ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం.

ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం

కల్వకుర్తి నేటి దాత్రి:

కల్వకుర్తి పట్టణం లోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఈనెల 30వ తేదీన వాహనాల వేలంపాట నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ సిఐ వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎక్సైజ్ కేసులో పట్టుబడిన ఆటోలు, బైకులు వాహనాలను వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.

పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం.

పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం

పరకాల నేటిధాత్రి

పరకాల నందు వివిధ నేరాల పై పట్టుబడిన వాహనాలను జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వరంగల్ రూరల్ ఆదేశానుసారం బుధవారం రోజున ఉదయం 11గంటలకు ప్రోహిభిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరకాల నందు వేలం నిర్వహించడం జరుగుతుందని కావున ఆసక్తి కలిగినవారు వాహనం అప్ ప్రైస్ పై 50శాతం డిపాజిట్ గా చెల్లించి వేలం లో పాల్గొనవచ్చని ఎక్సయిజ్ సిఐ
పి.తాతాజీ తెలిపారు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు

నర్సంపేట,నేటిధాత్రి:

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలంపాట వేయడం సరికాదని ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆరోపించారు.

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించగా అనంతరం నరేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం పాట ద్వారా అమ్మే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

యూనివర్సిటీ అభివృద్ధి కోసం పని చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ భూములు అమ్మి విద్యార్థులకు నష్టం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.

యూనివర్సిటీ భూమి రక్షించుకునేందుకు విద్యార్థి నాయకులు ధర్నాలు నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం సరికాదని అవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈశ్వర్, రాజేష్ చింటూ, నాగరాజ్, ప్రమోద్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శంభునిపల్లి గ్రామపంచాయతీ మేకల అంగడి వేలం.

శంభునిపల్లి గ్రామపంచాయతీ మేకల అంగడి వేలం వాయిదా* మళ్లీ వేలం ఈనెల 28వ తారీకు

జమ్మికుంట: నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని శంబునిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన అంగడి వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కిషన్ ఇంగే తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 28న 11.30కు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 27న సాయంత్రం 4 గంటల వరకు రూ. 20 వేల డీడీ ‘పంచాయతీ కార్యదర్శి, శంబునిపల్లి’ పేరున తీసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని అయన సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version