జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్ కృతజ్ఞతలు తెలిపిన రజక సంఘం నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పార్లమెంట్ సమావేశంలో రజకులను ఉధ్యేషించి ప్రస్థావిస్తూ వారిని ఎస్సీ కోటాలో చేర్చాలని ప్రస్థావించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ గారిని జహీరాబాద్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో “ఝరాసంగం మండల కొల్లూరు మాజీ ఎంపీటీసీ సిహెచ్ రాజ్ కుమార్ మరియూ తెలంగాణ రాష్ట్ర రజక కమిటీ అధ్వర్యంలో” మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలతో సన్మానించి రజక సంఘస్థుల తరపునా కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో రాష్ట్ర,జిల్లా,మండలాల కమిటీ సభ్యులు పాల్గొని ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు..
మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు
నర్సంపేట,నేటిధాత్రి:
సిద్దిపేట శాసనసభ్యులు,మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు నర్సంపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాగా నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బారాస పార్టీ రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిపి జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి,పట్టణ కమిటీ నాయకులు, యూత్ కమిటీ సభ్యులు,మహిళా విభాగం నాయకులు,మాజీ కౌన్సిలర్స్, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం సిగ్గుచేటు
సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ నాయకులతో కలిసి గోడపత్రికలను భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను ఈ నెల ఆగస్టు 19నుండి 22వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అని తెలిపారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా,కార్యదర్శి కే నారాయణ లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన నిరంతరం పేదల పక్షాన పోరాటం చేసేది కేవలం కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నకిలీ ఓట్లతో అధికారంలోకి రావడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్, ఈడి తన గుప్పెట్లో ఉంచుకొని ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. దేశ ప్రజలకు ఎన్నికల వ్యవస్థ పైన నమ్మకం పోయిందని తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభలో భవిష్యత్ కార్యచరణ రూపొందించుకొని ఆందోళన పోరాటాలను కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కొత్త పింఛన్లను మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. మేడ్చల్ జిల్లాలో జరిగే సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి జాఫర్ నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ ఎండి యాకుబ్ పాషా గోనెలా తిరుపతి ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు గోలి లావణ్య, డిహెచ్ పీఎస్ నాయకురాలు పొన్నగంటి లావణ్య రమేష్ చారి శ్రావణ్ దేవేందర్ రవీందర్ స్వామి ఏకు రాములు పాండవుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి పార్టీ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ 20 మందితో బిజెపి పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ని రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం జరిగింది ఆరుగురు ఉపాధ్యక్షులు ముగ్గురు జనరల్ సెక్రెటరీ ఐదుగురు జిల్లా సెక్రెటరీ మీడియా కోఆర్డినేషన్ ఆఫీస్ బాయ్ 20 మంది సభ్యులతో జిల్లా కమిటీగా ఎన్నిక చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ నాయకుల పేర్లు చెప్పి కొంతమంది పాఠశాలలో కళాశాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు వారు ఎవరైనా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాము అని వారు అన్నారు అనంతరం జిల్లా కమిటీని ప్రకటించారు జిల్లా ఉపాధ్యక్షులుగా దాసరి తిరుపతిరెడ్డి. మోరి రవీందర్ రెడ్డి. వేషాల సత్యవతి. పూడెపాక స్వరూప. శ్యామల మధుసూదన్ రెడ్డి. గొర్రె శశికుమార్. జిల్లా జనరల్ సెక్రెటరీగా దొంగల రాజేందర్. పెండ్యాల రాజు. తాటికొండ రవి కిరణ్. డిస్టిక్ సెక్రటరీగా రాజేందర్ రెడ్డి. రామకృష్ణ. శ్రీనివాస్. వేణు. జిట్టబోయిన సాంబయ్య. ఆఫీస్ సెక్రటరీ తిరుపతి సోషల్ మీడియా ఇన్ఛార్జి దుగ్యాల రామచంద్రరావు మీడియా కవరే జ్ మునీందర్ ఐటీ ఇన్చార్జి వేణు రావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఎన్నికలకు సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డికి రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ పదవి మాకు ఇవ్వడంతో మా మీద మరింత భారం పెరిగింది బిజెపి పార్టీ స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలవడానికి మేము మా వంతుగా పాత్ర పోషించి మా నాయకులను కార్యకర్తలను స్థానిక సంస్థలు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మోడీ చేసిన ఓటు చోరీ రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే ఎమ్మెల్యే జీఎస్సార్..
భూపాలపల్లి నేటిధాత్రి
గురువారం లోకసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీపై చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ ఒకరి ఓటు దొంగలించడం అంటే ఒకరి హక్కులను దొంగలించడమే అన్నారు.మోడీ ఓటు చోరీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చేసిన ద్రోహం అని, ప్రజాస్వామ్యాన్ని రక్షించు కోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చల్లూరి మధు బుర్ర కొమురయ్య అప్పం కిషన్ దాట్ల శ్రీనివాస్ పిప్పాల రాజేందర్ జంబోజు పద్మ చల్లూరి సమ్మయ్య తోట రంజిత్ బౌత్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఇందిర మహిళలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఆశయం దిశగా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన. అందిస్తూ. అర్హులకు . లబ్ధిదారులకు.అండగా ఉండి ప్రభుత్వం. ఇందిరమ్మ. ఇండ్లు మంజూరైన. మహిళలకు. భూమి పూజ చేయడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్.పూజా కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన పేద ప్రజలకు. అనేక సంక్షేమ పథకాలు. అందిస్తూ వారికి అండగా ఉంటున్నారని ఇందిరమ్మ ఇల్లా నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని. లబ్ధిదారులు. అందరూ . వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అలాగే. ఆరోగ్యారంటీలే. కాకుండా. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల. అవకాశం కల్పిస్తూ. పేదవారి . కాంగ్రెస్ పెద్దలు. అధికారులకు పెద్దలకు ఎంతో కృషి చేస్తున్నారని వారందరికీ పేరుపేరునా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు.తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ.మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. మునిగిల రాజు. గుగ్గిల భరత్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు కోలా శంకర్. ఆనందం. ఎల్లయ్య. శ్రీను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా. సవతి తల్లి తన సవతి పిల్లలపైన సవతి ప్రేమా ఎలా చూపిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అడ్డగోలుగా, ఇష్టానుసారంగా తలా తోక లేని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు, అలాగే కామారెడ్డిలో డిక్లేర్ చేసిన బీసీ రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యమవుతుందని తెలుసుకోకుండా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు బిజెపి పైన ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ నీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసి డిక్లరేషన్ తెలిసి చేశారా తెలియక చేశారా అన్న అంశం కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి. జనవరి 1, 1979 నాడు అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషన్ ని బీ.పీ మండల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 340 ప్రకారం ఎవరైతే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉంటారో వాళ్ళందరినీ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కమిషన్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిటీ వాళ్లు సర్వే చేసి డిసెంబర్ 31, 1984 సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారము బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1979లో ఏదైతే గవర్నమెంట్ రూలింగ్ లో ఉండెనో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత 1980లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ 1989 వరకు అధికారంలో ఉండడం జరిగింది కానీ ఈ పదేళ్ల కాలంలో రాజీవ్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని ఈ రిపోర్టు పైన ఎలాంటి స్పందన తెలియజేయలేదు. 1990లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత 1990లో అప్పటి ప్రధానమంత్రి అయిన వీ.పీ సింగ్ గారు ఈ మండల్ కమిటీ వారు ఏదైతే రిపోర్టు ఇవ్వడం జరిగిందో ఆ రిపోర్టు ప్రకారము 27% రిజర్వేషన్ ఇవ్వాలని వారు నిర్ణయించుకొని రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ ని అమల్లోకి తీసుకురావడం వల్ల దేశంలో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నిరసనలు చేపట్టడం జరిగింది. అయితే ఇంద్రా సావ్నే అనే పిటిషనర్ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల, సుప్రీంకోర్టు ఇంద్రా సావ్నే vs యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగంలో మూడు గవర్నమెంటల్ మిషనరీస్ ని అమలులోకి తీసుకురావడం జరిగింది (లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ). అయితే పార్లమెంట్లో ఏదైతే బిల్లు పాస్ చేయడం జరుగుతుందో ఆ బిల్లు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ లిమిట్ ని విధించడం జరిగింది. ఇప్పుడు బిజెపి గవర్నమెంట్ బిసి రిజర్వేషన్ ని ఆమోదించిన కూడా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. ఒకవేళ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా చాలా స్పష్టమైన మరియు న్యాయపరమైన అలాగే స్టాటిస్టికల్ డేటాని చూపిస్తూ మన రాష్ట్రంలో బీసీలు ఎలా అణిచివేయబడుతున్నారు, వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతున్నది అని ఇలాంటి అంశాలన్నీ కూడా న్యాయస్థానానికి ఇచ్చినప్పుడు మాత్రమే బిసి రిజర్వేషన్నీ ఆమోదించడం జరుగుతుంది.మీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కాస్ట్ సర్వే చేశామని చెప్పడం జరుగుతుంది కానీ ఆ రిపోర్ట్ ని ఎందుకు బయట పెట్టడం లేదని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ ని ప్రశ్నించడం జరిగింది. ఆ రిపోర్టు బయట పెట్టినప్పుడు మాత్రమే మీరు ఎంత బాగా సర్వే చేశారని తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీ సర్వే కరెక్ట్ గా జరగలేదు బీసీల జనాభాని తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ వారు తీన్మార్ మల్లన్న నీ సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే బీసీ సర్వే అవ్వకముందే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎలా ప్రవేశపెడతారు? ఈ అడ్డిమారి గుడ్డి బిసి సర్వే ని ఆధారం చేసుకొని బిజెపి ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టు గాని ఎలా ఆమోదిస్తుంది అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలు తగిన బుద్ధి చెబుతారనే భయంతో బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తూ ఢిల్లీలో నిరసన తెలియజేయడం చూస్తుంటే, బట్ట కాల్చి బిజెపి పైన వేయాలన్న ఉద్దేశం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల వరకు భారతదేశంలో రూలింగ్ లో ఉండే మరి అప్పుడు బీసీల పైన ఈ ప్రేమ ఎక్కడ పోయింది, కొత్తగా ఈ ప్రేమ ఇప్పుడు ఎప్పటినుంచి పుట్టుకొచ్చిందో తెలియజేయాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది. మీ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇది సుప్రీంకోర్టు ఆమోదించదు మరియు 9th షెడ్యూల్లో కూడా చేర్చడం చాలా కష్టమైన విషయం అని తెలిసి కూడా బీసీల సింపతి కోసం మరియు బీసీల ఓట్ల కోసం ఈ సవతి ప్రేమ చూపించడం జరిగిందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ లో ఉన్న బీసీలు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాగే మద్దతు తెలిపితే మిమ్మల్ని ఇలానే మోసం చేస్తూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేలా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కావున కాంగ్రెస్ లో ఉన్న బీసీలు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాన్ని తెలుసుకోవాలని మరియు తెలుసుకుంటారని ఆశిస్తున్నానని జ్యోతి పండాల్ అన్నారు.
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లోని ఆదర్శనగర్ కాలనీలో సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి నివాసంలో ఆదివారం యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా.సిద్దం ఉజ్వల్రెడ్డి వారిని శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఏకు కార్తీక్
పరకాల నేటిధాత్రి
పథకాల పేరుతో దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని రెండో విడత దళితబందు విడుదల చేయాలని దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఏకు కార్తీక్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో దళతుల బలమేందో చూపిస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులను మోసం చేస్తూ వాళ్ళ ఓట్లను దండుకోవడానికి రెండో విడత దళిత బంధు నిధులిస్తాం,ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయల అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా డబ్బులు అందజేస్తామని చెప్పి దళిత బంధు నిధులు ఇవ్వకుండా కనీసం అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రారంభించకుండా దళితులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తుందని గత 18 నెలలుగా ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ఇదిగో అదిగో అని మాయమాటలు చెబుతూ దళితులను వంచిస్తుందని ఏకు కార్తీక్ తెలిపారు.ఇలాంటి ప్రభుత్వానికి ఇక ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నిర్ణయించుకుందని దానిలో భాగంగా మలిదశ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా రెండవ దశ దళిత బంధుసాధన ఉద్యమం ద్వారా ప్రభుత్వం మెడలు వంచుతామని తెలిపారు.దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి దళిత బంధు మరియు అంబేద్కర్ ఆభయం హస్తం ఇచ్చేదాకా దళిత బంధు సాధన సమితి లబ్ధిదారుల తరుపున పోరాటం చేస్తుందని అన్నారు.
ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు కల్వకుర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు ముందుగా కార్యక్రమంలో మొగలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…ఈనెల ఆరో తారీఖున కల్వకుర్తి పట్టణంలో జరిగిన బిజెపి ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ మాజీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హామీని ప్రజల సాక్షిగా నిలదీయడంతో రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని భయాందోళనలకు గురై కంగుతిన్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ కుమార్ 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండాతో పని చేస్తున్న,ఉద్యమనేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పోరాటాల సూర్యుడు, తల్లోజు ఆచారిని ఆరుసార్లు ఓడిపోయావని బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసి లోన్లు తేలేదని కించపరుస్తూ తిట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం…ఆచారి ఆరుసార్లు ఓడిపోయాడని అంటున్న నువ్వు ఒక్కసారి వెనుక తిరిగి నీ వీపు నువ్వు చూసుకో… మొదటిసారి కాటన్ మిల్ ఎలక్షన్లలో చిత్తరంజన్ దాసు గారి కాళ్లు పట్టుకొని గెలిచావు గుర్తులేదా…?ఇప్పటికీ 9 సార్లు ఓడిపోయిన నువ్వు నీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో… కౌన్సిలర్ గా ఓటమి… ఎంపీటీసీ గా ఓటమి… సర్పంచ్ గా ఓటమి… కాటన్ మిల్లు ఓటమి… 100 నుంచి 1000 ఓట్ల ఎలక్షన్లలో ఓడిపోయిన నువ్వు ఆచారి గారిని అనే అంత గొప్పోడివా…? మొదటి ఎలక్షన్లలో 8500 ఓట్లు రెండవ ఎలక్షన్లలో 52 వేల ఓట్లు మూడవ ఎలక్షన్లలో 29 వేల ఓట్లు నాల్గవ ఎలక్షన్లలో 42 వేల ఓట్లు ఐదవ ఎలక్షన్లలో 60 వేల ఓట్లు ఆరోసారి ఎలక్షన్లలో 70 వేల ఓట్లు కల్వకుర్తి ప్రజల చేత మన్నన పొంది కల్వకుర్తి ప్రజల ప్రేమాభిమానాలు ఆస్తులుగా సంపాదించిన తల్లోజు ఆచారీని కించపరుస్తావా…?బిజెపి నుండి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ నుండి టిడిపిలోకి టిడిపి నుండి స్వతంత్ర అభ్యర్థి వైపు అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ వైపు ఇప్పుడు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఇప్పుడు చెప్పండి ఇంకా ఏ పార్టీ మిగిలింది మీకు..?6సార్లు పార్టీలు మారిన నీచరిత్రను తిరిగేస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది కాదా…? నునుగు మీసాల వయసు నుంచి 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండా ఒకే పార్టీలో పనిచేస్తూ ఎన్ని గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా కలలో కూడా పార్టీ మారే ఆలోచన చేయకుండా నిరంతరం కల్వకుర్తి ప్రజల గురించి తప్పా తన వ్యక్తిగత జీవితం కూడా మరచి కల్వకుర్తి ప్రజల కోసం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు తల్లోజు ఆచారిని అవమానిస్తావా…? తల్లోజు ఆచారి బీసీ కమిషన్ ద్వారా ఏం న్యాయం చేశాడని ప్రశ్నించిన ఆనంద్ కుమార్ అసలు బీసీ కమిషన్ అంటే ఏంటో తెలుసా…? ఒక ఉన్నత విద్యావంతుడిని అని చెప్పుకుంటావు కదా..? బీసీ కమిషన్ కు నిధులు ఉండవన్న సంగతి నీకు తెలియదా…? బీసీ కమిషన్ అనేది కేవలం బీసీలకు న్యాయం చేయడానికి మాత్రమే ఏర్పడ్డ ఒక రాజ్యాంగ వ్యవస్థాని నీకు తెలియదా…? ఆచారి గారు బీసీ కమిషన్ మెంబర్ అయిన తర్వాతనే ఈ దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, లా యూనివర్సిటీలో, ఎంబీబీఎస్ సీట్ల విషయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు, అమలుపరిచారన్న సంగతి నీకు తెలియదా…? బీసీ కమిషన్ ద్వారా దక్షిణ భారతదేశంలో ఎంతోమంది బీసీ ఉద్యోగులకు బీసీ ప్రజలకు న్యాయం చేశాడన్న సంగతి మరిచిపోయావా…?మాట్లాడితే బీసీ బిడ్డ అని చెప్పుకుంటావు కదా కల్వకుర్తి పట్టణంలో గత 30 ఏళ్ళ నీ రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరికి న్యాయం చేసావో..?ఏ ఒక్క బీసీని ఉద్ధరించావో చూపిస్తావా…? ఒక్క బీసీ నైనా రాజకీయ నాయకుడిగా ఎదగనిచ్చావా…?ఖబర్దార్ ఆనంద్ కుమార్ నీ తప్పు తెలుసుకుని తల్లోజు ఆచారి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను…. అన్నారు. తదనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..పదవుల కోసం పార్టీలు మారే మీరు అలుపెరుగని పోరాటయోధులైన తల్లోజు ఆచారి గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం…మొన్న ఆరో తారీకు జరిగిన ర్యాలీలో 100 మంది పాల్గొన్నారు.అనడం నీఅవివేకం ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది అర్హులైన లబ్ధిదారులను కించపరచడం మీఅహంకారానికి నిదర్శనం…మీకాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ 2000 పెంచను 4000 చేస్తాం అనలేదా…?వికలాంగుల పింఛన్ 4000 రూపాయలను 6000 రూ” చేస్తాం అనలేదా..? ప్రతి మహిళకు నెల నెల 2500/-రూ ” ఇస్తాం అనలేదా..? ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తాం అనలేదా..? ప్రతి రైతుకు రెండులక్షల రూ రుణమాఫీ హామీ మీరు ఇచ్చింది కాదా..?ఎకరాకు ప్రతి సంవత్సరం 15000/- రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వలేదా…?మీరు ఇచ్చిన 6గ్యారంటీల దొంగ హామీల మీద మాట్లాడితే ఆచారిని తిడతారా..? ఈ ప్రాంతంలో ఆచారి గారి ప్రజా ఉద్యమాలు గుర్తులేదా..?KLI.. కోసం ఆమనగల్ నుంచి కల్వకుర్తి మీదుగా ఎడ్లబండ్లతో పాలమూరు కలెక్టర్ ముట్టడి మరిచినావా…KLI.. పూర్తి కోసం సీఎం ఇల్లు ముట్టడి కోసం రైతులతో చలో హైదరాబాద్ పేరుతో ప్రభుత్వంతో చేసిన యుద్ధం గుర్తులేదా..?రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్తు కోసం 4రోజుల దీక్ష గుర్తులేదా…? RDO.. కార్యాలయం కోసం ఏడు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి సాధించింది మరిచిపోయావా..?కొట్ర నుండి కల్వకుర్తి మీదుగా తిరుపతి వరకు 1000 కోట్ల రోడ్డును మోడీ గారితో మాట్లాడి పట్టుబట్టి తీసుకొచ్చింది మర్చిపోయావా..?ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ జడ్చర్లకు తరలిస్తే అప్పటి ప్రభుత్వంతో యుద్ధం చేసి కల్వకుర్తికి తెచ్చింది గుర్తులేదా..? కల్వకుర్తి ప్రాంతంలో ఏది సాధించాలన్న ఉద్యమాలకు ఊపిరి పోసి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి సాధించే ఏకైక నాయకుడు తల్లోజు ఆచారి అని తెలుసు కదా..?కల్వకుర్తిలో 20 సీట్లు గెలుస్తామని గొప్పలు మాట్లాడిన నీవు గత ఎన్నికల్లో కౌన్సిలర్ ఎందుకు ఓడినావు..?కల్వకుర్తి పట్టణంలో గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి పార్టీ ఎదుగుదలను భరించలేకనే కుట్రతో మాట్లాడుతున్నావని మాకు అర్థమవుతుంది…2014-2016-2023 ఆచారికి కల్వకుర్తి పట్టణం లీడు వచ్చింది నిజం కాదా…? నిజాలని గుర్తుంచుకొని మాట్లాడితే మీకే మంచిది ప్రశాంతమైన కల్వకుర్తిలో ఉద్దేశ పూర్వకంగా చిచ్చులు పెట్టాలని చూసే మీ కుటిల రాజకీయం ఇకపై చెల్లదు మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తల్లోజు ఆచారి కి క్షమాపణ చెప్పాలనిడిమాండ్ చేసారు…ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ సీనియర్ నాయకులు, సూర్య కృష్ణ గౌడ్,నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, బోడ నరసింహ, పాలకూర్ల రవి గౌడ్, సురేందర్ గౌడ్, గుండోజు గంగాధర్, నాప శివ,కొల్లూరు శ్రీధర్,తగుళ్ల వెంకటేష్ యాదవ్, లక్ష్మీ నరసింహ, సాయి,తోడేటి అరవింద్ రెడ్డి, వాకిటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్ లో Ktr పై జిల్లా బీజేపీ నాయకులు చేసిన వాక్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన BRS సిరిసిల్ల పట్టణ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్…. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు కలసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అధికారం లో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ని నీలాదీయడం మానేసి ప్రతి పక్షం లో ఉన్న KTR ని విమర్శించడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాం. Ktr సిరిసిల్ల నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రతి గ్రామం లో మేము చూపిస్తాం మీ నాయకుడు మంత్రి హోదా లో ఉన్న బండి సంజయ్ ఏమి చేసారో కనీసo ప్రతి మండలం లో అయినా చూపెట్టే దమ్ము మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం.బండి సంజయ్ తనకు తాను పెద్ద నాయకుడు అనే భ్రమలో ఉన్నాడు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే వ్యక్తి బండి సంజయ్ కాదు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే శక్తి కూడా కాదు అటువంటి నాయకుడి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ KTR లేదు అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడతారు గల్లీ లో మాట్లాడడం కాదు ప్రజా సమస్యేలపై పార్లమెంట్ లో మాట్లాడాలని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు పాస్ అని తప్పించుకొని పోకుండా పోరాటం చేయాలనీ బండి సంజయ్ కోరుతున్నాను. ktr సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి కి ఏంతగానో కృషి చేసారు మళ్ళీ అధికారం లో కి వచ్చాక మరింత ముందుకు తీసుకెళ్లే దమ్ము ktr కి ఉంది బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రం లో కేంద్ర పరిది లో ఉన్న ఒక ఫ్లై ఓవర్ దాదాపు 8 సంవత్సరము లుగా పనులు పూర్తి గాక అసంపూర్తి గా ఉండి అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది అది కూడా పూర్తి చేయని అసమర్ధత కలిగిన Mp మనకు ఉండటం మన దౌర్భాగ్యం కేంద్ర పరిది లో ప్రజలకు అవసరంమైన ఎన్నో అభివృద్ధి పనులు ఉంటాయి వాటిని తీసుకు రాకుండ మీ కుటుంబం వచ్చి గుడి లో ప్రమాణం చేస్తే మా కుటుంబం వచ్చి ప్రమాణం చేస్తుంది ఇవ్వా ఒక కాబినెట్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు..అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం లో జిల్లా నాయకులు మెట్ట రాజు,కత్తెర వరుణ్ కుమార్, BRSV పట్టణ అధ్యక్షులు షేక్ సికిందర్, వడ్లురి సాయి, సూర్య, జోయేల్, వడ్లురి వేణు, ఆరుట్ల శరన్ పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.
..తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. యూత్ ఆవిర్భావ. పండుగలను. యూత్ కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో 65.వ. వేడుకలను. ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు. జిల్లా ఇన్చార్జి తూముకుంట అంకక్ష రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ మరియు సీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1965.లో. ఇందిరాగాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. 1960వ. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని. ఇందిరా గాంధీ మరణం తర్వాత. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి. భారతదేశంలోని. యువత యువకులకు 18 సంవత్సరాల దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించిన ఏకైక వ్యక్తిగా. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని. ఆయన హయాంలోనే. దేశానికి ఐటీ రంగాన్ని తీసుకువచ్చి. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి భారతదేశాన్ని ముందంజలో ఉంచాలని ఆయన. ఆశయమని. దానికి అనుగుణంగా కాంగ్రెస్ యూత్ పార్టీ పనిచేస్తుందని. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. రాష్ట్ర అధ్యక్షులు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రవీణ్ తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి.మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.నియోజకవర్గ ఇన్చార్జి యూత్ చుక్క శేఖర్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ముందటి తిరుపతి. బండి పరశురాములు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలను పక్కన పెట్టిన ప్రభుత్వం…
హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలికి వదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. మందమర్రి పట్టణంలో జయశంకర్ ఏడడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తరలి వెళుతున్నామని అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణం నుండి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. సింగరేణి ప్రాంతంలో జీవో నెంబర్ 76 ప్రకారం వీళ్ళ పట్టాలు గత మా ప్రభుత్వంలో అందించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు అందించడంలో విఫలమయ్యిందని అన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కులుస్తుందని ధ్వజమెత్తారు.
Congress government
20 నెలల పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
మద్దూరు మండలం పిట్టల గూడెం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్
మద్దూరు నేటి ధాత్రి
జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో ధర్మారం గ్రామం పిట్టల గూడెం లో బీజేపీ మండల అధ్యక్షులు ఉదయ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం గ్రామ పిట్టల గూడెం లో కనీస వసతులు లేవని, ఉండడానికి ఇల్లు లేక గుడిసెల్లో జీవనం సాగిస్తుంటే పాము కాటుకు గురి కానీ కుంటుంబం అంటూ లేదు అని బాధపడ్డారు అలాగే మురుగు నీరు రోడ్లమీద ప్రవహిస్తుంటే ఈ కాలనీ వాసులు రోగాల పాలు అవుతున్నారని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మరుగు దొడ్లు మంజూరు చేపిస్తే ఈ కాలనీ వాసులకు ఇవ్వలేని దుస్థితి నెలకొనడం బాధాకరం అని వాపోయారు స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి, కాంగ్రెస్ ఇక్కడి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కంటికి కనబడడం లేదా అని మండిపడ్డారు. పిట్టల గూడెం ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేని యెడల వారి వారికీ అండగా బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు.అదేవిదంగా పిట్టల గూడెం రోడ్డు అద్వానంగా తయారై నిత్యం ప్రమాదలకు గురై నానా అవస్థలు పడుతున్నారని వెంటనే తారు రోడ్ ను వేయాలని డిమాండ్ చేశారు.అనంతరం పిట్టల గూడెం వాసులతో కలిసి వారి గుడిసెలో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కూరెళ్ల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బియ్య రమేష్, నరదాసు సందీప్, బండి శ్రీహరి,వినయ్, సిరిమల్లె సురేష్, ఏలూరి శివ, రవి, బొల్లు రాజు, ప్రశాంత్, సాయి కిరణ్, సాయి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంగని మనోహర్ మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పాదయాత్రలో కులగణన 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే, కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన అనే పేరుతో బీసీ బిడ్డలను మోసం చేస్తూ గద్దెన ఎక్కి కూర్చొని నేడు బీసీలకు విద్యా, వైద్యం, ఉపాధి కల్పనలో వెనుక అడుగు వేసేలా చూస్తుందని అంతేకాకుండా ఏదో ఒక బీసీ కుల గణన అని రాష్ట్రవ్యాప్తంగా చిన్న సర్వే చేపట్టి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండు ఒక్కటై బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో శీలం స్వామి, నందగిరి భాస్కర్ గౌడ్, మెరుగు తిరుపతి, నెమలికొండ భాస్కర్, కురుమని ప్రశాంత్, బొట్టుకు అజయ్,పీట్ల విన్న బాబు, అమర కొండ కృష్ణ, తదితర బిఆర్ఎస్ నాయకులు, పలు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల జనంపల్లి అనిరుద్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో.. చేపట్టిన పోరు బాట మహాధర్నాలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా..
బడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిగతులను స్వయంగా ఆయన గమనించారని, వారికి విద్య , ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా చట్టసభల్లో సైతం రిజర్వేషన్లు అవసరమని ఆయన భావించారని అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మెనిఫెస్టో లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామి ఇచ్చామని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి వారికి రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కుల గణన చేయించి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, వారితో చర్చించి, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి, బీసీలకు రిజర్వేషన్ ఆవశ్యకత పైన చర్చించి , అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి, కేంద్రానికి పంపించామని , కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా, వారు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాలన్నా రిజర్వేషన్లు అవసరమని ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది
కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్
పిసి గోష్ రిపోర్ట్ తప్పులతడక
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ,డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ ఫైర్
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో నవీన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి,డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని సమాజంలో బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, అది కాళేశ్వరం కమీషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కమిషన్ గా పని చేస్తుందన్నారు, పీసీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలాగ పనిచేసి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన విషయాలనే రిపోర్టులో పొందు పరిచాడు అన్నారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో కట్టిన తెలంగాణ ప్రజల వరప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, లక్ష ఎకరాలకు తాగు,సాగునీరు ఇచ్చె ప్రాజెక్టు ను ఎండ బెట్టే కుట్రకు తెర లేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్షాలు లేక పంటలు ఎండుతుంటే కనీసం రైతులకు సాగు నీరు ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా రైతులను ఆగం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల గొస తగులుతుందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న దురదృష్టపు పాలన అన్నారు,కేసీఆర్ ను తెలంగాణ సమాజంలో తక్కువ చేయాలని తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్రను చెరిపేయాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు ,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల రైతులు రెండు కార్లు పంటలు పండి రైతులు సంతోషం వ్యక్తం చేసే వారు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిని రాకుండా చేసి రైతులను ఆగం చేస్తుందన్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీల ను ఎప్పుడు అమలు చేస్తారన్నారు,ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు,రైతులకు 100శాతం ఋణ మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేతులెత్తేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలో కి వచ్చి బీసీలను మభ్య పెట్టే విధంగా డిల్లీ లో ధర్నా లు అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు,మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన దిక్కులేదు గాని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వo, వికలాంగులు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వికలాంగులను మోసం చేసింది అన్నారు,బిఆర్ఎస్ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మూల్యం తప్పదు అన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం వస్తుందని రైతులు,నిరుద్యోగ విద్యార్థులు, మహిళలు అందరు ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా రైతులు ఈ ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,గాదె అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తేజావత్ రవీందర్,కాలు నాయక్,కొమ్ము చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కొమ్ము నరేష్,బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రేఖ వెంకటేశ్వర్లు, వెంకన్న,సీనియర్ నాయకులు బాలాజీ నాయక్,గండి మహేష్ గౌడ్,గంధసిరి కృష్ణ,దుస్స నరసయ్య, అజ్మీర రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో కేంద్రంలో మహా సంపర్క అభియాన్ లో భాగంగా ఇంటింటికి బిజెపి ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు నవీన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ముందుగా కోటగుళ్లు లోని భవాని సహిత గన పేశ్వరాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యక్రమం ప్రారంభించింది ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి డోర్ స్టిక్కర్ వేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రతి ఇంటికీ పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమం గ్రామ స్థాయిలో బీజేపీ బలాన్ని పెంపొందించేందుకు తీసుకున్న ఒక కార్యాచరణ. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, బీజేపీ పాలన విశేషాలను తెలియజేయడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతోంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. మోడీ గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎన్నో ప్రజానుకూల పథకాలను ప్రవేశపెట్టారు ఉజ్వలా యోజన గ్యాస్ కనెక్షన్ల ద్వారా లక్షలాది మహిళలు వంటగదిలో పొగలు లేకుండా జీవించగలుగుతున్నారు. ఆయుష్మాన్ భారత్ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే జాతీయ ఆరోగ్య పథకం ద్వారా పేదలకు భారీ ఊరట. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చారు. హర ఘర్ నలే జల్ ప్రతి ఇంటికి శుద్ధ నీటి కనెక్షన్ కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రంతో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తున్నారు. పిఎం కిసాన్ రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 నేరుగా ఖాతాల్లో జమ చేయబడుతోంది. ఇంటర్నెట్ కనెక్షన్, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా వేగంగా కొనసాగుతోంది.ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో అననివార్యంగా ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ తీసుకున్న సమర్థవంతమైన నిర్ణయాలు. కాంగ్రెస్ గారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తే, మోదీ గ్యారంటీతో మేలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అభివృద్ధి లోపం, హామీల విఫలం వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గ్రామాల్లో అమలు చేయని హామీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ వంటివి ఇవన్నీ తుపాకి లాంటి వాగ్దానాలు అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కుల, వర్గ రాజకీయాలు ప్రోత్సహించి, సామరస్యాన్ని దెబ్బతీశారు. కుటుంబ పాలనపై ఆధారపడి యువత, సామాన్య కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి బూత్ స్థాయిలో బీజేపీ శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజాలు చెప్పాలి, కాంగ్రెస్ మోసాలను బహిరంగపర్చాలి, బీజేపీ అభివృద్ధిని చూపించాలి. బీజేపీ అనేది కేవలం నినాదం కాదు ప్రజల నమ్మకానికి ప్రతీక. మోడీ పాలనను గుర్తించి, ప్రజల ఆశయాలను నెరవేర్చే పార్టీగా బీజేపీని నిలబెట్టే బాధ్యత ప్రతి కార్యకర్తదే అని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిదర్ రెడ్డి రాష్ట్ర నాయకులు దుప్పటి భద్రయ్య బీజేవైఎం రాష్ట్ర కళాశాల విభాగం కన్వీనర్ మంద మహేష్ మండల సీనియర్ నాయకులు సోమ దామోదర్ పున్నమి చందర్ మల్లన్న రాణి మేకల సమ్మయ్యగుండా సంపత్ మండల ఉపాధ్యక్షులుమాదాసు మొగిలి కుక్కముడి రమేష్ బూత్ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్ భూక్య హరిలాల్ దూడపాక సతీష్ రేపాక సంతోష్ దేవనూరు భార్గవ్
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు, 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్, సోషల్ మీడియా ఇంచార్జి మైనార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో, ఉర్సు ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త ఎం.డి ఫకీర్ తండ్రి ఇటీవల మరణించగా, వారి ఇంట్టికి వెళ్లి పరామర్శించి, 50కేజీల బియ్యం అందచేశారు. ఈ కార్యక్రమంలో మంద సతీష్, ఎస్. లింగమూర్తి, పోలేపాక భాస్కర్, అశోక్ గౌడ్, బజ్జురి రవి, బొల్లం సంజీవ, ఎం.డి అఫ్రీన్, కోట యాదగిరి, లక్క సురేందర్, ఎండి షారఫాద్దీన్, మైదం బాలు, గొర్రె చేరాలు, కార్ శ్రీపాల్, వి నరేష్, ఎండి ఆహేమద్ ఖాన్, ఎండి అజర్, మైదం వంశీ, మైదం బన్నీ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.