న్యాల్కల్ లో స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ సమావేశం…

న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశాన్ని నిర్వహించిన

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా ఏ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ అధ్యక్షతన న్యాలకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రి డా||చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంగా ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశగా ఉన్నావారు,పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినవారు మీ మండల అధ్యక్షులు తెలియజేసిన వెంటనే వారు మండలంలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులను పరిశీలించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నా వారి పేర్లను ఇంచార్జ్ డా౹౹చంద్రశేఖర్ ద్వారా జిల్లా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది.మరియు కచ్చితంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను ప్రతి గ్రామంలో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని, నాయకులకు వారు దిశానిర్దేశం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి పిఏసిఎస్ ఛైర్మెన్ సిద్దిలింగయ్య ఏ.యం.సి.వైస్ ఛైర్మెన్ తురుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ చంద్రప్ప మాజీ ఎంపీపీ రత్నం కాంగ్రెస్ నాయకులు మాక్సూద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ ఎస్సి సెల్ అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version