ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య,
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాసురామ్ అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
