మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్….

మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్

చొప్పదండి, నేటిధాత్రి:

 

జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలోని అక్షయ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ లతవిశ్వజన్ మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, అదేవిధంగా మహిళలందరూ ఉన్నత విద్యను అభ్యసించి, అన్ని రంగాల్లో ముందుండాలన్నారు రానున్న రోజుల్లో మహిళలు అందరూ రాజకీయంగా ఎదగాలని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి పాఠశాల సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అక్షయ పాఠశాల కరస్పాండెంట్ తమ్మిడి కనుకరాజు, ప్రిన్సిపాల్ శ్రీమతి, హుజురాబాద్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అక్షయ్, సిద్ధెంకి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి…

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి

 

 

 

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

 ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు.తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని తెలిపారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు.

రైతమ్మలకు జేజేలు..

రైతమ్మలకు జేజేలు

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే… ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది.

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే… ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యవసాయ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. పొలాల్లో విత్తనాలు చల్లటం నుంచి, కుటుంబాన్ని నడిపించే దాకా… వ్యవసాయ రంగాన్ని నిశ్శబ్దంగా మోస్తున్న ఎందరో రైతమ్మల కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు ఇది. నేడు (మార్చి 8) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా కొందరు మహిళా రైతుల విజయగాథలకు నీరాజనాలు పలుకుదాం…

ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు మండలం సొవ్వ, కరకవలస గ్రామాల్లో 45 మంది మహిళా రైతులు… 13 పురాతన దేశీయ వరి రకాలను సాగు చేయడంతో పాటు, కరకవలస గ్రామంలో గెడ్డ వాగు వరదలకు మునిగిపోకుండా తట్టుకునే 4 నుంచి 6 అడుగుల వరకు పెరిగే దేశీయ వరిని సాగు చేస్తున్నారు. ఇక్కడి కుటుంబాలకు ఎకరం నుంచి రెండు ఎకరాలకు మించి ఉండదు. ‘‘ఇవి దేవుడు ఇచ్చిన ధాన్యపు రకాలు అని మా నమ్మకం. బస్నా సోప్పూర్‌, బుడమ ధాన్యం, దేశీ పెద్దధాన్యం, దేశీ రాజముడి, ఎర్ర ధాన్యం, గుడుం ధాన్యం, ఇసుకరవ్వలు, జోజోర్కి ధాన్యం, మాస్టర్‌ ధాన్యం, నల్ల ధాన్యం, పసుపు సన్నాలు, సోర్‌ ధాన్యం, తేటం ధాన్యం ఇలా 13 రకాలు పండిస్తున్నాం.

మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు….

మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్‌ పెట్టారు. మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..

‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి (ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం), దీపం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం), ఎన్టీఆర్ భరోసా (వితంతు పింఛన్లు) వంటి పథకాలను అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని… ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశాం. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ…. కేంద్ర ప్రభుత్వంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కావాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్…

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో మ‌హిళా పారిశ్రామిక‌వేత్తను త‌యారు చేసే ప్రణాళికలు అమ‌లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతి వేదికగా లోకేశ్ మాట్లాడారు.

మహిళా శక్తి – సమాజ ప్రగతికి బలమైన పునాది…

మహిళా శక్తి – సమాజ ప్రగతికి బలమైన పునాది

ఆత్మవిశ్వాసంతో ముందుకు నేటి మహిళలు.

మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సేవలకు కృతజ్ఞతా వందనం.

వరంగల్, నేటిధాత్రి.

 

ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేసే ప్రత్యేక రోజు ఇదే. కుటుంబ నిర్వహణ నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

మహిళల విద్యా హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సామాజిక సంస్కర్తల్లో ముందుగా గుర్తుకు వచ్చేది సావిత్రీబాయి పూలే. మహిళలకు విద్య అవసరమని సమాజానికి చాటి చెప్పిన ఆమె సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన కవయిత్రి సరోజినీ నాయుడు మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

దేశ రాజకీయ చరిత్రలో ధైర్యవంతమైన నాయకురాలిగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మహిళలు కూడా అత్యున్నత పదవులను అధిరోహించగలరని నిరూపించారు. అంతరిక్ష రంగంలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కల్పన చావ్లా యువతకు ప్రేరణగా నిలిచారు.

క్రీడా రంగంలో కూడా భారత మహిళలు విశేష విజయాలు సాధిస్తున్నారు. ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు మరియు ప్రపంచ స్థాయి బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ భారత మహిళల ధైర్యం, పట్టుదల ప్రపంచానికి చాటిచెప్పారు.

ఇలాంటి గొప్ప మహిళల స్ఫూర్తితో నేటి మహిళలు కూడా విద్య, స్వావలంబన, ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధిలో కూడా మహిళలు కీలక పాత్ర పోషించాలని వారు పేర్కొంటున్నారు.

నేటి మహిళలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ ప్రతిభను నిరూపించుకుంటే సమాజ ప్రగతికి మరింత బలమైన పునాది ఏర్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధించగలదని నిపుణులు పేర్కొంటున్నారు.

విద్య, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం వంటి అనేక రంగాల్లో మహిళలు తమ ప్రతిభతో సమాజ ప్రగతికి బలమైన పునాది వేస్తున్నారు. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధించగలదని నిపుణులు పేర్కొంటున్నారు.

మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తూ వారి సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశాన్ని మహిళా దినోత్సవం ఇస్తోంది.

✍️✍️
గంగరాజు కందికొండ
స్టాఫ్ రిపోర్టర్, నేటిధాత్రి, వరంగల్.

పట్టణ అభివృద్ధికి సహకరించాలి-తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

పట్టణ అభివృద్ధికి సహకరించాలి-తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని తోరూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మునిసిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందులచే ప్రతిజ్ఞ చేయించి, 10వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు సమన్వయంతో పట్టణ అభివృద్ధికి పాటుపడాలన్నారు.
అన్ని వార్డులలో పనులు జరిగే విధంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువకులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సోమ రజని రాజశేఖర్, కౌన్సిలర్లు తూర్పాటి రవి, మాడుగుల భవానిలత, అల్లం శ్యామల, కిన్నెర కవిత, ముద్దసాని సురేష్, ధరావత్ పద్మ,చకిలేల అలివేణి, జాటోత్ భద్రు నాయక్, మున్సిపల్ సిబ్బంది,మెప్మా, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి…

ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం గట్లకానీపర్తి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తు న్నారు తేదీ 08 03 2026 ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం నిర్వహిం చబడును. మెడికల్ హెల్త్ క్యాంప్ ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య సేవలకు గట్ల కనపర్తి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన నర్సింహులపల్లి ప్రోచా రo,మాందారిపేట సూరంపేట మరియు పులుకుర్తి తదితల గ్రామాలకు చెందిన మహిళలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

2025 మార్చ్ 9వ తేదీన విజయవాడలో శ్రీ శ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో

నారీ రత్న అవార్డుకు ఎంపికైన
భద్రాచలవాసి ఎర్రంశెట్టి పూర్ణిమ.

భద్రాచలం నేటి ధాత్రి

మన భద్రాచల మహిళ..
తెలుగు పండిట్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజీ కౌన్సిలర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం జిల్లాకమిటీ మెంబర్,
పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు అయిన ఎర్రంశెట్టి పూర్ణిమ
భద్రాచల పరిసర ప్రాంతాలలోని గిరిజన పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల యందు ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ గా విద్యార్థులకు లైఫ్ సెట్టింగ్, లైఫ్ గోల్, టైం మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉచిత సెమినార్లునిర్వహిస్తున్నారు.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా) నందు జిల్లా కమిటీ మెంబర్ గా మహిళా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, మహిళాచట్టాలు, మహిళాసాధికారతలపై మహిళలకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు.
కుటుంబ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ను నిర్వహిస్తున్నారు.
భద్రాచలపట్టణంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత నిర్వహించే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ,
సాహిత్యాభిలాషతో తనవంతు సాహితీసేవలను అందిస్తున్నందుకుగానూ అభినందిస్తూ
శ్రీశ్రీ కళావేదిక నిర్వహించే ఆమెకు వందనం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నారీరత్న అవార్డుకు ఎంపిక చేసారు.
ఈ అవార్డును స్వీకరించవలసినదిగా
శ్రీ శ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత గారు పూర్ణిమకు ఆహ్వానాన్ని పంపించారు.
ఈ సందర్భంగా ఎర్రంశెట్టి పూర్ణిమను భద్రాచల పట్టణ ప్రముఖులు, సాహితీవేత్తలు అభినందించారు.
ఈ విషయంపై ఆమె హర్షాన్ని వ్యక్తం చేస్తూ..
వివిధ రంగాలలో విజయపథం వైపు దూసుకెళ్తున్న మహిళా మణులకు పట్టంకట్టే బృహత్తర కార్యక్రమంలో తనను ఎంపికచేసి నారీరత్నను అందిస్తున్నందుకు, జాతీయస్థాయిలో భద్రాచల పట్టణంలో సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలను ప్రోత్సహిస్తున్నందుకుగానూ..
శ్రీ శ్రీ కళావేదిక సి.ఈ.ఓ. డా. కత్తిమండ ప్రతాప్ కు, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలితకు ఎర్రంశెట్టి పూర్ణిమ ధన్యవాదాలు తెలియజేసారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version