జహీరాబాద్ లో తైబజార్ వేలము.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-41-4.wav?_=1


జహీరాబాద్ లో తైబజార్ వేలము

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2025 2026 సంవత్సరము యొక్క తైబజారు మరియు కబేళాల ఫీజు వసూలు చేయుటకు వేలము తేది: 28-08-2025 గురువారం ఉదయం 11:30 గం,,లకు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ యందు జరగనుంది.కావున వేలములో పాటలో పాల్గొనే అసక్తి కల వారు నియమనిబంధనలు తెలుసుకొని వివరముల పట్టిక పురపాలక సంఘం కార్యాలయము నోటీసు బోర్డుపై అన్ని ప్రభుత్వ కార్యలయముల నోటీసు బోర్డుల పై ఉందని పురపాలక సంఘం అధికారులు తెలిపారు కావున ఎవరైనా ఈ వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు అధికార పురపాలక సంఘం కార్యాలయము నోటీసు బోర్డుపై ఉండని సూచించారు

 

గణేష్ మండపాల పర్మిషన్ కోసం ఇలా అప్లై చేసుకోండి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-69.wav?_=2

గణేష్ మండపాల పర్మిషన్ కోసం ఇలా అప్లై చేసుకోండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గణేష్ నవరాత్రులకు మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు https://policeportal.tspolice .gov.in/index.htmలో పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. “విద్యుత్ కనెక్షన్ కోసం డిడి కట్టాలి. సొంతంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దు. నిపుణులతో మాత్రమే పనిచేయించండి. గాలి,వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోండి” అని పోలీసులు తెలిపారు.

ప్రధానోపాధ్యాయ పదోన్నతి: వెబ్ ఆపరేషన్ ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T125911.773-1.wav?_=3

 

ప్రధానోపాధ్యాయ పదోన్నతి: వెబ్ ఆపరేషన్ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించే వెబ్ ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన ప్రధానోపాధ్యాయులు http://transfer.de.telangana.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబడతాయి.

గణపతి మండపాలవద్ద రాత్రి 10,„వరకు తక్కువ సౌండ్ అనుమతి,…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T114914.128-1.wav?_=4

 

గణపతి మండపాలవద్ద రాత్రి 10,„వరకు తక్కువ సౌండ్ అనుమతి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగా రెడ్డి జిల్లా: జహీరాబాద్ మండల పరిది లోని గణేష్ నిర్వాహకులకు బహీరాబాద్ రూరల్ పోలీస్ వారి విజ్ఞప్తి విదాయక ప్రతిమను ప్రతిష్ఠించడలచినవారు

ముందస్తుగా జహీరాబాద్ రూరల్ పోలీసులకు ఆన్లైన్ %https://police portal.tspolice.goviny index.htm% లింక్ ద్వారా గణేష్ విగ్రహ వివరాలు నమోదు చేసి అట్టి పూర్తిచేసిన సమాచారం కాపీని పోలీస్ స్టేషన్ నందు సమాచారం నిమిత్తం అందించాలని

సూచిచ్చారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి జహీరాబాద్ రూరల్ పోలీసుల మాచనలు:అట్టి లింకులో మాదించిన వివరాలు పొందుపరిచిన అనంతరం, పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. వినాయక మండవం ఏర్పాటు చేయదలచిన ప్రదేశం వివరాలతో పాటు నిమజ్జనం చేసే ప్రదేశం, రోజు, సమయం దారి వంటి వివరాలను కుదా

ఈ లింక్ ద్వారా నమోదు చేయవలిసి ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే మండప యజమానులు రహదారులపై, ప్రజలు తిరిగే రోడ్లపై కాలిబాటల పైన ప్రతిష్టించరాదు. ఎట్టి

పరిస్థితులలోను జనజీవనానికి అంతరాయం కలిగించరాదు. గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల వాహనాల పార్సింగ్ కొరకు తగినంత దూరంలో, నిర్దేశించిన ప్రదేశాలలో పార్కింగ్ చేసుకొనే విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి గణేష్ మండప నిర్వాహకులు: విద్యుత్ సరఫరాకై విద్యుత్ శాఖ నుండి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి భారీ వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద షార్ట్ సర్యూటీ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, నాణ్యతతో కూడిన మండప నిర్మాణం రేపట్టాలన్నారు. మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాట్లకు అనుమతి లేదు. ఎవరైనా లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వద్ద, ప్రార్థన మందిరాల వద్ద పెద్ద శాబ్దాలతో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయరాదు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యలు చేయడం, పాటలు పెట్టడం వంటివి చేయవారు. గణేష్ మండపాలను జాగ్రత్తగా

చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలి గణేష్ మండపాల వద్ద టపాకాయలను, మందుగుండు సామాగ్రిని ఉండరాదు, మండపాల వద్ద కరెంట్ పోయినా, ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ ల్యాంప్ అందుబాటులో ఉంచుకోవాలి. మండపాల వద్ద వీడియో రికార్డింగ్ కోసం సి.సి. టివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి గణేష్ మండపాల వద్ద లక్కీ లాటరీ లేదా బలవంతపు చందాలు చేయకూడదు. గణేష్ మంటపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గణేష్ మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలి. రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి వచ్చే పోలీస్ అధికారికి మంటప వలంటీరు సహకరించాలి. మట్టి వినాయక విగ్రహాలను పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మితిమీరిన విగ్రహ పరిమాణల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున విగ్రహ పరిమాణాలలో పరిమితులు పాంటించాలి.
అత్యవసర సమయంలో, ఏదైనా సమాచారం ఉన్నా డయల్ 100 కు సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారంబవ్వాలి.

ఐటిఐ లలో ఫ్రీ అడ్మిషన్స్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T111910.339-1.wav?_=5

 

ఐటిఐ లలో ఫ్రీ అడ్మిషన్స్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అన్నీ ఏ పి ఎమ్ లు మరియు సి సి లు
మన ఎస్ హెచ్ జి లలో అర్హత కలిగిన మెంబెర్స్ మరియు ఎస్ హెచ్ జి మెంబెర్స్ కుటుంబ సభ్యులు అయినా పైన తెలిపిన ఐటిఐ కోర్సులలో వెంటనే ఫ్రీ గా జాయిన్ అవ్వుటకు ప్రభుత్వ్వం అవకాశం కల్పిస్తుంది ఈ.అవకాశం 28-08-2025 వరకు కలదు.పటాన్‌చెరువు మరియు హత్నూర ఐటిఐ లలో ఫ్రీ అడ్మిషన్స్ కలిగి ఉన్నవి వెంటనే సంప్రదించ గలరు ఏమైనా క్లారిఫిఫికేషన్ కొరకు డి ఆర్ డి ఎ డి పి ఎం ఎస్ ను సంప్రదించవలెను,

జహీరాబాద్ లో డీ ఎల్ పి ఓ కార్యాలయం జడ ఎక్కడ…

జహీరాబాద్ లో డీ ఎల్ పి ఓ కార్యాలయం జడ ఎక్కడ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్రము ఏర్పడి దాదాపు 11 సంవత్సరాల పూర్తి అయి డివిజన్ లు ఏర్పడి అన్ని డివిజల్ కార్యాలయాలు ఏర్పడినప్పటికి పంచాయతీ రాజ్ మరియు రూరల్ డిపార్ట్మెంట్ నుండి మాత్రం ఇప్పటి వరకు డి ఎల్ పి ఓ కార్యాలయం నేటికీ లేకపోవడం అందరికి విస్మయానికి గురించేస్తుంది.. సంబంధిత డి ఎల్ పి ఓ కి పెన్ గన్ న్యూస్ ప్రతినిధి వివరణ అడిగిన ఎమ్ పట్టనట్టు గా వేవహరిస్తుంది..

 

సంబంధిత అధికారి జహీరాబాద్ లో ఉండకపోవడం వలన గ్రామాలలో పర్యవేక్షణ లేకపోవడం వలన గ్రామాలలో చెత్త చెదారం పెరుకపోవడం,డంపింగ్ యార్డ్ తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ లేకపోవడం, వైకుంఠ దామలు ఉపయోగంలోకి రాకపోవడం ఇలా ఎన్నో సమస్యలు గ్రామాలలో పేరుకుపోవడం వలన ప్రజలు అనారోగ్యలకు గురి కావడం జరుగుతుంది.. అంతే కాకుండా సంగారెడ్డి కి ఎంతో దూరంగా ఉన్న గ్రామలు అనేకం… రాయికోడ్ మండలంలోని పంపాడు, మరి కొన్ని గ్రామాల ప్రజలు, మొగుడంపల్లి, న్యాల్కల్ మండలం లోని గ్రామాలు పూర్తిగా బీదర్ సరిహద్దులలో ఉండడం వలన సంబందించిన అధికారికి ఏమైనా సమస్య లు

 

చెప్పుకొందమన్న కార్యాలయం లేకపోవడం విడ్డురంగా ఉంది..డి ఎల్ పి ఓ కార్యాలయం లేకపోవడం పై సంబంధిత అధికారికి కొందరు ప్రజల ప్రశ్నించగా ఎవరికైన చెప్పుకోండి అని దాటావేయడం సరి కాదని ప్రజల కోరుకుంటున్నారు.

 

 

. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సంబంధిత అధికారులు స్థానికంగాo ఉండాలని నిబంధనలు ఉన్నపటికీ… ఈ అధికారికి మాత్రం అవిఏవి పట్టీపు లేన్నట్టు గా ఉండడం విడ్డురం గా ఉంది..ఇప్పటికైనా ఇలాంటి అధికారి పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసికొని,ప్రజలకు అందుబాటులో ఉండే అధికానిరి నియమించలని జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు

జహీరాబాద్ వార్డు నెం 9 శాంతినగర్. కుక్కల దాడి

జహీరాబాద్ వార్డు నెం 9 శాంతినగర్. కుక్కల దాడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాంతి నగర్ లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఐదు కుక్కలు దాడి చేసి రెండు నిమిషాల్లోనే ఒక చిన్న మేకను చంపేశాయి.
కుక్కలు తరచుగా వీధుల్లో తిరుగుతున్నాయి. మున్సిపల్ సిబ్బందికి ఈ విషయం తెలియదు, ప్రజా ప్రాంతాల నుండి కుక్కలను దూరంగా ఉంచాలని నేను కమిషనర్ మునిసిపాలిటీని అభ్యర్థిస్తున్నాను. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు,

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యువజన కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యూత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో. రోగులను ప్రజలను అన్నదాన ప్యాకెట్లు పంచే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు,

జహీరాబాద్ లో వినాయక చవితి సమీక్ష సమావేశం..

జహీరాబాద్ లో వినాయక చవితి సమీక్ష సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం మధ్యాహ్నం డీఎస్పీ సైదా అధ్యక్షతన వినాయక చవితి పండగ సందర్భంగా ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఐలు కాశీనాథ్, నరేష్, వినయ్ కుమార్ తో పాటు పురపాలక, రోడ్లు భవనాలు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పది సంవత్సరాలు పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-68.wav?_=6

పది సంవత్సరాలు పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ యువ నాయకులు అశ్విన్ పటేల్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న, జహీరాబాద్ నియోజకవర్గంలో వందకు వంద శాతం అన్ని గ్రామాలలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందుతమ్మనారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో, ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో, కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్నారు. పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి, పాలించింది. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు, మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలు తీర్చాడని అన్నారు, పార్టీలో పదవులు లేకపోయినా అందరూ కలిసి మండలంలో పని చేస్తున్నాము. అధికారం ముఖ్యం కాదు, ప్రజల కోసం పని చేస్తున్నాము. పార్టీలో ఎవర్ని నిలబెట్టిన గెలిపించుకుంటాం. పని చేసుకుంటూ పోతే పదవులు అవే వస్తాయన్నారు. ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ జహీరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో, అత్యధిక శాతం స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం అని జహీరాబాద్ యువ నాయకులు అశ్విన్ పటేల్ సూచించారు.

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం చిరాగ్పల్లి గ్రామానికి చెందిన రఘు (42) వ్యవసాయ బావిలో కాలుజారి పడి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో మంగళవారం కేఫ్ ఎతనిక్ లో వివిధ కుల సంఘల నాయకులందరూ ఈ నెల 22వ తేదీన జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. జహీరాబాద్ పట్టణంలో బాహర్ వాలే హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదాలతో బంద్ కి పిలుపు ని ఇవ్వడం జరిగింది.తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమా కాలంలో ఎంతో మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది అని జహీరాబాద్ పట్టణంలో వివిధ కుల సంఘాల నాయకులు అన్నారు.ఈ కారిక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములునేత,పెద్ద గోల్ల నారాయణ, తిన్మార్ నర్సిములు,మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్, దిగ్వాల్ రామేష్,మంగాలి ప్రభు,దత్తు,ఉమేష్,సి.హేచ్ శ్రీనివాస్, ప్యార్ల దశరథ్, తదితరులు పాల్గొన్నాడం జరిగింది.

ఝరాసంగం ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలు,

ఝరాసంగం ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలు,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరన్న పటేల్, మండల అధ్యక్షుడు దినకర్, ఫోటోగ్రాఫర్లు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాల వేసి, తోటి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదని, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడటానికి, సంస్కృతి, ప్రకృతి, మానవ భావోద్వేగాలను భవిష్యత్ తరాల కోసం భద్రపరిచే అద్భుత మాధ్యమమని వీరన్న పటేల్ అన్నారు.

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య,

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య,

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాసురామ్ అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక

24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈ నెల 24న జహీరాబాద్ లో పెన్షన్ పెంపు కోసం నిర్వహించే మహా గర్జన సన్నాహక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తప్పక హాజరు కావాలని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు నర్సింహులు కోరారు.

శేఖపూర్ ఆంజనేయస్వామి దేవాలయం:

శేఖపూర్ ఆంజనేయస్వామి దేవాలయం: శిల్ప సంపదతో రామాయణ గాథ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం కలిసి ఉన్న ఏకైక క్షేత్రం. వందల ఏళ్ల నాటి రావి చెట్టు కింద కొలువై ఉన్న ఈ దేవాలయం, అద్భుతమైన శిల్ప సంపదతో రామాయణ చరిత్రను రంగుల రూపంలో కనువిందు చేస్తుంది. ప్రతి మంగళవారం, శనివారం ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది.

ఉరివేసుకొని వ్యక్తి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T154900.138-1.wav?_=7

 

ఉరివేసుకొని వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ టౌన్ / ఝారసంగం మండలం
గుర్తు తెలియని మగ వ్యక్తి సంఘటన మంగళవారం చోటు చేసుకుంది ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం వయస్సు అందాజు 30 నుండి 35 సంవత్సరాలు, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, కుప్పానగర్ గ్రామ శివారులో ఒక పురాతన పాడుబడిన డాబా యందు గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు ఇతని యొక్క వివరాలు తెలిసినచో క్రింది నంబరుకు ఎస్ ఐ
8712656771జహీరాబాద్ రూరల్ సిఐ 8712656732. సంప్రదించగలరని తెలిపారు,

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-60.wav?_=8

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ముర్తుజ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన.

BRS Leaders

జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ ,నాయకులు చిన్న రెడ్డి,దీపక్ ,అలి,సలీం, అర్షద్,ఆసిఫ్ తదితరులు .

భారీ వర్షాలకు పంట నష్టం: ఏఓ పరిశీలన…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T164823.516-1.wav?_=9

 

భారీ వర్షాలకు పంట నష్టం: ఏఓ పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి సోమవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా మినుము, పెసర, సోయా పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. వర్షం నీరు పంట పొలాల్లో నిల్వ ఉండకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.

చివరి శ్రావణ సోమవారం అన్నదానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-5.wav?_=10

చివరి శ్రావణ సోమవారం అన్నదానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని శ్రీ కైలాసగిరి శివాలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయానికి వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించారు. శివాలయం సేవకులు మలేష్ యాదవ్, కృష్ణా రెడ్డి, రమేష్, నాగేష్తో పాటు వారి బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version