్ట్ లపై నిరంతరం నిఘా ఉండనుంది.రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా,మత ఘర్షణల కలిగేలాగా,లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.సోషల్ మీడియాలో మతాలను,కులాలను, ఒకరినొకరు కించపరుస్తూ గాని,లేనిపోని అబద్దపు పుకార్లను సృష్టించి ఎవరైనా సోషల్ మీడియా లో పోస్టులు పెడితే వారిపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుంది.సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన,చట్టవిరుద్ధమైన పోస్టులు పెట్టేవారిపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం-2000 ప్రకారం చర్యలు తప్పవని పోలీస్ లు హెచ్చరిస్తున్నారు.

వాగులు,వంకల అక్రమ కబ్జాలు.!

వాగులు,వంకల అక్రమ కబ్జాలు అవుతున్న అదికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రస్తుతం ఇది వర్షాకాలం వర్షపు నీటి ప్రవాహం ఇప్పుడున్న వాగులు వంకల ద్వారా పోవడం చాలా కష్టంగా మారింది ఆనీరంత ఇండ్లలోకి చేరే అవకాశం ఉంది ఎందుకంటే నీరు ప్రవహించే వాగులు వంకల విస్తిర్ణాన్ని చాలా చోట్ల కబ్జాలకు గురి అయింది ఇది అధికారుల నిర్లక్ష్యమే వర్షపు నీరు ప్రవాహామై పోతున్నప్పుడు వాటిని ఆపడం గాని దారి మళ్లించడం గాని చట్టరిత్య నేరం కానీ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి లంచాలకు మరిగి వర్షపు నీటి ప్రవాహాన్ని కుదించి మరలిస్తున్నారు లంచాలు తీసుకొని NOC లు ఇస్తున్నారు
దీనికి ఉ÷ దోబీ నాలా వాగు ఈ వాగు జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామం నుండి జహీరాబాద్ మండలం మరియు పట్టణ ప్రాంతాల నుండి పోయి చివరకు నారింజలో కలుస్తుంది దీని ప్రవాహం చాలా ఉదృతంగా ఉంటుంది ఈ వాగు పట్టణ శివారులో చాలా చోట్ల కుదించి కబ్జాలకు గురి అయింది డ్రీమ్ వ్యాల్యు కాలనీ దగ్గర కుదించారు వర్షాలు ఉదృతం అయినప్పుడు నీళ్ళన్ని కాలనిలోకి వస్తున్నాయి ఆతర్వాత ముందుకెళ్లే వాగునే దారి మళ్లించారు మరియు ఇంద్రప్రస్త కాలనీ వద్ద నీటి ప్రవాహాన్ని దారి మళ్లించారు ఇంకా ముందుకెళ్తే వాగు విస్తీర్ణాన్నే తగ్గించారు,అధికార పార్టీ నాయకులు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి వారే కబ్జాలకు పూనుకొంటున్నారు అధికారులపై వత్తిడులు తేచ్చి మామూళ్లు ఇచ్చి NOCలు తీసుకుంటున్నట్లు తెల్సింది అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు,ఈ వాగు ప్రవాహం వల్ల గతంలో డ్రీమ్ ల్యాండ్ కాలనీ,ఇంద్రప్రస్థ బై పాస్ ప్రక్కన గల కాలనీలు మొత్తం జలమయం అయ్యాయి, పట్టణ ప్రాంతం మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల భూముల ధరలు బాగా పెరిగినందువల్ల ఇక్కడో బయటి నుండి వచ్చిన రియల్ వ్యాపారులు నీటి ప్రవాహం గల వాగులు వంకలను కుదించి మూసివేస్తూ అధికార పార్టీ అండదండలతో అధికారులను లోబర్చుకొని వ్యాపారులు కోట్లు గడించాలన్న ఆలోచనతో సామాన్య ప్రజలకు నీటిలో మునిగే ప్లాట్లను విక్రయించి మోసగిస్తున్నారు దీనికి అధికారులు వంత పాడుతున్నట్లు అనిపిస్తున్నది అధికారులు గుర్తించుకోవాలి వారికిచ్చే జీతం ప్రజల సొమ్ము నిబంధనలను పాటించి నాళాలను కాపాడి జహీరాబాద్ జలమయం కాకుండా కాపాడాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది లేని ఎడల ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,నాయకులు శివకుమార్ లు ఉన్నారు.

సింగరేణి మండల కేంద్రములో పట్ట పగలే అక్రమ మట్టి తోలకాలదందా.

సింగరేణి మండల కేంద్రములో పట్ట పగలే అక్రమ మట్టి తోలకాలదందా.

పట్టించుకోని అధికారులు.

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రము లో యదేశ్య గా పట్ట పగలే ప్రతిరోజు జేసీబి తో మట్టిని తవ్వి అనేక ట్రాక్టర్ల తో ఉదయం నుండి సాయంత్రం వరకు కారేపల్లి లో చుట్టూ పక్కల ఉన్న గ్రామాల్లో ప్రతినిత్యం అక్రమ మట్టి తోలకాలు జోరుగా కోనసాగిస్తున్నారు ఎవ్వరైనా ప్రజలు అడిగితె ఇందిరమ్మ ఇళ్ల కు అని చెప్పి పబ్లిక్ గానే ప్రతిరోజూ అక్రమ మట్టి తోలకాల దందా జోరుగా కోనసాగిస్తున్నారు.సింగరేణి మండల కేంద్రములో కూత వేటు దూరంలోనే ప్రభుత్వ అధికారులు ఉన్న కానీ ప్రతిరోజు అక్రమ మట్టి తోలకాల దందా జోరుగా కోనసాగిస్తున్నారు ఒక్క ట్రాక్టర్ మట్టి ఆరు వందల నుండి ఎనిమిది వందల వరకు బైట వెంచర్ల లో కూడా మట్టి విక్రయాలు కోనసాగిస్తు మట్టి మాఫియా దారులు లక్షలు గడిస్తున్నారు.మట్టితోలకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు తావేత్తుతున్నాయి. మైనింగ్ అనుమతులు ప్రభుత్వ అధికారుల అనుమతులు ఉండాలని అవి ఉన్న లేకున్నా కాని అదికారుల అండదండలతో వారి కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తోలకాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని ప్రజలు అనుకుంటున్నారు. కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ మట్టి తోలకాల దందాను ఆపాలని ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

అక్రమంగా కే ఎల్ ఐ మట్టి రాళ్లు తరలింపు.

అక్రమంగా కే ఎల్ ఐ మట్టి రాళ్లు తరలింపు.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని కురుమిద్ద గ్రామ శివారులో గల కె.ఎల్.ఐ కాల్వ పక్కన ఉన్న రాళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు బడా బాబుల అండదండలతో బయటకు టిప్పర్ల ద్వారా విక్రయించడంతో గ్రామస్తులు యువకులు టిప్పర్లను అడ్డగించి కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో టిప్పర్లను పోలీస్ స్టేషన్ ముందు ఉంచారు కానీ సంబంధిత అధికారులు మాత్రం స్పందించలేదు గ్రామస్తులు చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో మాకు ఏం తెలియదు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు ఏది ఏమైనా సరే టిప్పర్లను సీజ్ చేయాలని గ్రామస్తులు కల్వకుర్తి ఎస్ఐ కి ఫిర్యాదు చేశారు. కే ఎల్ ఐ కాల్వ పక్కన ఉన్న రాళ్లను మట్టిని బయటికి తరలిస్తే భవిష్యత్తులో ఏమైనా వరదలు వచ్చి పంట పొలాలు గ్రామంలోని గృహాలు మునిగిపోయి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కనుక సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

గంగవరంలో శృతి మించిపోతున్న అక్రమ కట్టడాలు.

గంగవరంలో శృతి మించిపోతున్న అక్రమ కట్టడాలు

చోద్యం చూస్తున్న అధికారులు

గంగవరం(నేటి ధాత్రి) జూలై 12:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో మదనపల్లి పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ప్రభుత్వ అనుమతులకు మించి అక్రమ కట్టడాల నిర్మాణం రోజు రోజుకు శృతి మించి పోతుంది, ప్రభుత్వ అనుమతులు ఉన్న లేకపోయినా రాజకీయ పలుకుబడితో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారా లేదా ప్రభుత్వ అధికారులు ఏదైనా ప్యాకేజీ తీసుకొని ఈ అక్రమ కట్టలు కట్టిస్తున్నారు అర్థం కావడం లేదు కానీ ప్రమాదకరస్థాయిలో అక్రమ కట్టాల నిర్మాణం రోజు రోజుకు జరుగుతూనే ఉంది జాతీయ రహదారిని ఆనుకొని ఈ విధంగా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఇప్పటికే ఎంతోమంది మదిలో ఈ ప్రశ్న వెలిబడుతుంది, మరి ఇలాంటి
క్రమంలో అంతస్తులపై అంతస్తులు కట్టుకుంటూ వెళ్తున్నారు కొందరు మరి వీటి పట్ల గంగవరం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఎందుకు ఇంత నిర్లక్ష్యప్రాయంగా ఉన్నారో అర్థం కావడం లేదు ఇప్పటికే గంగవరం మండలంలో ప్రభుత్వ భూములు సైతం పక్కదారి పట్టించి పెత్తందారి వ్యవస్థను తీసుకువచ్చిన ఘటనలు కూడా ఎన్నో వార్తా కథనంలో చూసాం అదేవిధంగా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమ ఇసుక రవాణా కూడా గంగవరం మండలంలోని అధికంగా ఉండడం కూడా చూశాం అక్రమ మట్టి మాఫియా కట్టి మాఫియా ఇంకా ఎన్నెన్నో అక్రమాలు గంగవరం మండలానికి పెట్టింది పేరుగా ముందుకెళ్తుంది అంటే అధికార వ్యవస్థ ఏ మాత్రం అక్రమాలకు అండగా ఉందో మనకు అర్థమవుతూనే ఉంది మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి మరి అక్రమ కట్టడాలకు
సకరిస్తున్నారు,
అలాగే
అధికారులు రాజకీయ ఒత్తుల్లో ఉన్నారా లేక ప్యాకేజ్ తీసుకుని సైలెంట్ అయిపోతున్నారా అని అర్థం కావడం లేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తీసుకొని ప్రమాదాలను అరికట్టాల్సి ఉంది, ఇదే విషయంపై ఒక దినపత్రిక ఈ అక్రమాలపై వార్తా కథనాన్ని ప్రచురించగా అధికారుల స్పందన కూడా ఏమాత్రం లేదంటే మరి జిల్లా అధికారులు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది..

చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదేలేదు.

చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదేలేదు

జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు

జైపూర్,నేటి ధాత్రి:

రామగుండం సిపి,డిసిపి ఆదేశాల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్ లోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్లు పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.ఏదైనా సమస్య విషయంలో డయల్ 100 కాల్ కాని,స్థానిక పోలీసు వారికి సమస్య తెలిపినప్పుడు,సమాచారం అందించినప్పుడు జైపూర్ పోలీస్ వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారని,భద్రత పరమైన విషయాలపై,పోలీసుల పనితీరుపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రాంతంలోని రౌడీషీటర్స్,సస్పెక్ట్ షీట్స్ లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రస్తుత పరిస్థితి,జీవన విధానం ను అడిగి తెలుసుకుని ప్రజా జీవనానికి భంగం కలిగించిన,చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.గంజాయి అక్రమ రవాణా,నిల్వ,సరఫరా పై నిఘా,నియంత్రణలో భాగంగా ఇందారం లోని అనుమానస్పద ప్రాంతాలను మరియు ఇండ్లను,ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్ తో క్షుణ్ణంగా పరిశీలించారు.వాహనాల తనిఖీ నిర్వహించి 70 మోటార్ సైకిళ్లకు,05 ఆటోలకు,ఇతర వాహనాలకు ధ్రువపత్రాలను చెక్ చేసి సరైన వాహన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు.టూ వీలర్ వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.

ACP Venkateshwarlu.

ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ..చట్ట ప్రకారం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రజలకు పోలీస్ వ్యవస్థ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.వారికీ సహాయ సహకారం అందిస్తాం వారికీ అండగా ఉంటాం అన్నారు.అదేవిదంగా చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది,ఉపేక్షించేది లేదు అని అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని ఏసిపి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసిపి ఏ.వెంకటెశ్వర్లు,శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్,జైపూర్ ఎస్సై శ్రీధర్,శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్,టీఎస్ఎస్పి పోలీస్,సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి..

*అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి..

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:

 

 

 

 

నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 45 వ వార్డు లోని శివజ్యోతినగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలని, అంధుల శరణాలయం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనీష్ రాయల్, వివిధ శాఖల అధికారులతో కమిషనర్ పరిశీలించారు. శివజ్యోతి నగర్ వద్ద వేసిన కొత్త రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయడం, మద్యం సేవిస్తున్నారని, రోడ్లలో గుంతలు ఎక్కువగా ఉన్నాయి పూడ్చాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల సాయంతో వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీల్లో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులోని ఓరియన్ హోటల్ నుండి మురుగునీటి కాలువల్లో కలుస్తున్న వ్యర్థాలను అరికట్టి తగు చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి,డి.ఈ. రమణ, శిల్ప, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.

రాజకీయాలు చేస్తున్న ఉపాధ్యాయుడు అక్రమ డిప్యూటేషన్ తొలగించాలి.

రాజకీయాలు చేస్తున్న ఉపాధ్యాయుడు అక్రమ డిప్యూటేషన్ తొలగించాలి

ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి:

వీపనగండ్ల ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల నుండి డిప్యూటే షన్ ద్వారా వనపర్తి ప్రభుత్వ బాలుర పాఠశాల కు బదిలీ చేయించుకొని వచ్చారని వనపర్తి లో రాజకీయ పార్టీ ల సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజావాణిలా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి ఫిర్యాదు చేశామని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు వనపర్తికి ఆ ఉపాధ్యాయుని వద్దని ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఎమ్మెల్యే మెగారెడ్డి స్పందించి ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఎం నాయకులు బాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ
అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి వీపనగండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇంగ్లీష్ టీచర్ ను ఆర్థిక లావాదేవీలతో వనపర్తికి బదిలీ చేయడాన్న సిపిఎం ఖండిస్తున్నామని వీపనగండ్లలో బాలికల బాలుర పాఠశాలల్లో కలిపి ఒక్కరే ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడని , అతన్ని 5 మంది ఇంగ్లీష్ టీచర్లు ఉన్న వనపర్తి బాలుర పాఠశాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ డిప్యూటేషన్ ను ఎత్తివేయకుంటే వనపర్తి లోని ప్రజా సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమం చేస్తుందని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఎం నాయకులు బాల్ రెడ్డి, దేవేందర్, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, టిఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, సామాజిక కార్యకర్త గౌనికాడి యాదయ్య, ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి, రవి, ఇటుకూరి రంజిత్, కొండ వెంకటేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

పేద ప్రజల వద్ద నుండి అక్రమ వసూలు.

పేద ప్రజల వద్ద నుండి అక్రమ వసూలు

జైపూర్ నేటి ధాత్రి:

మండలంలోని ముదిగుంట గ్రామంలో పేద ప్రజలకు ఉచితంగా అందే పథకాలను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పేద ప్రజల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినికిడి. గ్రామంలోని తోటి కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా విషయం వెలుగులోకి వచ్చింది.ఎవరైతే పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారో వారిని గుర్తించి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు.

జోరుగా ఎర్రరాయి అక్రమ దందా

జోరుగా ఎర్రరాయి అక్రమ దందా

◆ గుంతలమయంగా గనుల ప్రాంతం

◆ జరిమానాలు విధించినా మారని తీరు

◆ గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల పరిధిలోని గణేష్ పూర్ గ్రామ శివారులో అక్రమంగా ఎర్రరాయి తవ్వకాల దందా జోరుగా కొనసాగుతుంది. ఎర్రరాయి తవ్వకాల ను కట్టడి చేసేందుకు అధికారులు పలుమార్లు దాడులు చేసి అకక్రమార్కు లకు జరిమానాలు విధించినా గనుల్లో తవ్వకాలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పట్టుబడి నప్పుడు అక్రమార్కు లు జరిమానాలు కడుతూ మళ్లీ యధావిధిగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఎర్రరాయిని తరలించే మాఫియా తమ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిమ్స్ అసైన్మెంట్ భూముల్లో సైతం ఎర్రరాయి తవ్వకాలు తమ ఇష్టారాజ్యంగ జరుగుతున్నా. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం గనుల్లో ఎర్రరాయిని తీసి ట్రాక్టర్లలో వందల సంఖ్యలో రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారే ఆరోపణలు కూడా ఉన్నాయి. గణేష్ పూర్ ఎర్రరాయిని అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా ఇక్కడి నుంచి దూరప్రాంతాలైన అందోల్, నారాయణ ఖేడ్, వట్టిపల్లి మండ లాలకు లారీల్లో అధిక లోడ్లతో తరలిస్తున్నా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున లారీల్లో ఎర్రరాయిని దూర ప్రాంతాలకు తరలిస్తుండడంతో రోడ్లు సైతం దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మైనింగ్ అధికారులు చుట్టపు చూపుగా వచ్చి నామ మాత్రంగా దాడులు చేసి అసలైన నిందితులను వదిలేస్తూ తూతూ మంత్రంగా తనిఖీలు జరిపి నామ మాత్రానికి జరిమానాలు విధిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఎర్రరాయి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టవేయ గలుగుతారా? లేదా యధావిధంగా కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.

అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!

అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!

రాష్ట్ర వ్యాప్తంగా “కోర్టులలో ప్రజా వాజ్యాలు” వేయాలని సమాలోచనలు!

త్వరలో “కోర్టులను” ఆశ్రయించనున్న “ప్రజా సంఘాలు”.

 

అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు.

“రైతులను” మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై “ప్రజా సంఘాల” ఆగ్రహం

హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.

“జాయింట్ కలెక్టర్” కూడా మోసం జరిగినట్లు “కమీషనర్‌”కు నివేదిక పంపడం జరిగింది.

ఖమ్మం “జేసి” సదరు మిల్లర్‌పై చర్యలకు సిఫారసు చేయడం కూడా జరిగిపోయింది.

ఇంకా మిల్లర్ పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు ప్రశ్నిస్తున్న “ప్రజా సంఘాలు”.

రైతులను మోసం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని “ప్రజా సంఘాల” హెచ్చరిక.

హన్మకొండ జిల్లాలో రైతులను మోసం చేసిన మిర్లర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని “ప్రజా సంఘాల” డిమాండ్.

“సివిల్ సప్లయ్” అధికారులు స్పందించకపోతే ఆందోళనకు “ప్రజా సంఘాల” కార్యాచరణ.

మీ “నేటిధాత్రి”లో ఎక్స్ క్లూజివ్ గా.

బిఆర్ఎస్ పార్టీ అక్రమ అరెస్టులలో కోర్టుకు హాజరైన

బిఆర్ఎస్ పార్టీ అక్రమ అరెస్టులలో కోర్టుకు హాజరైన ఎమ్మార్పీఎస్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా కో ఇన్ఛార్జ్
నోముల శ్రీనివాస్ మాదిగ కోర్టుకు హాజరవడం జరిగింది గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎమ్మార్పీఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు
చిరుపంగా చంటి మాదిగ ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి మండల అధ్యక్షులు
వంతడుపుల చందర్ మాదిగ
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
పురుషోత్తం నారాయణ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
మేకల రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
బట్టు విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
చిలపాక హరీష్ మాదిగ ఎమ్మార్పీ సీనియర్ నాయకులు
ఒంటెరి బిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి.

అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి
భూభారతి కార్యక్రమంలో బాధితుల గోడు
రోడ్డుపై బాధితులుప్లెక్సీలు పట్టుకొని రాస్తారోకో
జమ్మికుంట :నేటిధాత్రి

 

shine junior college

 

 

జమ్మికుంట మండలంలోని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అక్రమంగా భూకబ్జాలు చేస్తూ మోకా మీద లేకున్నా గత ఎమ్మార్వో నారాయణ తో చేతులు కలిపి దాదాపు 20 ఎకరాల భూమి దొంగ 13b సాదా భయానామాలు పుట్టించి అతని పేరున ధరణి కాలంలో కొత్త పాస్ బుక్కులు తీసుకు రావడం జరిగింది అలాగే కొంతమంది బినామీ పేర్ల పైన కొత్త పాసు బుక్కు ఉండంగా కూడా వాళ్లు వేలిముద్ర వేయకుండా వాళ్ల సంతకాలు పెట్టకుండా వేరే వాళ్లకు మార్పు చేయించినాడు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఆట స్థలాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇట్టి పోరుపై చాలాసార్లు కలెక్టర్ను ఆర్డీవోను ఎమ్మార్వో మారినప్పుడల్లా మా బాధలను వినిపిస్తున్నాము ఈ అక్రమార్కుని పై పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈరోజు భూభారతి కార్యక్రమం గ్రామపంచాయతీ ఆవరణలో జరుగుతుందని తెలుసుకుని బాధితులంతా రోడ్డుపై ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపినారు తర్వాత అధికారులకు వారి యొక్క వినతి పత్రాలు అందజేసినారు ఇకనైనా ఈ భూభారతి లోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు కనుక అధికారులు గమనించి సమగ్ర విచారణ జరిపి పేదల భూములు వారి వారికి పాసుబుక్కులు ఇప్పించాలని బాధితులంతా కోరుకోవడం జరిగింది

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
మల్లాపూర్ జూన్ 16 నేటి ధాత్రి:

 

shine junior college


ప్రశ్నించే గొంతును నొక్కడం సరికాదు ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్
జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్, మల్లాపూర్ ప్రెస్ క్లబ్ 143 అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ…జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తోకల పవన్, రుద్ర రాంప్రసాద్, చింతలూరి రంజిత్, తోట శేఖర్, మిడిదొడ్డి మల్లేష్, ఉడుగుల గంగాధర్, రాజేందర్, మోర సతీష్, తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ.

జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ( ఐ జే యు)

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అక్రమ అరెస్టు, ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ మంగళ వారం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో టి యు డబ్ల్యూ (ఐ జేయూ), వివిధ పార్టీల, సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర నాయకులు బండి సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడి చేయడం, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.

ఇసుక అక్రమ దారుల పంజా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి.

సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ దారుల పంజా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకకొరత

మూడు వేల రూపాయల. నుండి నాలుగు వేల రూపాయలు

టాక్టర్ ఇసుక అమ్ముతున్న ఇసుక అక్రమ దారులు ఆగిపోతున్న నిర్మాణాలు

వారానికి మూడు రోజులు ప్రభుత్వం ఇసిక సప్లై చేయాలి

ఇసుక అక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ డిమాండ్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి అందిస్తుంది. సిరిసిల్ల పట్టణంలో 700 పై చిలుకు ఇల్లు మంజూరు చేయడం జరిగినది. ఒకేసారి అందరూ నిర్మాణం ప్రారంభించడం వలన ఇసుక కొరత తీవ్రంగా తీవ్రంగా నెలకొన్నది ఫలితంగా నిర్మాణాలు ఆగిపోయాయి ఇసుక డిమాండ్ ను ఆసరా చేసుకొని కొంతమంది అక్రమంగా ఇసుక రవాణా చేసి వాళ్ళు ఇసుక ధర పెంచి 1500 ట్రాక్టర్ ఉన్న రేటును మూడు3 వేల నుండి 4 వేలకు టాక్టర్ .ఇసుక అమ్ముతున్నారు. గత 15 రోజులు నుండి ప్రభుత్వం ఇసుక సప్లై కి చేయకపోవడం మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక కొరత లేకుండా వారానికి మూడు రోజులు ఇసుక పంపిణీ చేస్తేనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అవుతుంది వర్షాలు బాగా పడి మానేరు వాగు ప్రయాహిస్తే మానేరు నుండి ఇసుక తీయడం నిలిచిపోతుంది.ఫలితంగా ప్రభుత్వం దసరా వరకు పూర్తి చేయాలనుకున్న నిర్మాణాలు పూర్తి కాకుండా ఆగిపోతాయి.ఇల్లు కూలగొట్టుకొని నిర్మాణం చేసుకుంటున్నాం వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.సిరిసిల్ల ప్రజలకు తరుపున. మానేరులో ఇసుక ఉన్నా కూడా వేల రూపాయలు ఖర్చుపెట్టి కొనుక్కోవలసిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది ఇసుక అక్రమ దారులు మానేరు నుంచి కోట్లాది రూపాయల ఇసుకను దొంగతనం చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముతుంటే. అధికారులు చూసి చూడనట్టు వివరిస్తారు స్థానికులు నిర్మాణాలు చేసుకోవడానికి కావాలంటే అనేక ఆంక్షలు ప్రభుత్వం విధిస్తుంది,ఇప్పటికైనా ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా లో నిర్మించుకుంటున్న వారి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సప్లై చేయాలి. మానేరు నది నుండి ఇతర ప్రాంతాలకు ఇసుకను. అక్రమంగా తరలించకుండా అక్రమ దారులపై పీడీ యాక్ట్ కేసు లు నమోదు చేయాలి టాక్టర్ ఇసుక ధర 1500 మించకుండా ప్రభుత్వం ధరలను నియంత్రించాలనీ. అన్నారు లేనిపక్షంలో సి.పి.ఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, సి.పి.ఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, మల్లారం ప్రశాంత్, మిట్టపల్లి రాజమల్లు  పాల్గొన్నారు.

అక్రమ ఇసుక డంపులు విక్రయాలు.

అక్రమ ఇసుక డంపులు విక్రయాలు

పగలు రాత్రి జోరుగా నడుస్తున్న ఇసుక దందాలు

అధికారుల పట్టింపు లేకనే జోరందుకున్న జీరో ఇసుక దందాలు

గోదావరి ఇసుక చాటున ఏటి ఇసుక దందాలు

కేసముద్రం నేటి ధాత్రి:

 

రోజురోజుకు పెరిగిపోతున్న ఇస్కాసురుల ఆగడాలు అంతా కాదు ప్రతిరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏటి ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కేసముద్రం మండల పరిసర ప్రాంతాలలో ఉన్న వాగుల లో లభ్యమయ్యే ఇసుకను రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలించడమే కాకుండా చుట్టుపక్కల మండలాలలోని ఏటి ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇసుక ట్రాక్టర్ 5000 వేలు మరియు ప్రభుత్వ చాలా నుకు డబ్బులు కడితేనే ఇసుక ఇంటి ముందరికి వస్తుంది మరి ఇసుకసురులు ఏ ప్రభుత్వ కార్యాలయానికి పన్ను చెల్లించకుండా ఇంత భారీగా అక్రమం ఇసుక రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇసుక లభ్యం అయ్యే ఏరు కానీ వాగు కానీ ప్రాంతాలలో సంబంధిత కార్యాలయ సిబ్బందికి ముడుపులు చెల్లిస్తూ అక్రమ ఇసుక రావణా చేస్తున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొంతమంది ప్రత్యేకంగా ఇసుక దందాల కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వ ఆర్టిఏ నిబంధనలు పాటించకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రభుత్వ ఆర్టిఏ నిబంధనలు తుంగలో తొక్కుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను నియమిస్తూ దందాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఇసుక దందాలు మూడు పూలు ఆరు కాయలు కన్నా ఎక్కువ లాభసాటిగా ఉండడంతో రాత్రి పగలు అని తేడా లేకుండా పట్ట పగలు కూడా రవాణా చేస్తున్నారంటే వీరికి ఎవరి అండదండలు లేనిదే చేయరు అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ మైనింగ్ అధికారులు ఇసుక మాఫియాకు అడ్డుకట్టు వేయాలని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నందున ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి ఇసుక సురుల ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు.

అనుమతులులేని…అక్రమ నిర్మాణం…!

అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు

పట్టింపె లేదా ఏ…? అధికారులకు…

అక్రమ నిర్మాణ యజమానిపై ఇంత ప్రేమ ఎందుకో…!

సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ నిర్మాణ సమస్యలు

నోటీసులతో సరి పెట్టుకుంటారా..? కోరాడ జులిపిస్తారా…

చేతులు తడిపినందుకేనా అనే అనుమానాలు?

కేసముద్రం నేటి ధాత్రి:

 

కేసముద్రం పట్టణ కేంద్రం లో అక్రమ నిర్మాణాలు యాదేచ్చకంగా కొనసాగుతున్నాయి.ఇది అధికారుల అలసత్వమా…? లేదా నిర్లక్ష్యమా…? లేక అక్రమ నిర్మాణదారుల బరితెగింపులా…? అనీ కేసముద్రం పట్టణ ప్రజలు ముక్కున వెలుసుకుంట్టున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.ఒక సామాన్యుడు రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పర్మిషన్ల పేరుతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆ పేపరు ఈ పేపర్ తీసుకురా అంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకునే సందర్భాలు ఎక్కువే అంటున్న ప్రజలు, అధికారులు మాత్రం డబ్బు పలుకుబడి ఉన్న వ్యాపారస్తు లు డబ్బున్న బడా బాబులు అని చెప్పుకునే వారి నిర్మాణ సముదాయలకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్న కాని అధికారులు చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వెనుక ఆ అధికారులపై ప్రజలు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అక్రమ నిర్మాణ దారులు నన్ను ఎవరేం చేయలేరు అనే ధీమాతో నిర్మాణాలు పూర్తి పూర్తి చేస్తున్న సంఘటనలు. యాదేచ్చకంగా అధికారుల కళ్ళేదుట బహుళ అంతస్తుల పేక మేడ లాంటి భవనం ఏదే చ్చగా అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు నిర్మించినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక అనుమానాలకు తావిస్తుంది..వివరలోకి వెళితే కేసముద్రం పట్టణ కేంద్రం నడిబొడ్డున మార్కెట్ రోడ్ ప్రధాన రహదారి లో భద్రకాళి టెక్స్టైటైల్స్ షాపింగ్ కాంప్లెక్స్ జి ప్లస్ టు..

construction

అనుమతులు పొంది పంచాయతీరాజ్ చట్టం – 2018 నియమ నిబంధనలను అతిక్రమించి జి ప్లస్ టు ఉన్న నిర్మాణాన్ని బహుళ అంతస్తుల అనగా ఐదు పోర్లతో పేక మేడ లాంటి అక్రమ నిర్మాణం చేపట్టి ఎలాంటి ఫైర్ సేఫ్టీ మరియు వెంటిలేషన్ రూల్స్ పాటించకుండా నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో అంత పెద్ద బహుళ అంతస్తులు నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా? అంతటి అంతస్థకు ఆ ప్రదేశంలోని నేల సరి అయినదేనా కాదా అది తేల్చాల్సింది జులాజికల్ మైన్స్ అధికారులు నేల పరీక్ష తదనంతరం అనుమతులు తప్పనిసరిగా పాటించాలి అలాగే ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా గాలి రావడానికి పోవడానికి ఒక్క కిటికీ కూడా నిర్మించకుండా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒకటే గుమ్మం ఒకటే దారితో కూడిన డోర్ నిర్మాణం చేశారని అలాగే నాలుగు అంతస్తులకు గాను లిఫ్ట్ నిర్మించారని ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ సిబ్బందికి వెళ్లే మార్గమే లేదని షాపులో పనిచేసే అటువంటి వర్కర్స్ కి మరియు షాపింగ్ మాల్ వచ్చినటువంటి వినియోగదారులకు ప్రమాదం పొంచి ఉందని మనుషుల ప్రాణాలతో చెలగాటమేనని పలువురు భావిస్తున్నారు.కానీ ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించకుండా సేఫ్టీ అనుమతులు అవేమీ లేకుండా ఎలా నిర్మిస్తారని, అనేక ప్రశ్నలకు తావిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.అట్టి బహుళ అంతస్తుల పేక మేడ లాంటి భవన నిర్మాణంతో చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలకు ప్రమాదం జరుగుతుందని అనేది చర్చ జరుగుతుంది.గతంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అదనపు అంతస్తుల నిర్మిస్తున్న సమయంలో ఒక భవన నిర్మాణ కార్మికుడు పై అంతస్తూ నుండి పడి మృతి చెందిన సంఘటన జరిగిందని, ప్రమాదం జరిగిన ఏ మాత్రం నిర్మాణం ఆపకుండా నిర్మాణాలు పూర్తి చేసిన పరిస్థితి కళ్ళముందే కనబడుతుంటే అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.ఎన్నో సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతున్న కూడా అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకుకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో…?అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అధికారులు చట్టాలను కేవలం నిరుపేదలపై సామాన్యులపై ప్రయోగిస్తారా.బడా వ్యాపారస్థులకు డబ్బు పలుకుబడి దారులకు కొమ్ము కాస్తున్నారని ప్రజల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు అనుకున్నట్టుగానే పరిస్థితులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయని. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణదారులపై కొరడా జులిపించాలని వెంటనే స్పందించి పంచాయతీ రాజ్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకోవాలని,అలాగే ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయాలని ఇకనైనా మున్సిపల్ అధికారి మరియు పంచాయితీ అధికారులు చట్టాలపై నమ్మకం కలిగిస్తారా లేదా అని ప్రజలు వేచి చూస్తున్నారు.

అక్రమ వసూళ్లకు ప్రోత్సాహమే లక్ష్యంగా టిజిఎండిసి.

అక్రమ వసూళ్లకు ప్రోత్సాహమే లక్ష్యంగా టిజిఎండిసి.

38 రోజుల్లో 24 అక్రమ వసూళ్ల సాక్షాలతో కథనాలు.

చర్యలకు బదులు సెటిల్మెంట్లు చేసుకుంటున్న అధికారులు.

అదనపు ఇసుక అక్రమ వసూళ్లు జోరులో కాంట్రాక్టర్లు.

పక్క జిల్లా ఇసుక క్వారీల హద్దులు దాటి ఇసుక తరలిస్తున్న, టీజీఎండిసి నిశ్శబ్దం.

టీజీఎండిసి అక్రమ వసూళ్లలో సూత్రధారిగా వ్యవహరిస్తే కొత్త ఇసుక పాలసీ ఏలా అమలవుతుంది.

అక్రమ వసూళ్లకు ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్దతు పలుకుతుందా.!?

టీజీఎండిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండి ఎక్కడ.!?

మహాదేవపూర్- నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నీ మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి అనుకొని నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ ల్లో అక్రమ వసూళ్లకు టీజీఎండిసి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల రూపాయల సొమ్మును కాంట్రాక్టర్లకు దూచిపెట్టడం జరుగుతుంది. అక్రమ వసూళ్లే కాదు అక్రమ ఇసుక తవ్వకాలను కూడా టీజీఎండిసి సహకరించడం జరుగుతుంది. కాంట్రాక్టర్ల ఇష్ట రాజ్యాన్ని టీజీఎండిసి అధికారులు కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారి కాంట్రాక్టర్లు చెప్పింది వేగంగా వ్యవహరించడం జరుగుతుంది. అక్రమ ఇసుక రవాణా వసూళ్ల సాక్షాలు, వందల సంఖ్యలో తెరపైకి తీసుకువచ్చిన టీజీఎండిసి, చర్యల కు బదులు కాంట్రాక్టర్లతో హోటల్లో సెటిల్మెంట్ చేసుకోవడం, ఆనవాయితీగా మరణంతో పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేసే క్వారీలు దోపిడీలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం జరుగుతుంది. టీజీఎండిసి ఉన్నత అధికారి ఇసుక రీచులను సందర్శించి అక్రమాలు అక్రమ ఇసుక రవాణాకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ, ఇసుక రీచ్ లో అక్రమాలు బయటపడుతున్న, ఆ ఉన్నత అధికారి ఎందుకు స్పందించడం లేదు అనేది సందిగ్ధంగా మారింది.

చర్యలకు బదులు సెటిల్మెంట్లు చేసుకుంటున్న అధికారులు.

మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచులకు సంబంధించి అక్రమ వసూళ్ల వ్యవహారం, అదుపు ఇసుక రవాణా చేస్తున్న లారీల వివరాలు, కాంటాల వద్ద అదునపు ఇసుక వసూళ్లు, సాక్షాలతో “నేటి ధాత్రి” గత నెల నాలుగవ తేదీ నుండి నేటి వరకు, 34 కథనాలు అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తున్న సాక్షాలతో ప్రచురించడం జరిగింది. కానీ అధికారులు చర్యలకు బదులు, హోటళ్లలో కాంట్రాక్టర్లను పిలుచుకొని సెటిల్మెంట్ చేసుకుని వెళ్లడం జరగడంతో, రెచ్చిపోయిన కాంట్రాక్టర్లు వసూళ్ల పరంపర అక్రమంగా అదునపు ఇసుక రవాణా కు హద్దు అదుపు లేకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించడం ఆశ్చర్యం. అంతేకాకుండా పక్క జిల్లా కు కేటాయించిన ఏర్రాయిపేట ఇసుక క్వారీ, గోదావరిలో అక్రమంగా రోడ్డు నిర్మించి, కుంట్లం గ్రామ సరిహద్దు వద్ద తవ్వకాలు జరిపి ఇసుకను తరలిస్తుంటే, కాంట్రాక్టర్లతో టీజీఎండిసి అధికారుల చీకటి ఒప్పందం నేటి వరకు ఏర్రాయిపేట ఇసుక కాంట్రాక్టర్, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రోడ్డును నిర్మించి భారీ తవ్వకాలతో ఇసుకను రవాణా చేయడం జరుగుతుంది అంటే, టీజీఎండిసి అధికారులు ఎంతవరకు అవినీతి మత్తులో ఉన్నారు అర్థమవుతుంది.

Encourage

 

అదనపు ఇసుక అక్రమ వసూళ్లు జోరులో కాంట్రాక్టర్లు.

తాజాగా పలుకుల తొమ్మిది, ఉసుక్పల్లి మహదేవపూర్ ఒకటి, పలుగుల ఎనిమిది, పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేసే ఈ మూడు ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల అరాచకాలు హద్దు లేకుండా పోయింది. టీజీఎండిసి సిబ్బంది, కాంట్రాక్టర్ సూపర్వైజర్లు కలిసి, పలుగుల ఎనిమిది ఇసుక రీచ్ లో 1400, పలుగుల తొమ్మిది 1100, అలాగే పుసుక్కుపల్లి మహదేవ్పూర్ ఒకటవ నంబర్ ఇసుక రీచ్ లో 1100 రూపాయల చొప్పున ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది, అక్రమ వసూళ్ల వ్యవహారంతో పాటు, లోడింగ్ వద్ద 200 అదనపు రూపాల వసూలు, కాంట్రా వద్ద పాసింగ్ పై అదనపు ఇసుక మరో 500 రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్న సాక్షాలతో ప్రచురించిన, టీజీఎండిసి మాత్రం సెటిల్మెంట్ చేసుకొని అక్రమాల వైపు కన్నెత్తి చూడడం లేదు. తాజాగా పలుకుల తొమ్మిది, మహదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, ప్రస్తుతం వందల సంఖ్యలో లారీల్లో ఇసుక రవాణా చేస్తూ పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లతో లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటుంది. కానీ వీటిపై చర్యలకు టి జి ఎం డి సి, ఏ అధికారి కూడా సాహసం చేయడం లేదు.

 

టీజీజిడిసి అక్రమ వసూళ్లలో సూత్రధారిగా వ్యవహరిస్తే కొత్త ఇసుక పాలసీ ఏలా అమలవుతుంది.

ఇసుక రీచ్ లో అక్రమాలపై పరోక్షంగా ప్రత్యక్షంగా టీజీఎండిసి అధికారులు లంచాలకు మత్తులో ఇసుక రీచుల్లో అక్రమాలు కనబడకుండా పోయింది. కాంట్రాక్టర్లు మాత్రం పెద్ద మొత్తంలో లంచాలు అందించడం జరిగిందని తమకు అడిగే వారు లేరు అనుకొని అక్రమ వసూళ్ల అరాచకాలను మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికె మండలంలో అనేక రీచ్లు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ల వెసులుబాటు కొరకు టీజిఎండిసి కాంట్రాక్టర్లు చెప్పే విధంగా తల ఊపడంతో మండలంలో ఇసుక రీచులు ప్రారంభం కావడం లేదు. అంతేకాకుండా ఇప్పటికీ నెలల తరబడి ఇసుక స్టార్ చేసుకొని ఉన్న రీచులు కూడా లోడింగ్ ప్రక్రియ ప్రారంభించపోకపోవడానికి టీజీఎండిసి చీకటి ఒప్పందమే ప్రధాన కారణం. అవినీతికి కేరాఫ్ టీజిఎండిసీ, గా శాఖ మారడంతో, నూతన ఇసుక పాలసీ అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్ల వ్యవహారంపై, కొరడా విధించడం జరుగుతుందని ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. అధికారుల ప్రవర్తన మార్చుకోవాలని ప్రభుత్వం డేట్ లైన్ కూడా డొంట్ కేర్ అనే విధంగా వ్యవహారిసున్న టీజీఎండిసి వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షాలతో ఇసుక రచుల్లో అక్రమాలను తెరపైకి వస్తున్న పక్షం రోజులైనప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఇసుక రీచ్ లో అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తుందన్నా వాదనలు బలమవుతున్నాయి.

టీజీఎండిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండి ఎక్కడ.!?

ఇసుక రీచ్ లు ప్రారంభం కాకముందే,టిజీ ఎం డి సి ఉన్నత అధికారి మేనేజింగ్ డైరెక్టర్ మండలంలోని పలు ఇసుక రీచ్ లను సందర్శించి అక్రమాలు అదనపు ఇసుక ఇలాంటి వ్యవహారాన్ని ఉపేక్షించమని బల్ల గుద్ది చెప్పిన ఎండి, పక్షం రోజులుగా టిజిఎండిసి సిబ్బంది వసూళ్ల పర్వాన్ని, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, అదనపు వసూళ్ల వ్యవహారం ఇసుక కాంట్రాక్టర్ల సూపర్వైజర్లు దౌర్జన్యంగా అదనపు వసూళ్ల వ్యవహారాన్ని కూడా సాక్షాలతో తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. అంతేకాకుండా పక్క జిల్లాల ఇసుక రీచులు కూడా హద్దులు దాటి అక్రమ తవ్వకాలు, లాంటి వాటిని కూడా సాక్షాలతో ప్రచురించినప్పటికీ టీజీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎందుకు నిశ్శబ్దాన్ని వహిస్తున్నారు, మరోవైపు అధికారులు కాంట్రాక్టర్లకు హోటల్లో పిలుచుకొని సెటిల్మెంట్లు చేసుకున్నారు అని స్పష్టంగా ప్రచురించడం జరిగినప్పటికీ కూడా ఎండి చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణమేమిటి, ఇసుక రీచుల్లో కాంట్రాక్టర్లు టీజీఎండిసి సిబ్బంది అధికారుల ప్రోత్సాహంతో దోపిడి రాజ్యాన్ని సృష్టించి అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తుంటే మేనేజింగ్ డైరెక్టర్ టి జి ఎం డి సి ఎక్కడ అని, ప్రజలు ప్రశ్నించక తప్పడం లేదు. ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ టి జి ఎం డి సి తక్షణమే, చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు.!

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేకే సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు

ధర్నాలో వనపర్తిఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రధాని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు
నేషనల్ హెరాల్డ్ న్కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర టీ పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
ప్రతిపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు
కాంగ్రెస్ పార్టీ పై కక్ష దింపు చర్యలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదనిఎమ్మెల్యే ఆగ్రహం చేశారు నిరసన
కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డి సి సి బి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,  పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version