మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన…

మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన

సాయిచరణ్ గౌడ్

గణేష్ గడ్డ… వినాయక లడ్డూ ప్రసాదంతో హరీశ్ రావును కలిసిన

పఠాన్ చేరు , నేటి ధాత్రి :

 

 

మాజీమంత్రి హరీష్ రావును వారి నివాసంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం వినాయక చవితి నవరాత్రులు ముగిసిన సందర్భంగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గణేష్ గడ్డ దేవాలయం లడ్డూ సొంతం చేసుకున్న సందర్బంగా, బీఆర్‌ఎస్‌ పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ మాజీ మంత్రి, తన్నీరు హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గణపతి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఆదర్శ్‌రెడ్డితో కలసి పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని, అలాగే పార్టీ కార్యక్రమాలకు ఆదర్శ్‌రెడ్డితో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.అని తెలిపారు

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం…

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ యూత్ మండల
కో కోఆర్డినేటర్ రామన్న గూడెం చెందిన యువనాయకుడు భూక్యా రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
వజ్జ సారయ్య మరియు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి తెలిపారు నా ఈ యొక్క ఎన్నిక కు సహకరించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుకు జిల్లా నాయకులకు సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కు
నా ప్రత్యేక కృతజ్ఞతలు..అని
భూక్యా రాజు తెలిపారు

జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు యువత విద్యార్థి లోకం పెద్ద ఎత్తున తరలాలి
బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.

గంగాధర నేటిధాత్రి :

 

 

బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజితోత్సవ సభకు చొప్పదండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థి లోకం తరలివెళ్లాలని బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ వై నియోజకవర్గ ఇన్‌చార్జ్ బంధారపు అజయ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
గురువారం గంగాధరలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, త్వరలో నియోజకవర్గ స్థాయి యువత, విద్యార్థి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ 25 సంవత్సరాల పాటు ప్రజల మద్దతుతో ముందుకు సాగుతూ, దేశ చరిత్రలో విశేషమైన స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు.
“ఒక్కడితో ప్రారంభమైన బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అనేకమంది నాయకులను, కార్యకర్తలను తయారు చేసింది. వందలాది ఎమ్మెల్యేలు, వేలాది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలను అందించిన పార్టీ బిఆర్ఎస్. విద్యార్థులు, యువతకు అవకాశాలు కల్పించిన పార్టీ ఇదే,” అని వారు అన్నారు. సమావేశంలో గంగాధర యువత అధ్యక్షులు సుంకె అనిల్, రామడుగు అధ్యక్షులు ఆరెపల్లి ప్రశాంత్, కొడిమ్యాల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ చొప్పదండి పట్టణ అధ్యక్షులు నరేష్ రావణ్, సముద్రాల ఓంకార్, గంగాధర సంపత్, జక్కుల వెంకటేష్, దుబ్బాసి రఘు, యువత, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన.

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన సోషల్ మండల కోఆర్డినేటర్.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించిన సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం లో భాగంగా కొత్తగూడ మండల నికి అదనంగా యూనిట్లు కేటాయించాలని కోరడం జరిగింది.. అందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారని  తెలిపారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version