కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి::

జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…
కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాధించాలని అ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఇటుకాల మొండయ్య,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి::

 

 

జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…
కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాధించాలని అ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఇటుకాలమొండయ్య,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, బావి భారత ప్రధాని అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు..
రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు పూజారి వెంకన్న , వగలబోయిన శ్రీను, దంచనాల రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం, గోగు కిరణ్ కుమార్, మేడి శ్రీను, అశ్రపునిస, పోలేబోయిన సుజాత,కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

కాంగ్రెస్ సినియర్ నాయకున్ని పరామర్శించిన.

కాంగ్రెస్ సినియర్ నాయకున్ని పరామర్శించిన

మున్నూరుకాపు సంఘము మండల అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో గుడివాడలో కాంగ్రెస్ సినియర్ నాయకుడు సిరంగి బిక్షపతి పటేల్ తల్లి సిరంగి రాధమ్మ స్వర్గస్తులయ్యారు కావున వారి కుటుంబ సభ్యులను పారమర్శించి ఓదార్చి మనోధైర్యం చెప్పిన గణపురం మండల మున్నూరుకాపు సంఘము అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్ వారి వెంట తో దేవేందర్ పటేల్ సిరంగి రామకృష్ణపటేల్ రిటైడ్ ఈఈ,ప్రభాకర్ పటేల్, రాజేశ్వర్ రావుపటేల్, అన్నం అనిల్ పటేల్,పటేల్,సురేష్ పటేల్,సుధాకర్ పటేల్,విడిదినేని రవి పటేల్ విద్యుత్ ఏ ఈ, శంకర్ పటేల్ పుప్పాల రామారావు పటేల్ నర్సింగం పటేల్ రామదాసు బాబు రాముణయ్య రవీందర్ రెడ్డి ల్యాదేళ్ల సమ్మయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్ సీనియర్ సివిల్.!

జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. కవిత దేవి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జూన్ 14 న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను పునస్కరించుకొని స్థానిక కోర్టు ఆవరణలో మీడియా ప్రతినిధులతో సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. కవిత దేవి సమావేశమై తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాజి మార్గం ద్వారా రాజీ పడదగ్గ కేసులను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులందరు లోక్ ఆదాలత్ పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. లోక్ ఆదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకోవడం ద్వారా సమయాన్ని, డబ్బును ఆదాచేసుకున్నవారావుతారని సూచించారు. బాధితులు, కాక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. లోక్ ఆదాలత్ పై ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న స్థానిక తహసీల్దార్ కార్యాలయాలను గాని, న్యాయ వాదులను గాని, పోలీస్ ఉన్నతధికారులను గాని, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను గాని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రింట్ మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు చింతల రమణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం మరణించాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మృత దేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ.!

కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంస్థ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనాపాల శంకరయ్య కార్యనిర్వహణలో కాశ్మీరంలో జరిగిన ఉగ్ర చర్యను ఖండిస్తూ స్వర్గస్తులైన వారికి మౌనం పాటిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు. చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ కఠిన చర్యలు ఉగ్రవాదుల మీద గైకొనాలని ప్రభుత్వం నేడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండకూడదని పేర్కొన్నారు. డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా పోతున్నదని ఇలా అయితే శాంతికి విఘాతం కలుగుతుందని వాపోయారు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ స్వర్గస్తులైన వారికి సద్గతులు ప్రాప్తించాలని వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దొంత దేవదాస్ మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కాశ్మీరంలో శాంతిని నెలకొల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించారు.

సీనియర్ సిటిజన్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో 2007 తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2011 లోని ముఖ్య అంశములను సెక్షన్ల వారిగా తెలుగు భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనువదించిన వాల్ పోస్టర్లను జిల్లా ఎస్పీ, మహేష్.బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ చట్టం ప్రకారం సామాన్యులకు కూడా చట్టంలోని అంశములు తెలిసి ఫిర్యాదు చేయుటకు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది అని తెలిపారు. మరియు ఎస్పీ అనుమతితో ఆఫీసు ముందర పోస్టర్ను అతికించడం జరిగినది. అత్యధికంగా ప్రజలు తిరిగే ఆర్డిఓ. కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది. సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి అనుమతితో అక్కడ కూడా వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంఘ సభ్యులు, దొంత దేవదాసు, సహాయ కార్యదర్శులు , అంకారపు జ్ఞానోబా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు
– దీక్ష సమయంలో బిజెపి మద్దతు
– బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు
సిరిసిల్ల, (నేటి ధాత్రి):

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో గురించి దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసిన తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకొని మల్క కొమురయ్యకు ఓటు వేశారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ సీనియర్ నాయకులు గర్రెపల్లి ప్రభాకర్,ఆడెపు రవీందర్,పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేవైఎం అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్,మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు,నరేష్, మోర రవి, విష్ణు, రాంప్రసాద్, పట్టణ అధ్యక్షురాలు పండుగ మాధవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ అధికార ప్రతినిధి కోడం శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version