కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోయినట్లే అని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ లు అన్నారు. గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ ఏరియాలో ఓటు చోరీ పేరిట కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు.
ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ల పిలుపుమేరకు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఓటు చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రజలను కోరారు. ఓటు చోరీపై బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడిందని దీనిపై రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. బిజెపి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేయాలని చూస్తుందని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటు చోరీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పనాస రాజు, నాయకులు గోపు రాజం, గోపతి భానేష్, భీమ మల్లేశ్, బొద్దుల ప్రేమ సాగర్,రామ్ సాయి, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.
చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ నుండి ఎంపీటీసీ బరిలో పోకల శ్రీలత
బి.ఆర్.యస్ పార్టీకి కట్టుబడి నియమ నిబద్ధతతో ఉంటూ కార్యక్రమంలో ముందంజ పోకల శ్రీలత
గతంలో వార్డు నంబరు గా ఇండిపెండెట్ అభ్యర్ధి అత్యధిక మెజార్టీ తో గెలుపొందారు
గతంలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీలత
కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ నుండి
ఎంపీటీసీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పోకల శ్రీలత బి.ఆర్.యస్ పార్టీకి కట్టుబడి నియమ నిబద్ధతో పార్టీకి కష్టపడి ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ పార్టీ యొక్క ప్రతి కార్యక్రమములో పాల్గొంటూ ముందజంలో ఉన్నారు పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుకుగా తనదైన శైలిలో కార్యకర్తలను పోగుచేయడంలో శ్రీలత కి సాటి లేరు పార్టీ ఇచ్చిన
ఆదేశానుసారం ప్రతి ఒక్క కార్యక్రమములో పాల్గొంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానంసంపాదించుకున్నారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలందరికీ సుపరితురాలు అయ్యరూ,పోయిన ఎన్నికల్లో వార్డు నంబరు గా ఇండిపెండెట్ గా పోటీ చేసి అత్యధిక
మెజార్టీ తో గెలుపొందింది వార్డులో నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలుపరిష్కరించి అందరికీ ఇంటికి ఆడ బిడ్డ అయ్యారు,పోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలవడంలో కీలక పాత్ర పోషించారు వార్డులో అత్యధిక మెజారిటీ
భారతీయ జనతా పార్టీలో చేరికలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి
మహాదేవపూర్ అక్టోబర్ 8 నేటి ధాత్రి *
Vaibhavalaxmi Shopping Mall
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కంకణాల రాజిరెడ్డి మెరుగు లక్ష్మణ్ సారంగపని బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్బంగా చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్స్ దృష్ట్యా బీజేపీ పార్టీలో చేరికలు అవ్వడం శుభపరిణామం అని, భారత ప్రధాని గౌ ‘శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలు, వారి పరిపాలన ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు అవుతున్న కానీ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని, రాబోయే రోజులలో తెలంగాణనలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో మహాదేవపూర్ అన్నీ స్థానాలలో పోటీ చేసి, గెలిచి తిరుతామణి,కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక భారీ మూల్యం చెల్లించుకుంటుందని వారు చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్,కార్యదర్శి సంతోష్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్, చాగర్ల రవీందర్,దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్, రాము, బల్ల శ్రావణ్ కార్యకర్తలు పాల్గొన్నారు,
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు
ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్
కరీంనగర్, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.
రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.
ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.
ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం… బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ళపల్లి
నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా
Vaibhavalaxmi Shopping Mall
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి బాకీ కార్డు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి * మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య*
ప్రజలతో మాట్లాడుతూ…. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.
100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.
రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.
మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.
ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రెస్ మీట్ లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వెల్లడిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టి తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంటను పండించి రైతులను డోకా చేశారు. 317 జీవోను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే. మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది. రైతుబంధు పేరుతో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాల్లకు,ప్రైవేట్ కాలేజీలకు ప్రజా సొమ్మును పంచిపెట్టినది బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది. అమరవీరుల కుటుంబాలను,ఉద్యమకారులను గుర్తించకుండా వారిని మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వమే. పదేళ్ల కాలంలో సర్పంచులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైనది బిఆర్ఎస్ ప్రభుత్వం. మహిళలకు పావలా వడ్డీకే 10 లక్షల రుణం ఇస్తానని ఇవ్వకుండా దూకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పి మోసం చేసింది కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని డోకా చేసింది బిఆర్ఎస్ పార్టీ. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వము. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తానని డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. పది సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగులను డోకా చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం. గ్రూప్.1 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం. పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో హడావిడి చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి ధరణిని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు భూములను అక్రమంగా కాజేసినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
రాయికల్ అక్టోబర్ 6, నేటి ధాత్రి:
రామాజీపేట గ్రామానికిమాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరువతో రామాజీపేట గ్రామానికి చెందిన ఆరెల్లి గాయత్రి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్,20,000 ,గ్రామ కాంగ్రెస్ నాయకులు అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుజ్జులా మోహన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు,నాయకులు రాజేశ్వర్ రావు,నారాయణ,రాములు, సుధీర్ రెడ్డి,రాజు,తిరుపతి, గౌతమ్,జల తదితరులు పాల్గొన్నారు
*అసాంఘిక కార్యకలాపాలకు 22 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం..
*ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న అధికారులు..
పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 06:
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ కొలమాసనపల్లిలో రైతు భరోసా కేంద్రం 2020 సంవత్సరంలో అప్పటి వైసిపి ప్రభుత్వం ఎమ్మెల్యే వెంకటే గౌడ చేతులమీదుగా 22 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణం చేపట్టారు.భవనం మొత్తం పూర్తయినా కానీ ఇప్పటివరకు ఉపయోగంలోకి తేలేదు. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.భవనం కనిపించనంతగా పిచ్చి మొక్కలు పెరిగాయి.ఈ భవనం మందు బాబులకు పేకాటరాయుళ్ల కు నిలయంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ దీనిపై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ విషయంపై పలమనేరు వ్యవసాయ అధికారిని సంధ్యా రాణి ను వివరణ కోరగా రైతు భరోసా కేంద్రం ఇంకా మాకు ఇవ్వలేదని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రైతు భరోసా కేంద్రం ఉపయోగంలోకి తేవాలని కొలమాసనపల్లి పంచాయతీ ప్రజలు కోరుతున్నారు..
న్యాల్ కల్ మండలం వడ్డి గ్రామం లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ మండలం మాజీ అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నుండి పార్టీ మార్పు చేసిన నాయకులపై ఫైర్ అయ్యారు కితకో పార్టీ మార్పు చేస్తున్న నాయకులకు ప్రజలు యూవకులు గమనిస్తున్నారు అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికీ చిత్తూ చిత్తూ గా ఒడిస్తాం అని వారు ఫైర్ అయ్యారు రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు పోటి చేపిస్తాం జడ్పీటీసీ కీ కూడ గెలుపే లక్ష్యంగా అందరు పని చెయ్యాలని ఎవరు ఆ ధైర్యం పడొద్దు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మండలం ప్రధాన కార్యదర్శి రాహుల్ పలింకార్ నర్సప్ప సచిన్ లక్ష్మన్ షేర్ అలీ సంజుకుమార్ రాజు తదితరులు ఉన్నారు,
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అయితే..
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.
బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ.. ప్రజలను ప్లాన్డ్‌గా మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలేనని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.
గత 15 రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిజెపి నాయకుడు కలకుచ్చిగారి రాజీరెడ్డిని బిజెపి రాష్ట్ర నాయకులు రామచంద్రరావు పరామర్శించారు. మనోధైర్యాన్ని కలిగి ఉండాలని ఎల్లవేళలా తోడుంటానని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, మల్లికార్జున గౌడ్,, తూప్రాన్ లక్ష్మణ్, మంద విజయ, వినయ్, కరుణశ్రీ, సుజాత, అనురాధ, ఉష, గణేష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, సాయి సూర్య కాలనీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, రాజేందర్ సాయి సూర్య తదితరులు ఉన్నారు.
గతంలో ఐ డి ఎస్ ఎం టి కాలనీ ఇళ్ల స్థలాలకు మోటేషన్ చేసిన మున్సిపల్ కమిషనర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలి
◆:- పి.రాములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ : జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ పట్టణంలో 1990 లో లోనేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులతోని జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం వారు జహీరాబాద్ పట్టణంలో నివసించే పేద మధ్యతరగతి వారి గురించి మరియు వికలాంగులు వితంతువులు మరియు రిటైర్డ్ మిల్ట్రీ సోల్జర్స్ గురించి జహీరాబాద్ పట్టణంలో నివాస గృహాల కోసం సుమారు 108 ఎకరాల భూమిని సేకరించి అన్ని రకాల ప్రభుత్వా అనుమతులతో ఒక చక్కటి కాలనీ ఏర్పాటు చేసినారు దాని పేరే ఐ డి ఎస్ ఎం టి కాలనీ ఈ కాలనీలో ఇంటి స్థలాలు కొనేవాళ్లకు సులుబ వాయిదాల పద్ధతిన ఇంటి స్థలాలు విక్రయించినారు వాయిదాలు పూర్తిగా చెల్లించిన తర్వాత స్థలాన్ని జహీరాబాద్ పురపాలక సంఘం అధికారులు రిజిస్టర్ చేయించి ఇవ్వాలి కానీ ఈ చర్యకు బదులుగా ప్రజా నాయకులు కాలనీ రూల్స్ కు వారి ఇష్టం వచ్చినట్లు లోపాయి కారు విధానాలతో జహీరాబాద్ పట్టణంలో నివసించే వారికి కాకుండా జహీరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలలో మరియు ఇతర రాష్ట్రాలలో నివాసం ఉండే ప్రజలకు చిన్నపిల్లలకు విక్రయించినారు ఈ కాలనీలో ఇంటి స్థలం కొనాలి అంటే కొన్ని ప్రత్యేక రూల్స్ ఉన్నాయి అవి ఏమిటో చూడండి జహీరాబాద్ పట్టణంలో ఐదు సంవత్సరాల నుండి సొంత ఇల్లు లేకుండా జీవించే పేద మధ్యతరగతి ప్రజలకు వితంతువులకు వికలాంగులకు రిటైర్డ్ మిలటరీ సోల్జర్స్ కు స్వాతంత్ర సమరయోధులకు వీరెవరికైనా కేవలం ఒకటే ప్లాటు విక్రయించాలి కానీ నాయకులు అధికారులు కలిసి ఒక్కొక్కరికి 10 20 30 50 ప్లాట్లను విక్రయించినారు ఈ ఇంటి స్థలాలు పై నిబంధనలకు లోబడి విక్రయించాలి కానీ అప్పటి అధికారులు ప్రజా నాయకులు కలిసి అవగాహనలేమితో అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి దాహంతో అధికారులు నాయకులు కలిసి పై రూల్స్ కు వ్యతిరేకంగా అక్కడ ఇంటి స్థలాలను విక్రయించినారు ఈ రకంగా విక్రయించిన స్థలాలను అప్పటి పురపాలక సంఘం అధికారులు పురపాలక సంఘం రికార్డులలో నమోదు చేసినారు ఈ విషయాలన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా నడుస్తున్నాయని తమ ఇష్టం వచ్చినట్లు నాయకులు అధికారులు బంధు ప్రీతి కులం ప్రీతి అవినీతితో తమ ఇష్టం వచ్చినవారికి ప్లాట్లను విక్రయించి మోటివేషన్ చేసినారు ఈ విషయాలను అన్నిటిని వ్యతిరేకిస్తూ జహీరాబాద్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అమానుల్లా గౌరీ ప్రజా ప్రయోజన కరమైన కేను వేసినారు ఇందుకు స్పందించిన అప్పటి గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఈ కాలనీలో రిజిస్ట్రేషన్లు చేసిన చైర్మన్ లపై క్రిమినల్ కేసులు వేయాలని చెప్పి అప్పటి జిల్లా కలెక్టర్ మరియు జహీరాబాద్ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు అందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు ఈ కాలనీలో రూల్స్ కు వ్యతిరేకంగా ఇండ్ల స్థలాలను విక్రయించిన అప్పటి మున్సిపల్ చైర్మన్లు బండమీది చంద్రయ్య అల్లాడి నర్సింలు మహంకాళి సుభాష్ మురళీకృష్ణ గౌడ్ గార్లపై జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులను రిజిస్టర్ చేయించినారు అదేవిధంగా కేసు నడుస్తుండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ యొక్క కాలనీలో ఎలాంటి నిర్మాణాలు స్థలాల విక్రయాలు మోటిషన్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకూడదని పురపాలక సంఘం కమిషనర్లకు జిల్లా కలెక్టర్లకు ఆదేశించినప్పటికీని కూడా ఈ కాలనీలో ప్రజాధనం దుర్వినియోగపరుస్తూ అనేకరకాల ప్రజా ప్రయోజన కార్యక్రమాలను పురపాలక సంఘం చేపట్టింది గౌరవ ఉన్నత న్యాయస్థానం చిట్టచివర తీర్పులు ఇస్తూ ఈ స్థలాన్ని అంతటిని కూడా జహీరాబాద్ పురపాలక సంఘం స్వాధీన పరుచుకోవాలని తిరిగి స్థలాలను విక్రయించదలుచుకుంటే కొనుగోలుదారుల కోసం బహిరంగ ప్రకటన చేయాలని ఇప్పటి ప్రభుత్వ ధరలతో విక్రయించాలని చివరి తీర్పును గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినది కానీ అధికారులను ఎక్కడ కూడా తప్పు పట్టకపోవడం శోచనీయాంశం బాధాకరం వాస్తవానికి ఈ రూల్స్ కు వ్యతిరేకంగా విక్రయించబడ్డ ఇండ్ల స్థలాలను మోటేషన్ చేసి ఇండ్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదలకుండా వారి విధుల నుండి తప్పించాలని జహీరాబాద్ పట్టణ ప్రజల పక్షాన జాగో తెలంగాణ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ కాలనీలో ఇప్పటికే స్థలాలు కొనుగోలు చేసి సర్వస్వం కోల్పోతున్న వారికి పక్షాన జాగో తెలంగాణ నిలబడి న్యాయబద్ధంగా పోరాటం చేసి రూల్స్ కు తమకు అధికారం లేకున్నా తమే అంతా అంటూ ఇండ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన ప్రజా నాయకుల పై ఇంట్లో స్థలాలు కొనుగోలు చేసిన వారితో తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని రాబర్టుకునుటకు జహీరాబాద్ కోర్టులో రికవరీ సూట్స్ ను ఏపీస్తామని అన్యాయానికి గురైన ప్రజల పక్షాన నిలబడి చట్టపరంగా వీరికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని జాగో తెలంగాణ వ్యవస్థాపకులు పి. రాములు నేత అన్నారు వాస్తవానికి ఈ స్థలంలో గతంలో కూడా కొందరు ప్రైవేట్ వ్యక్తులు మాకు పది ఎకరాలు ఉన్నదని మా 10 ఎకరాల స్థలాన్ని ఖాళీ చేయాలని అక్కడ నివాసం ఉండే వారికి ఇబ్బందులు పెడుతుంటే వారి పక్షాన నిలబడి పోరాడు తున్నందుకు పి.రాములు నేత గారి పైన ఆ స్థలంలోకి వెళ్లకుండా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చినారు ఇందుకు పి. రాములు నేత చట్టాన్ని గౌరవిస్తూ ఆ స్థలంలోకి వెళ్లడం లేదు వాస్తవానికి తనకు కూడా ఆ స్థలంలో ఇంటి స్థలం ఉన్నది తను కూడా తెలవక అప్పటి నాయకుల చేతిలో మోసపోయినారు ఈ కార్యక్రమంలో జాగో తెలంగాణ వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్లదశరథ్ అరవింద్ బాలు పాల్గొన్నారు,
న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశాన్ని నిర్వహించిన
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా ఏ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ అధ్యక్షతన న్యాలకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రి డా||చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంగా ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశగా ఉన్నావారు,పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినవారు మీ మండల అధ్యక్షులు తెలియజేసిన వెంటనే వారు మండలంలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులను పరిశీలించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నా వారి పేర్లను ఇంచార్జ్ డా౹౹చంద్రశేఖర్ ద్వారా జిల్లా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది.మరియు కచ్చితంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను ప్రతి గ్రామంలో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని, నాయకులకు వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి పిఏసిఎస్ ఛైర్మెన్ సిద్దిలింగయ్య ఏ.యం.సి.వైస్ ఛైర్మెన్ తురుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ చంద్రప్ప మాజీ ఎంపీపీ రత్నం కాంగ్రెస్ నాయకులు మాక్సూద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ ఎస్సి సెల్ అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు..
పొన్నం భిక్షపతి గౌడ్ బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థగత ఎన్నికల దృష్ట్యా బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని స్థానాల గ్రామ వార్డు సభ్యులు గ్రామ సర్పంచులు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో బీఎస్పీ ఉంటుందని పొన్నం భిక్షపతి గౌడ్ బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీట్లను కేటాయించి పోటీ చేయబోతున్నామని అగ్రవర్ణాల రాజకీయ కుట్రలను పసిగట్టి వారిని ప్రజల్లో ఎండ కడతామని రాజ్యాధికారం యొPonnam Bhikshapathi Goud
BSP Bhupalpalli District Presidentక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా ఇంటింటికి ప్రచారాన్ని తీసుకెళ్తామని రాష్ట్రంలో 92 శాతం ఉన్న బహుజనులను రాజ్యాధికార పీఠం మీద కూర్చోబెట్టడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారమే అణచివేయబడ్డ బహుజన కులాలకు విముక్తి కలిగిస్తుందని సమాజం యొక్క మార్పు కోరుకునే వారందరూ ఏకతాటిపైకి రావాలని ఎన్నికలలో పోటీ చేయకపోతే మన ఆస్తిత్వాన్ని కోల్పోయి అణచివేతకు గురైతామని కాబట్టి ఈ ఎన్నికలను మన భవిష్యత్తుగా భావించాలని ఈ సందర్భంగా అన్నారు
న్యాల్ కల్ మండలంలోని న్యామతాబాద్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు cశుక్రవారం 31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ శ్రేణులు శరణప్ప, సంగమేష్ లో ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా శ్రేణులు రామ్ చందర్, అబ్రహం సంస్థ ఏర్పాటు, లక్ష్యం, విధివిధానాలపై యువతకు మార్గదర్శనం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ సేవలను గుర్తు చేస్తూ.. వారి మార్గంలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఉల్లాస్, నిర్మల్ కుమార్, శాంత కుమార్ నరసింహారెడ్డి గొల్ల షాంపూ, సుక్కప్ప, రూబెన్, రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.
#కాంగ్రెస్ మోసాలను వెలుగులోకి తేవడమే బిఆర్ఎస్ లక్ష్యం.
#మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి700 రోజులు గడిచిన ఏ ఒక్క హామీ సంపూర్ణంగా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని. రైతులు, కూలీలు,మహిళలు, యువకులు, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. బాకీ కార్డుల ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసగించడంపై ప్రజల సమక్షంలోనే బహిర్గతం చేస్తామని. ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ మోసం వెలుగులోకి తీసుకువచ్చి మండల, గ్రామస్థాయి నాయకులు బాకీ కార్డులను గ్రామాలలో విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బాకీ కార్డులను బ్రహ్మస్త్రంగా వినియోగించుకొని ఎన్నికలకు సన్నద్ధం కావాలని అలాగే గ్రామాలలో రాజకీయ చైతన్యం పెంచి ప్రజలకు నిజాలను తెలియజేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, నాయకులు పోగుల చిరంజీవి, ఇంగ్లీ శివాజీ, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల మోహన్ రెడ్డి, తిరుపతి, చేరాలుగౌడ్, గుండాల కుమారస్వామి, ఊరటి అమరేందర్ రెడ్డి, నూటెంకి సూరయ్య, పోడేటి ప్రకాశం, ఖ్యాతం శ్రీనివాస్, నాగెల్లి ప్రకాష్, శ్రీనివాస్, గుమ్మడి వేణు, వై నాలా మధు, పరికినవీన్, మేడిపల్లి రాజు గౌడ్, మురాల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల పట్ల ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన బాకీల కోసం నిలదీయాలని బిఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ అన్నారు. నర్సంపేట మండంలోని చిన్న గురిజాల గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ పార్టి సమావేశం గ్రామ అధ్యక్షుడు నాగిషెట్టి కొమురయ్య అద్యక్షతన జరిగింది. నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.మండల ఎన్నికల కన్వీనర్ కొమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ప్రజలకు బాకి పడ్డ హామీలను బాకి కార్డుల ద్వారా ప్రచారం చేసి బిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించడం కోసం ప్రతీ కార్యకర్త కృషీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కమిటీ సభ్యులు కడారీ రవి,మోటూరి రవి,బండారి రమేష్,భూక్యా వీరన్న,గురిజాల గ్రామ పార్టి అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్షింగం,మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య,మాజీ సర్పంచ్ గడ్డం రాజు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,పుప్పాల బిమయ్య,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిక హరీష్,పోతు శంకర్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,బొల్లం భక్కయ్య,మాజీ ఉప సర్పంచ్ కంకణాల రాజు,మండల యూత్ సహాయ కార్యదర్శి పుట్ట అఖిల్,సొసైటి డైరెక్టర్ ఎడ్ల రవీందర్,గ్రామ పార్టి కన్వీనర్ చిప్ప ప్రశాంత్, కొమ్ము రవి,మినుముల దేవేందర్,దూడల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో పల్లెల్లో ఎన్నికల సందడినెలకొంది ఆశావాహులు రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి సిద్ధమ వుతున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు పార్టీ లకు అతీతంగా జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను గెలుచు కుని జెడ్పి,ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.
చేసింది చెప్పాలని కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారెంటీలతో రూపొం దించిన పథకంలో భాగంగా రైతు భరోసా,సన్నబియ్యం, బోనస్,మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి,చేయూత ప్రభు త్వం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం చూస్తుంది ఎమ్మెల్యే పార్టీ నేతలకు మార్గదర్శకాలు చేయనున్నారు.
సాధ్యమైనన్ని గెలవాలి భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలవాలని చూస్తుంది పార్టీ పెద్ద నేతలు దిశానిర్దేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు భూపాలపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయా లని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని చూస్తున్నారు.
వైఫల్యాలను ఎండగట్టా లని బీఆర్ఎస్ పార్టీ కసరత్తు
టిఆర్ఎస్ నేతలు అభ్యర్థుల గెలుపునకు ప్రణాళికలు రచిస్తున్నారు మండల గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమయతమవుతున్నారు మండల గ్రామ స్థాయిలో సమస్యలపై ప్రభావం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
శ్రీవెంకటేశ్వర దేవాలయం లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో పేరుతో ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో
మాజీ కౌన్సిలర్ 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉంగ్లంతిరుమల్ నాయుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి పేరుతో ఆలయంలో ప్రత్యేక పూజలు,అర్చన నిర్వహించామని తిరిమల్ చెప్పారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గo అభివృద్ధి చేసిన నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలిగి దేవుడి ఆశిస్సులు ఉండాలని ఆకాంక్షించారు పూజలో సీనియర్ జర్నలిస్ట్ మధుగౌడ్ ,శ్రీను 33వార్డు ప్రజలు ఉన్నారని తెలిపారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.