పరీక్షల వేళ ఫీజులుo
మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు
విద్యార్థులను ఇబ్బంది చేస్తే ఊరుకోం
బిఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్
శాయంపేట నేటిధాత్రి;
రేపు జరగబోయే ఇంటర్మీ డియట్ వార్షిక పరీక్ష వేల విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరిగింది.ఇంటర్ ఎగ్జామ్స్ నీ బేసిక్ చేసుకొని ప్రవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేస్తే ఏ కాలేజీ అయినా ఊరుకునే సమస్యలేదని బి ఎస్ యు బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడుమాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఆవేదన గురవుతున్నారు ఇంటర్మీడి యట్ సెకండియర్ విద్యా ర్థులతో పాటు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు పేద మధ్యతరగతి పిల్లలను చాలీచాలని జీతాలతో తల్లిదండ్రులు చదివించడం జరుగుతుంది.కానీ ఈ టైంలో ఎగ్జామ్స్ బేసిక్ చేసుకొని హాల్ టికెట్ ఆపి పిల్లల తల్లిదండ్రుల నుండి అదనంగా డబ్బులు దండుకోవాలని చూస్తే
ఆ కాలేజీలపై బి ఎస్ యు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని యజమాన్యాలకు, అధికా రులకు డిమాండ్ చేశారు.