అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు?
నోటీసులకే పరిమితం అవుతున్న అధికారుల చర్యలు
పిర్యాదులు చేసిన పట్టింపు లేదాయే.
అస్తవ్యస్తంగా మున్సిపల్ పాలన?
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల అలసత్వంతో అక్రమ కట్టడాలు, అక్రమ భూకబ్జాలు రోజురోజుకు ఒక మాఫియాల పేట్రేకి పోతున్నది. ప్రభుత్వ భూములను, చెరువు మొత్తానికి కాల్వలను గ్రీన్ ల్యాండ్లను అక్రమదారులు కబ్జా చేసిన, నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలను అక్రమ కట్టడాలు చేపట్టిన సంబంధిత అధికారులకు పట్టింపు లేకుండా పోతున్నదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నర్సంపేట పట్టణంలో ప్రధాన ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.నర్సంపేట పట్టణం నెక్కొండ రోడ్డులో గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనకాల మరియు నెక్కొండ రోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలో , మరియు ద్వారకపేట రోడ్డులో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలో అక్రమంగా నిబంధనలు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలతో నేటిధాత్రి దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది.కథనాలకు స్పందించిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సంబంధిత అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.కాగా వాటిపై చర్యలకు వెనుకాడిన అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ
ఎంసిపిఐ[ యు ] రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ ,నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి మరోసారి మున్సిపల్ కమిషనర్ కు,టౌన్ ప్లానింగ్ అధికారులకు పిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో ఒక వైపు నేటిధాత్రి వరుస కథనాలకు,మరో వైపు ఎంసిపిఐ పార్టీ ఫిర్యాదులతో మూడు అక్రమ భవన నిర్మాణ యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు.పట్టణ భౌగోళికల పట్ల
కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతున్నారని చర్చలు జరుగుతున్నాయి.అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులకు చేతులురావడం లేదా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.గతంలో కూడా ఒక ప్రముఖ వైద్యునికి సంబంధించిన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అక్రమంగా కట్టారని మున్సిపల్ అధికారులు కూలగొట్టారని ప్రజలు గుర్తుకు చేస్తున్నారు.ఆ అక్రమ భవన నిర్మాణాల పట్ల నోటీసులు ఇచ్చిన అధికారులు చర్యలు తీసుకోకుండా ఆ నోటీసులకే పరిమితం చేయడం వెనక ఏమైన ముడుపులు ముట్టాయా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.