హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం
ఇకనైన కవిత పునరాలోచించుకోవాలి
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల నేటిధాత్రి
మాజీ మంత్రి హరీశ్‌రావుపై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు సబబుకాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు అండగా ఉంటామని చెప్పారు.
కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తప్పుబట్టారు.నాడు ఉద్యమంలో,పాలనలో,నేడు ప్రతిపక్షంలోనూ హరీశ్‌రావు అనునిత్యం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారని తెలిపారు.బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం హరీశ్‌రావు ఎంతో కృషిచేశారని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ముందుండి పోరాటం చేసిన హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.కన్న తండ్రిని కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేయాలని చూస్తే సహించేదిలేదని అన్నారు.ఆనాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరు ఒక సోదరిలాగానే భావించామని తెలిపారు.ఇప్పటికైనా కవిత పునరాలోచించుకోవాలని సూచించారు.పార్టీ ని విచ్చిన్నం చేయాలనిచూస్తే మాత్రం అందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అందుకు ధీటుగా సమాధానం చెప్తామన్నారు.
