జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్…

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

https://youtu.be/n8XtHC_g77I?si=37zwAlH0YSjCUecg

వారం రోజులుగా కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప..

హైదరాబాద్, సెప్టెంబర్ 7 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వారం రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో.. కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. కవితను సస్పెండ్ చేయటంతో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమచారం.

మరోవైపు, పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యంగా టార్గెట్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. వీటితోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ‌నెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 13న‌ గద్వాల్ నియోజకవర్గంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని కేటీఆర్ భావిస్తున్నారు. దసరా లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

పాపయ్య గారికి నివాళులర్పించిన నల్లాల ఓదెలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-68.wav?_=1

పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన నల్లాల ఓదెలు

మందమర్రి నేటి ధాత్రి

*మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ తండ్రి పాపయ్య కి నివాళులు అర్పించిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ గారి తండ్రి మేడిపల్లి పాపయ్య స్వర్గస్తులవగా విషయం తెలుసుకొని కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, రామన్నపల్లి గ్రామంలోని వారి స్వగృహం నందు పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-64.wav?_=2

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గీతా భాస్కర్ గత కొద్ది నెలల క్రితం బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళగా తిరిగి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సర్పంచ్ గీత భాస్కర్ తో పాటు పూజారి సాంబయ్య పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మారం రాము, గాదె భద్రయ్య, గుంటుక సోమయ్య,బండి సత్యనారాయణ రెడ్డి, నరేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మోహన్ రెడ్డి, దొమ్మటి పురుషోత్తం, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

‘‘కేసీఆర్‌’’ సంతోషంలో కనిపించేది ‘‘సంతోషే’’!


`‘‘కేసీఆర్‌’’ ఆరోగ్యానికి ఔషదం ‘‘సంతోషే’’!

`చెదిరిపోని చిరునవ్వుతో ‘‘కేసిఆర్‌’’ ఆనందానికి కారణం ‘‘సంతోషే’’!

`పాతిక సంవత్సరాలకు పైగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేస్తున్నాడు.

BRS MP SANTOSH RAO

`అనుక్షణం ఆసరాగా వుంటున్నాడు.

`కుడి భుజమై కాపాడుకుంటున్నాడు.

`సహాయకుడుగా నిరంతర సేవలందిస్తున్నాడు.

`నిరంతరం ‘‘కేసీఆర్‌’’ వెన్నంటే వుంటాడు.

BRS MP SANTOSH RAO

`ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలోనూ ‘‘సంతోష్‌’’ కనిపిస్తారు.

`కన్న తండ్రికి మించి సపర్యలు చేస్తూ వుంటాడు.

`సంతోషమైనా, ఆపదైనా ‘‘కేసీఆర్‌’’ వెనకాలే వుంటాడు.

`ఆసుపత్రిలో వున్నా కన్నపిల్లలకన్నా ఎక్కువగా ‘‘కేసీఆర్‌’’ను చూసుకుంటాడు.

`అలాంటి ‘‘సంతోష్‌’’ సేవలను శంకించడం తగదు.

`అనుక్షణం ‘‘కేసీఆర్‌’’ తన వద్ద ‘‘సంతోషే’’ వుండాలని కోరుకుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్ర లేవక ముందే అక్కడుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్రపోయిన తర్వాత ఇంటికెళ్తాడు.

`‘‘కేసీఆర్‌’’ ను దైవం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు.

`జీతం కోసం పని చేసే వారు జీవితం త్యాగం చేయరు.

`తన వ్యక్తిగత జీవితమంతా ‘‘కేసీఆర్‌’’ కోసం త్యాగం చేస్తున్నాడు.

`ప్రతి వ్యక్తికి కుటుంబం వుంటుంది.

`జీవితంలో ప్రతి వ్యక్తి రాణించాలనే అనుకుంటాడు.

`ఆస్థులు, అంతస్తులు కోరుకోని వారుండరు.

`‘‘సంతోష్‌’’ స్థానంలో ఎవరూ ఒక్క రోజు కూడా వుండలేరు.

`‘‘సంతోష్‌’’ లాగా ‘‘కేసీఆర్‌’’ ను కంటికి రెప్పలా ఎవరూ చూసుకోలేరు.

`కన్న పిల్లల కన్నా ‘‘సంతోష్‌’’ ను ‘‘కేసీఆర్‌’’ చూసుకోవడానికి కారణం అదే.

`అయినా రాజకీయ వారసత్వం ‘‘కేటీఆర్‌’’ దే.

`కూతురుగా కుటుంబంలో కీలక స్థానం ‘‘కవిత’’దే.

`ఎంతగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేసినా ‘‘సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే’’!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

జోగిన పల్లి సంతోష్‌రావు. ఈ పేరు పన్నెండేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ కీలక ఉద్యమకారులకు, బిఆర్‌ఎస్‌ నాయకులకు, మీడియాలో కూడా కీలకమైన జర్నలిస్టులకు తప్ప పేరు తెలియని నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ సిఎం. అయ్యాక సంతోష్‌ పేరు నిత్యం వినిపిస్తూ వచ్చింది. సంతోష్‌ గురించి కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో చాలా మందికి పరిచయం అయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ దీక్ష చేస్తున్న సమయంలో సంతోష్‌ ఏమిటో? ఆయనకు పార్టీలో వున్న ప్రాదాన్యత ఏమిటో? ఆయన ఎవరో? ఆయనకు కేసిఆర్‌ కు వున్న బంధుత్వం గురించి తెలంగాణ ఉద్యమకారులకు తెలిసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కేసిఆర్‌ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కేసిఆర్‌ వెనుకే నిలబడిన వ్యక్తి సంతోష్‌ అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుంచి ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతోద్యోగులు సంతోష్‌ గురించి చర్చించుకోవడం అందరం విన్నదే. ఎప్పుడైతే సంతోష్‌ రాజ్యసభ అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా ఆయనెవరో పూర్తిగా తెలిసింది. అప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌, కేసిఆర్‌ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్‌రావుల తర్వాత నాలుగో వ్యక్తిగా రాజకీయాల్లో సంతోష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒక దశలో సంతోష్‌ పేరే రాజకీయ, ఉద్యోగ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అంతలా సంతోష్‌ గొప్పదనమేముంది? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. బిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు సంతోష్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజ్యసభకు ఎంపిక చేశారు. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అసలు సంతోష్‌కు రాజకీయాలకు ఏం సంబంధం అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు కేసిఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్‌ గురించి చెప్పడం జరిగింది. సంతోష్‌ కూడా ఆదినుంచి ఉద్యమంలోనే వున్నారనే విషయం వెల్లడిరచారు. అంతే కాకుండా ఉద్యమ నాయకుడుగా తనను కాపాడుకునే బాద్యత తీసుకున్నాడు కేసిఆర్‌ చెప్పారు. కేసిఆర్‌ను తెలంగాణ ఉద్యమం మొదలై, 2004 ఎన్నికల సమయం నుంచి సంతోష్‌ డిల్లీలో కేసిఆర్‌కు తోడుగా వుండడం మొదలు పెట్టారు. తెలంగాణలో హరీష్‌రావు, డిల్లీలో కేసిఆర్‌ వున్నప్పుడు సంతోష్‌ చూసుకుంటూ వచ్చారు. ఇలా ఇరవై ఐదు సంతవ్సరాలుగా కేసిఆర్‌ యోగ క్షేమాలు చూసుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌ ఎప్పుడు ఎవరిని కలవాలి. ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి. కేసిఆర్‌ ఎప్పుడు ఏం తినాలి. మందులు వేసుకోవాలి. అని ప్రతిపతి క్షణం కనిపెట్టుకుంటూ, కేసిఆర్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కేసిఆర్‌ తనకు ఎప్పుడు ఏ మందులు కావాలో, ఇవ్వాలో చూసుకుంటాడు. అని చెప్పినప్పటినుంచి ప్రతిపక్షాలు సంతోష్‌ను అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ వచ్చారు. వివాదాలు సృష్టిస్తూ వచ్చారు. అయితే బిఆర్‌ఎస్‌ రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్‌ మీద కుట్రలు చేసిన వారు కూడా చాల మంది వున్నారు. కవిత లాంటి వారు కూడా తమకు కేసిఆర్‌ అప్పాయింటు మెంటు ఇవ్వకుండా సంతోష్‌ను అడ్డుకుంటున్నాడంటూ కూడా సన్నిహితుల వద్ద చెప్పిన సందర్భాలున్నాయి. ఇలా అనేక విమర్శలు కూడా సంతోష్‌ ఎదుర్కొన్నారు. కేసిఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే సంతోష్‌ ఇక్కడ ఆస్ధులు సంపాదించాడు. అక్కడ ఆస్ధులు కొనుగోలు చేశాడంటూ కూడా అనేక వర్తాలు వచ్చేవి. వాటిని ఎవరు లీక్‌ చేసేవారో ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే కవిత నేరుగా సంతోష్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతోంది. సంతోష్‌ను వేలెత్తి చూపిస్తోంది. కాని తన తండ్రి ఇప్పటికీ ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా వుండడానికి కారణం సంతోష్‌ అని తెలియదా? సంతోషంగా వున్నప్పుడు ఎవరి గురించి తెలియదు. కాని బాదల్లో వున్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్న పదేళ్లకాలంలో సంతోష్‌ రావు తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లినట్లు గాని, కుటుంబంతో కలిసి ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినట్లు గాని ఒక్క ఫోటో బైటకు రాలేదు. కాని కవిత కుటుంబం గురించి అనేక వార్తలు వచ్చాయి. కేసిఆర్‌ సిఎం. అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రిలో కనిపించే ఏకైక నాయకుడు సంతోష్‌. కేసిఆర్‌ ఎన్ని రోజులు ఆసుపత్రిలో వుంటే అన్ని రోజులు కూడా ఆసుపత్రిలోనే వుంటూ ప్రతి క్షణం కాపాడుకునే నాయకుడు సంతోష్‌. ఈ మధ్య అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కేసిఆర్‌ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనను కన్న తండ్రికన్నా ఎక్కువగా చూసుకుంటున్న ఏకైక వ్యక్తి సంతోష్‌. తన తండ్రి కేసిఆర్‌ను ఇంత గొప్పగా, ఇంత జాగ్రత్తగా కేటిఆర్‌, కవితలు కూడా చూసుకునేవారు కాదు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం వుంటుంది. పుట్టిందే జీవితాన్ని గొప్పగా అనుభవించడానికి, కాని సంతోష్‌ లాంటి వ్యక్తికి అన్నీ కళ్లముందు వున్నా అనుభవించలేని జీవితాన్ని గడుపుతున్నాడని ఎంత మందికి తెలుసు. అది అనుభవించేవారికే తెలుస్తుంది. మన కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులైనా సరే ఒక్క రోజు ఆసుపత్రిలో వుంటే చూసుకోవాలంటే చిరాకు పడిపోతాము. అలాంటిది ఒక కేసిఆర్‌ను పట్టుకొని పాతిక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంతోష్‌పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇది కవిత గమనించాలి. సంతోష్‌ను విమర్శించి కవిత తప్పు చేసిందని బిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. కుటుంబ సమస్యను కవిత బజారున పడేయడమే కాకుండా కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ను విమర్శిండం సరైంది కాదంటున్నారు. అంటే కేసిఆర్‌ సంతోషంగా వుండడం కవితకు ఇష్టం లేదా? కేసిఆర్‌కు సంతోష్‌ను దూరుం చేస్తారు? సరే..మరి కేసిఆర్‌ను సంతోష్‌లగా చూసుకునే వ్యక్తిని తేగలరా? రాజకీయాలు వదిలేసి కవిత తండ్రి కేసిఆర్‌ను చూసుకోగలరా? ఇవి ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ. కేసిఆర్‌ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్న సంతోషే అసలైన ఔషదం అని బిఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. రోజూ ఎంత పని ఒత్తిడిలో వున్న చెరగని చిరునవ్వుతో కనిపించే సంతోష్‌ వల్లనే కేసిఆర్‌ ఆర్యోగంగా ఆనందంగా వుండగలుగుతున్నాడని అంటుంటారు. దేవుడికైనా గుడిలో సేవ చేసే పూజారి కూడ కొంత సమయమే వెచ్చిస్తాడు. కాని కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ ఇరవైనాలుగు గంటుల కేసిఆర్‌ వెంటే వుంటారు. కేసిఆర్‌ వెన్నంటే వుంటారు. కేసిఆర్‌ కోసం జీవితమే త్యాగం చేశారు. తనను కన్న తండ్రిలా చూసుకున్న సంతోష్‌ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా కేసిఆర్‌ చూసుకుంటూ వస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లుగా కంటేనే అమ్మ అని అంటే ఎలా? అన్నట్లు కేసిఆర్‌ను ఎంతో ప్రేమతో సేవలు చేస్తున్న సంతోష్‌ అంటే కూడా కేసిఆర్‌కు అంత ప్రేమ వుంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవితం వుంటుంది. కుటుంబం వుంటుంది. కాని సంతోష్‌కు జీవితం, కుటుంబం కూడా కేసిఆరే అయ్యారు. కేసిఆర్‌ను దేవుడిగా కొలుస్తూ సేవలు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రకంగా రాణించాలనే వుంటుంది. ఎక్కడో జీవితం ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఆస్ధులు, అంతస్ధులు సంపాదించుకోవాలని అనుకుంటారు. కాని కేసిఆర్‌కు సేవ చేయడమే తన జీవితానికి గొప్ప అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయినా సంతోష్‌ ఎప్పుడూ కేసిఆర్‌కు రాజకీయ వారసుడు కాదు. కుటుంబంలో కవిత కన్నా కీలకమైన స్దానం కూడా కాదు. కేసిఆర్‌కుఎంతసేవ చేసినా సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే తప్ప, వారసుడు కాలేడు. ఈ సత్యం సంతోష్‌కు తెలియంది కాదు. కవితకుతెలియంది కాదు. అయినా సంతోష్‌ను వేలెత్తి చూపి ఆయన మనసు గాయపర్చడం అంటే కేసిఆర్‌ మనసు కష్టపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా కవిత ఈ సంగతి తెలుసుకోకపోవడం విడ్డూరం. ఏది ఏమైనా సంతోష్‌ లాగా కేసిఆర్‌కు సేవలు చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత ఓపిక వున్న వారు ఎవరూ వుండరు. ఈ విషయంలో సంతోష్‌ ఈస్‌ గ్రేట్‌ అని అందరూ అనాల్సిందే.

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది…

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము

మొగులపల్లి (నేటిధాత్రి ):

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నడిగోటి రాము మాట్లాడుతూ. తెలంగాణలో టిఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని ఆయన అన్నారు గంపగుత్తగా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గుంట నక్కల దోచుకొని దాచుకొని అవినీతి, దోపిడీ, దొంగతనాలను పిసి గోష్ కమిషన్ ద్వారా అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక లిక్కర్ రాణిని తెరపైకి తీసుకువచ్చి మళ్ళీ ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మీ కల్వకుంట్ల కుటుంబం ద్వారా చాలా తీరని అన్యాయం జరిగింది. ఎన్నో అవినీతి అక్రమాలు ఎక్కడ చూసినా కమిషన్లు పదేళ్లు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తియడమే కాకుండా లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. మీ కల్వకుంట్ల కుటుంబం బండారం బయట పడేసరికి వాళ్లు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు. అని నువ్వు అనడం మరునాడు నిన్ను మీ అధినేత సస్పెండ్ చేయడం ఇదంతా సినిమా లా అనిపిస్తుంది. స్క్రిప్ట్ ముందే రాయడం జరిగింది. కేసీఆర్ కాలేశ్వరం స్కామ్ కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఈ రేసింగ్ స్కామ్, కవిత ఢిల్లీ లొ లిక్కర్ స్కాం,సంతోష్ కుమార్ హరితహారం లొ స్కామ్ హరీష్ రావు దండాలు సెటిల్మెంట్ ఇరిగేషన్ అక్రమాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్కాం ద్వారా ఒక్కో కమిషన్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని నలుమూలల ధ్వంసం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లొ బిఆర్ఎస్ పార్టీని నామరూపల్లెకుండా చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
నేడు తెలంగాణ లొ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజలకి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ కావాలనేయూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని గతంలో కంటే ఎక్కువ యూరియాను జిల్లలో పంపిణి చేయడం జరిగిందణి రైతులకు తప్పుడు సమాచారం ఇస్తూ యూరియా కొరత ఉందంటూ ఆరోపణలు చేయడం తప్పా బి ఆర్ ఎస్ నాయకులు చేసేదేమి లేదని ఆయన అన్నారు. జిల్లా, మండల రైతులకు కావాల్సినంతా యూరియా వస్తుందని ఎవరూ కూడా అధైర్య పడవద్దని రైతులకు నడిగోటి రాము సూచించారు

గణేష్ ఉత్సవంలో అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T164005.932.wav?_=3

 

గణేష్ ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, భూక్య ఉమా,

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజ్ ఎన్టీఆర్ నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, వారి సతీమణి భూక్య ఉమా ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

 

ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ మండల ఓబీసీ ప్రెసిడెంట్ చిట్ల సంపత్ లావుడియా వెంకన్న అజ్మీర రాజు అజ్మీర దీప్లా మరియు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన టిపిసిసి ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, తరాల వీరేశం, దస్రు నాయక్, కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సుభాష్ రెడ్డి బోళ్ల కటయ్య బొల్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T152314.808.wav?_=4

 

హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం

ఇకనైన కవిత పునరాలోచించుకోవాలి

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి

 

మాజీ మంత్రి హరీశ్‌రావుపై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు సబబుకాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు అండగా ఉంటామని చెప్పారు.
కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తప్పుబట్టారు.నాడు ఉద్యమంలో,పాలనలో,నేడు ప్రతిపక్షంలోనూ హరీశ్‌రావు అనునిత్యం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారని తెలిపారు.బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం హరీశ్‌రావు ఎంతో కృషిచేశారని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ముందుండి పోరాటం చేసిన హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.కన్న తండ్రిని కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేయాలని చూస్తే సహించేదిలేదని అన్నారు.ఆనాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరు ఒక సోదరిలాగానే భావించామని తెలిపారు.ఇప్పటికైనా కవిత పునరాలోచించుకోవాలని సూచించారు.పార్టీ ని విచ్చిన్నం చేయాలనిచూస్తే మాత్రం అందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అందుకు ధీటుగా సమాధానం చెప్తామన్నారు.

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన స్పీకర్‌ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై తాజాగా.. మరోసారి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ నోటీసులకు తాను రిప్లై ఇచ్చినట్లు తెలిపారు. తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. అదే విషయాన్ని స్పీకర్‌కు ఇచ్చిన రిప్లైలో చెప్పానని స్పష్టం చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గ పనులు జరుగుతాయని కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. కానీ పార్టీ మారి తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో.. ఉంటే కిరాయి ఇంట్లో ఉన్నా అనే ఫీలింగ్ ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, హరీష్ రావు తనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్‌ నిర్ణయం ప్రకటిస్తారా..? లేక పెండింగ్‌లో పెడతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. సుప్రీంకోర్టు గడువు ముగిసేలోపు స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ జిల్లా పర్యటన సన్నాహాలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T155725.947.wav?_=5

 

రాష్ట్ర అధ్యక్షుని పర్యటన విజయవంతం చేయండి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం, కొక్కెరకుంట గ్రామాల శక్తి కేంద్రం ఇంఛార్జి వేముండ్ల కుమార్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం పరిధిలోని బూత్ కమిటీలతో శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ ఇంఛార్జి పోచంపెల్లి నరేష్ లు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సెప్టెంబర్ 3న జరిగే జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి బూత్ నుండి కూడా అధిష్టానం చెప్పిన విధంగా కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. తదనంతరం పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి గుంట అశోక్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, శేవాళ్ళ అక్షయ్, బూత్ కమిటీ అధ్యక్షులు కట్టెకొల మహేష్, కోడూరి గంగరాజు, నాగం రమేష్, గుంట సంజీవ్, బత్తిని సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పొటీకి సర్వసిద్ధం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T133630.709.wav?_=6

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పొటీకి సర్వసిద్ధం

◆: – షేక్ రబ్బాని ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఆగష్టు 29: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందని పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు. ఝరాసంగం మండల పరిధిలోని పలు గ్రామలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యయని అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ముస్లింలను దళితులను క్రిస్టియన్లను వెనుకబడిన కులాలను అణచివేయాలని దొరల పరిపాలన తరిమి కొట్టాలని మన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగ పోరాటం చేసి మన హక్కులను తీసుకోవాలన్నారు చెప్పులు మోసే చేతులు కట్టుకునే దినాలు పోయాయన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన గండ్ర..

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కటి సంజీవరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి నివాసానికి చేరుకొని ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన మొగిలి కోమల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం కర్కపల్లి గ్రామానికి చెందిన తాంపు నరసింగం గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు,పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్,ఐలోని రామచంద్ర రెడ్డి,నాయకులు రవీందర్ రెడ్డి, కేటీఆర్ సేనా జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, రాజిరెడ్డి,మల్లారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్, యాకయ్య, రఘు, తదితరులు ఉన్నారు.

రామడుగులో బిఆర్ఎస్ కీలక సమావేశం…

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ప్రతి గ్రామ పంచాయతీలో నోటీసు బోర్డులో పెట్టిన ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకుని, ఏమైనా తప్పులు ఉన్నచో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలనీ, ఎన్నికల గురించి ముఖ్యమైన అంశాల గురించి చర్చించి, తగు సూచనలు చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, తౌటు మురళి, మాజీ మార్కెట్ చైర్మన్ లు మామిడి తిరుపతి, గంట్ల వెంకటరెడ్డి, పూడూరు మల్లేశం, వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్ రెడ్డి, నాయకులు నాగి శేఖర్, జిల్లా రైతుబంధు సమితి మాజీ సభ్యులు వీర్ల సంజీవరావు, మాజీ సర్పంచులు పంజాల జగన్మోహన్ గౌడ్, వీర్ల రవీందర్ రావు, ఒంటెల వెంకటరమణరెడ్డి, సైండ్ల కరుణాకర్, దాసరి రాజేందర్ రెడ్డి, గుండి ప్రవీణ్, ఒంటెల అమర్, జవ్వాజి శేఖర్, జుట్టు లచ్చయ్య, మన్నె దర్శన్ రావు, గునుకొండ అశోక్, ఉకంటి చంద్రారెడ్డి, చిలుముల ప్రభాకర్, మాజి ఎంపీటీసీలు వంచ మహేందర్ రెడ్డి, కనకం కనకయ్య, బుగ్గ మల్లారెడ్డి, నాయకులు పిల్ల జగన్ రెడ్డి, లంక మల్లేశం, శనిగారపు అనిల్, శనిగరపు అర్జున్, బత్తిని తిరుపతి, ఆరెపల్లి ప్రశాంత్, ఎండి మోయిస్, చెన్నూరి శ్రీకాంత్ రెడ్డి, గంట్ల కిట్టురెడ్డి, పెరుమండ్ల శ్రీనివాస్, వంగ రమణ, మీసా లచ్చయ్య, దొడ్డి లచ్చిరెడ్డి, కళ్ళపల్లి కుమార్, మినుకుల తిరుపతి, గడ్డం మోహన్, రాగం లచ్చయ్య, మామిడి నర్సయ్య, శ్రీనివాస్, దర్శనాల మునిందర్, పెసరి రాజమౌళి, చిరుత జగన్, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి జిల్లా కార్యదర్శిగా మహేందర్ గౌడ్…

బిజెపి జిల్లా కార్యదర్శి గా రామగౌని మహేందర్ గౌడ్ నియామకం

తాండూరు(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా రామగౌని మహీధర్ గౌడ్ నీ శుక్రవారం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ నియమించి నియామక పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా బిజెపి మంచిర్యాల జిల్లా కార్యదర్శి మహీధర్ గౌడ్ మాట్లాడుతూ.. నాపైన ఎంతో నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు కల్పించినందుకు బిజెపి పార్టీకి నా శక్తి మేర కృషి చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.అలాగే బిజెపి రాష్ట్ర నాయకులకు,జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం…

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ యూత్ మండల
కో కోఆర్డినేటర్ రామన్న గూడెం చెందిన యువనాయకుడు భూక్యా రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
వజ్జ సారయ్య మరియు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి తెలిపారు నా ఈ యొక్క ఎన్నిక కు సహకరించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుకు జిల్లా నాయకులకు సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కు
నా ప్రత్యేక కృతజ్ఞతలు..అని
భూక్యా రాజు తెలిపారు

భూపాలపల్లిలో బిజెపి నాయకులకు ఘన సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T161743.003.wav?_=7

నూతనంగా ఎన్నికైన బిజెపి నాయకులకు ఘనంగా సన్మానం

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని దొంగల రాజేందర్ అన్నారు
స్థానిక బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి జిల్లా నూతన పదవులు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం స్థానిక బిజెపి నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది
నూతనంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఊరటి మునిందర్ రూరల్ మండల అధ్యక్షుడు పులి గుజ్జరాజు కి భూపాలపల్లి స్థానిక బిజెపి నాయకులు బిఎంఎస్ కార్యాలయంలో ఘనంగా పూల పుష్పం ఇచ్చి శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం స్వీట్స్ పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భట్టు రవి కంబాల రాజయ్య కంచం నరసింహమూర్తి అజ్మీర రాజు నాయక్ జంజాల సురేష్ తుమ్మేటి దామోదర్ బాణాల మధు ఆవుల సంతోష్ తాండ్ర హరీష్ తోట్ల స్వామి సిలోజు సాగర చారి తదితరులు పాల్గొన్నారు

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T155155.515-1.wav?_=8

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T153720.610-1.wav?_=9

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

యూరియా కోసం బిఆర్ఎస్ ధర్నా – కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సుధాకర్ రెడ్డికి నివాళులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-89.wav?_=10

సూరుడు సుధాకర్ రెడ్డి కి జోహార్లు

కొండు బానేష్ సి పి ఐ తాండూరు మండల కార్యదర్శి *

మంచిర్యాల ఆగస్ట్ 25 నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కమ్యూనిస్టు దిగ్గజం భారత విప్లవోద్యమానికి తీరని నష్టం సిపిఐ అగ్ర నేత. మాజీ సిపిఐ ప్రధాన కార్యదర్శి. మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మరణం భారత విప్లవోద్యమానికి తీరని నష్టదాయకమని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప కమ్యూనిస్టు అని జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను సవాళ్లను 20 సంవత్సరాల ముందే వాటి ప్రమాదాలు పర్య వస నాలను పసిగట్టి పార్టీ శ్రేణులను సమరశీల పోరాటాల వైపు నడుపుతూ భారత విప్లవోద్యమానికి ఉరకలు పెట్టించారని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం పరిధిలోని సురవరం సుధాకర్ రెడ్డి అమ్మమ్మ గ్రామమైనకొండ్రావు పల్లిలో జన్మించాడని. అలంపూర్ తాలూకా పరిధిలోని కంచుపాడు స్వగ్రామంలో బాల్యం విద్య కర్నూలు జిల్లాలో విద్యను కొనసాగిస్తూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) లో చేరి విద్యా రంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం కొనసాగించిన సురవరం సుధాకర్ రెడ్డి అంచలంచలుగా ఎదుగుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా.
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా విద్య వైద్య ఉపాధి హక్కులకై ఉద్యమించి భారత విద్యార్థి యువతను ఏకం చేశా డని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ రథసారథిగా సిపిఐ నిర్మాణాన్ని పటిష్ట పరుస్తూ పాలకుల విధానాలపై సమర శంఖం పూరించాడని 1971లో సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా పని చేశారని 1985. 1989. 1994. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని 2004 లో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారని. కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పని చేయడంతో పాటు అనేక పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ గా పని చేశారని సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ. 2012 మార్చి 31న పాట్నాలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహాసభలలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై మూడు పర్యాయాలు 2019 వరకు విశేష సేవలు అందించాలని రాజేశ్వరరావు తర్వాత సిపిఐ జాతీయ పగ్గాలు చేపట్టిన తెలుగు నేత సురవరం సుధాకర్ రెడ్డి అనేక ప్రపంచ దేశాలు పర్యటిస్తూ విప్లవ సిద్ధాంతాలను అంశాలను శోధించి కమ్యూనిస్టు మహానేతగా ఎదిగాడని సురవరం సుధాకర్ రెడ్డి వామపక్ష ఐక్యత కోసం పరితపిస్తూ మామపక్ష ఐక్య ఉద్యమాన్ని నిర్మించారని సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని. జిల్లాలో కరువు సమస్య ప్రాజెక్టుల సాధన. జల వివాదాల పరిష్కారం లాంటి అనేక సున్నిత అంశాలను కూడా సాధించి పెట్టారని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సురవరం పాత్ర మరువలేనిదని ఆయన మృతి యావత్ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సామాజిక లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు తీరని నష్టమని సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కంకణా బద్దులు కావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో
భయ్యా మొగిలి గోలేటి బ్రాంచి ఏఐటియుసి ఉపాధ్యక్షులు.
వాసాల నాగరాజు సిపిఐ తాండూర్ మండల ఆర్గనైజరీ సెక్రటరీ.
పట్టి శంకర్ సిపిఐ తాండూరు మండల కోశాధికారి.
కొండు సాయికుమార్ సిపిఐ చంద్ర పల్లి గ్రామ కార్యదర్శి.
కుర్సింగ తిరుపతి సిపిఐ 3 ఇంక్లైన్ గ్రామ కార్యదర్శి.
కంబాల చందు. కంబాల రాజయ్య. ఇందారపు పోషం. ముత్తె శంకర్. కొండు రాజేశం. గో గర్ల దుర్గయ్య. రాగుల రామ్ సాయి. నసిరుద్దీన్. తదితరులు పాల్గొన్నారు

తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్…

వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

 

 

డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.

 సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జర్వంతో చనిపోయిన మహేష్ (35), శ్రవణ్ కుమార్ (15) అనే యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిమ్మాపూర్ గ్రామంలో 40 నుండి 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైరల్ ఫీవర్ చికిత్స కోసం వెళ్లినా ప్రయోజనం లేక.. గ్రామ ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్ పెట్టామని.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం లోపించి గ్రామాలన్నీ పడకేశాయని.. తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడటానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version