రాంనగర్ కాంగ్రెస్ పార్టీలో రగడ అభ్యర్థి ఎంపికపై వివాదం తీవ్రం
కొత్త వ్యక్తికి ప్రాధాన్యం ఎందుకు? కేడర్‌లో ఉత్కంఠ… ప్రజల్లో అనుమానాలు…
నేటిధాత్రి ఐనవోలు :-
అయినవోలు మండలం రాంనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. గ్రామంలో కష్టపడి పనిచేసిన నాయకులు పక్కనపడిపోగా, కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలని ఉన్నత నాయకత్వం ఆలోచిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్థానిక కేడర్, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పార్టీలోకి కొత్త – మాట నిలకడపై ప్రశ్నలు
అభ్యర్థిగా పరిగణనలో ఉన్న వ్యక్తి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి కావడం ప్రధాన అభ్యంతరంగా మారింది.పార్టీ కోసం కష్టపడిన నాయకులను విస్మరించి, కొత్తగా వచ్చినవారికి అవకాశం ఇస్తారా?” అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాక, మాట నిలకడ లేకపోవడం, గతంలో పలుమార్లు పార్టీల మార్పు చేయడం వంటి ఆరోపణలు కోలాహలం సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యం వల్ల గ్రామ ప్రజల్లో కూడా ఆ అభ్యర్థిపై నమ్మకం లోపిస్తున్నట్లు సమాచారం.అంతేగాకుండా గతంలో కొన్ని సి(ఏ)విల్ వివాద విమర్శలు ఉన్నాయి.ఈ అంశం అభ్యర్థి నమ్మకార్హతపై మరో పెద్ద ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేక ఎంపికా???
పార్టీకి సంవత్సరాలుగా కష్టపడిన నాయకులకే టికెట్ ఇవ్వాలి అనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యే బలంగా చెబుతున్నా, కూడా ప్రజాభిప్రాయం ప్రకారం,స్థానిక నాయకులు కొత్తగా వచ్చిన వ్యక్తి పట్ల విశ్వాసం ఎక్కువ గా చూపడం వాస్తవానికి అభ్యర్థి పట్ల ప్రజల్లో విశ్వాసం తక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశం ఉందని నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యేకు తప్పు సమాచారం చేరిందా అనే అనుమానం
అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కొంతమంది నాయకులు తమకనుకూలంగా సమాచారం అందజేస్తున్నారన్న భావన పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది.
గ్రామ వాస్తవ పరిస్థితులు, ప్రజాభిప్రాయం, కేడర్ కృషి ఈ విశ్లేషణలేవీ స్థానిక ఎమ్మెల్యే నాగరాజు కు వాస్తవ విరుద్ధంగా వెళ్తున్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతర్గత రగడ – ప్రత్యర్థి పార్టీకి లాభమా?
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఈ అంతర్గత తగాదాల వల్ల
బిఆర్ఎస్ కు ప్రత్యక్షంగా లాభం కలగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కేడర్లో విభజన, అసంతృప్తి, అంతర్గత రగడ పై కేడర్ అభిప్రాయం ఏమిటంటే..
గ్రామంలో కట్టుబడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.అభ్యర్థి నమ్మకార్హత, క్రమశిక్షణ, గత అనుభవం వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి
లేకపోతే రాబోయే ఎన్నికల్లో రాంనగర్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలవచ్చని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
