యూరియా కోసం బిఆర్ఎస్ ధర్నా – కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..

హైకోర్టు ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..

సొసైటి చైర్మన్ ను సన్మానించిన పలువురు నాయకులు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవీకాలం గత మూడు నెలల క్రితం ముగియడంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహణ చేయలేకపోయిన
ప్రభుత్వం మరల అదే పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కాగా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ గా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన
సుకినే రాజేశ్వర్ రావు మాత్రం భాద్యతలు ఇవ్వలేదు.దీంతో నర్సంపేట డివిజన్ పరిధిలో గల బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సొసైటీల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో వీరి వాదనలు విన్న హైకోర్టు మరల బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర,జిల్లా సహకార అధికారులకు ఉత్తర్వుల జారీ చేసింది.
కాగా గురువారం సుకినే రాజేశ్వర్ రావు ఇంచార్జీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ నాచినపల్లి వ్యవసాయ సహకార సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ రైతులకు అందుబాటులో ఎరువులను అందించే విషయంలో ముందుంటామన్నారు. రైతులకు సంబంధించి క్రాఫ్ లోన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో సి. గ్రేడ్ ఉన్న సహకార సంఘాన్ని ఏ. గ్రేడ్ కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.డైరెక్టర్ల సహకారంతో రైతుల సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని రాజేశ్వర్ రావు తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన రాజేశ్వర్ రావు ను మాజీ జెడ్పిటిసి వడ్డేపల్లి చంద్రమౌళి, మాజీ చైర్మన్ గుడిపల్లి జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు గొర్రె జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివాజీ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బొరాల లింగయ్య తిమ్మంపేట గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రె జనార్దన్ రెడ్డి,నా చినపల్లి గ్రామ అధ్యక్షులు నర్రా రంగారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నల్ల శ్యాంసుందర్ రెడ్డి, గొసంగి పురుషోత్తం, మెరుగు రాజు, తుమ్మలపెల్లి సదానందం, హనుమకొండ లలిత బాబు, సాంబయ్య,సురావు సంజీవరావు, మోకిడే ప్రభాకర్, నరహరి భాస్కర్ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version