అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
2025 మార్చ్ 9వ తేదీన విజయవాడలో శ్రీ శ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో
నారీ రత్న అవార్డుకు ఎంపికైన
భద్రాచలవాసి ఎర్రంశెట్టి పూర్ణిమ.
భద్రాచలం నేటి ధాత్రి
మన భద్రాచల మహిళ..
తెలుగు పండిట్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజీ కౌన్సిలర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం జిల్లాకమిటీ మెంబర్,
పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు అయిన ఎర్రంశెట్టి పూర్ణిమ
భద్రాచల పరిసర ప్రాంతాలలోని గిరిజన పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల యందు ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ గా విద్యార్థులకు లైఫ్ సెట్టింగ్, లైఫ్ గోల్, టైం మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉచిత సెమినార్లునిర్వహిస్తున్నారు.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా) నందు జిల్లా కమిటీ మెంబర్ గా మహిళా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, మహిళాచట్టాలు, మహిళాసాధికారతలపై మహిళలకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు.
కుటుంబ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ను నిర్వహిస్తున్నారు.
భద్రాచలపట్టణంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత నిర్వహించే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ,
సాహిత్యాభిలాషతో తనవంతు సాహితీసేవలను అందిస్తున్నందుకుగానూ అభినందిస్తూ
శ్రీశ్రీ కళావేదిక నిర్వహించే ఆమెకు వందనం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నారీరత్న అవార్డుకు ఎంపిక చేసారు.
ఈ అవార్డును స్వీకరించవలసినదిగా
శ్రీ శ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత గారు పూర్ణిమకు ఆహ్వానాన్ని పంపించారు.
ఈ సందర్భంగా ఎర్రంశెట్టి పూర్ణిమను భద్రాచల పట్టణ ప్రముఖులు, సాహితీవేత్తలు అభినందించారు.
ఈ విషయంపై ఆమె హర్షాన్ని వ్యక్తం చేస్తూ..
వివిధ రంగాలలో విజయపథం వైపు దూసుకెళ్తున్న మహిళా మణులకు పట్టంకట్టే బృహత్తర కార్యక్రమంలో తనను ఎంపికచేసి నారీరత్నను అందిస్తున్నందుకు, జాతీయస్థాయిలో భద్రాచల పట్టణంలో సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలను ప్రోత్సహిస్తున్నందుకుగానూ..
శ్రీ శ్రీ కళావేదిక సి.ఈ.ఓ. డా. కత్తిమండ ప్రతాప్ కు, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలితకు ఎర్రంశెట్టి పూర్ణిమ ధన్యవాదాలు తెలియజేసారు.