గతంలో ఐ డి ఎస్ ఎం టి కాలనీ ఇళ్ల స్థలాలకు మోటేషన్ చేసిన మున్సిపల్ కమిషనర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలి
◆:- పి.రాములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ : జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ పట్టణంలో 1990 లో లోనేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులతోని జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం వారు జహీరాబాద్ పట్టణంలో నివసించే పేద మధ్యతరగతి వారి గురించి మరియు వికలాంగులు వితంతువులు మరియు రిటైర్డ్ మిల్ట్రీ సోల్జర్స్ గురించి జహీరాబాద్ పట్టణంలో నివాస గృహాల కోసం సుమారు 108 ఎకరాల భూమిని సేకరించి అన్ని రకాల ప్రభుత్వా అనుమతులతో ఒక చక్కటి కాలనీ ఏర్పాటు చేసినారు దాని పేరే ఐ డి ఎస్ ఎం టి కాలనీ ఈ కాలనీలో ఇంటి స్థలాలు కొనేవాళ్లకు సులుబ వాయిదాల పద్ధతిన ఇంటి స్థలాలు విక్రయించినారు వాయిదాలు పూర్తిగా చెల్లించిన తర్వాత స్థలాన్ని జహీరాబాద్ పురపాలక సంఘం అధికారులు రిజిస్టర్ చేయించి ఇవ్వాలి కానీ ఈ చర్యకు బదులుగా ప్రజా నాయకులు కాలనీ రూల్స్ కు వారి ఇష్టం వచ్చినట్లు లోపాయి కారు విధానాలతో జహీరాబాద్ పట్టణంలో నివసించే వారికి కాకుండా జహీరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలలో మరియు ఇతర రాష్ట్రాలలో నివాసం ఉండే ప్రజలకు చిన్నపిల్లలకు విక్రయించినారు ఈ కాలనీలో ఇంటి స్థలం కొనాలి అంటే కొన్ని ప్రత్యేక రూల్స్ ఉన్నాయి అవి ఏమిటో చూడండి జహీరాబాద్ పట్టణంలో ఐదు సంవత్సరాల నుండి సొంత ఇల్లు లేకుండా జీవించే పేద మధ్యతరగతి ప్రజలకు వితంతువులకు వికలాంగులకు రిటైర్డ్ మిలటరీ సోల్జర్స్ కు స్వాతంత్ర సమరయోధులకు వీరెవరికైనా కేవలం ఒకటే ప్లాటు విక్రయించాలి కానీ నాయకులు అధికారులు కలిసి ఒక్కొక్కరికి 10 20 30 50 ప్లాట్లను విక్రయించినారు ఈ ఇంటి స్థలాలు పై నిబంధనలకు లోబడి విక్రయించాలి కానీ అప్పటి అధికారులు ప్రజా నాయకులు కలిసి అవగాహనలేమితో అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి దాహంతో అధికారులు నాయకులు కలిసి పై రూల్స్ కు వ్యతిరేకంగా అక్కడ ఇంటి స్థలాలను విక్రయించినారు ఈ రకంగా విక్రయించిన స్థలాలను అప్పటి పురపాలక సంఘం అధికారులు పురపాలక సంఘం రికార్డులలో నమోదు చేసినారు ఈ విషయాలన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా నడుస్తున్నాయని తమ ఇష్టం వచ్చినట్లు నాయకులు అధికారులు బంధు ప్రీతి కులం ప్రీతి అవినీతితో తమ ఇష్టం వచ్చినవారికి ప్లాట్లను విక్రయించి మోటివేషన్ చేసినారు ఈ విషయాలను అన్నిటిని వ్యతిరేకిస్తూ జహీరాబాద్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అమానుల్లా గౌరీ ప్రజా ప్రయోజన కరమైన కేను వేసినారు ఇందుకు స్పందించిన అప్పటి గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఈ కాలనీలో రిజిస్ట్రేషన్లు చేసిన చైర్మన్ లపై క్రిమినల్ కేసులు వేయాలని చెప్పి అప్పటి జిల్లా కలెక్టర్ మరియు జహీరాబాద్ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు అందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు ఈ కాలనీలో రూల్స్ కు వ్యతిరేకంగా ఇండ్ల స్థలాలను విక్రయించిన అప్పటి మున్సిపల్ చైర్మన్లు బండమీది చంద్రయ్య అల్లాడి నర్సింలు మహంకాళి సుభాష్ మురళీకృష్ణ గౌడ్ గార్లపై జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులను రిజిస్టర్ చేయించినారు అదేవిధంగా కేసు నడుస్తుండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ యొక్క కాలనీలో ఎలాంటి నిర్మాణాలు స్థలాల విక్రయాలు మోటిషన్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకూడదని పురపాలక సంఘం కమిషనర్లకు జిల్లా కలెక్టర్లకు ఆదేశించినప్పటికీని కూడా ఈ కాలనీలో ప్రజాధనం దుర్వినియోగపరుస్తూ అనేకరకాల ప్రజా ప్రయోజన కార్యక్రమాలను పురపాలక సంఘం చేపట్టింది గౌరవ ఉన్నత న్యాయస్థానం చిట్టచివర తీర్పులు ఇస్తూ ఈ స్థలాన్ని అంతటిని కూడా జహీరాబాద్ పురపాలక సంఘం స్వాధీన పరుచుకోవాలని తిరిగి స్థలాలను విక్రయించదలుచుకుంటే కొనుగోలుదారుల కోసం బహిరంగ ప్రకటన చేయాలని ఇప్పటి ప్రభుత్వ ధరలతో విక్రయించాలని చివరి తీర్పును గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినది కానీ అధికారులను ఎక్కడ కూడా తప్పు పట్టకపోవడం శోచనీయాంశం బాధాకరం వాస్తవానికి ఈ రూల్స్ కు వ్యతిరేకంగా విక్రయించబడ్డ ఇండ్ల స్థలాలను మోటేషన్ చేసి ఇండ్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదలకుండా వారి విధుల నుండి తప్పించాలని జహీరాబాద్ పట్టణ ప్రజల పక్షాన జాగో తెలంగాణ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ కాలనీలో ఇప్పటికే స్థలాలు కొనుగోలు చేసి సర్వస్వం కోల్పోతున్న వారికి పక్షాన జాగో తెలంగాణ నిలబడి న్యాయబద్ధంగా పోరాటం చేసి రూల్స్ కు తమకు అధికారం లేకున్నా తమే అంతా అంటూ ఇండ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన ప్రజా నాయకుల పై ఇంట్లో స్థలాలు కొనుగోలు చేసిన వారితో తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని రాబర్టుకునుటకు జహీరాబాద్ కోర్టులో రికవరీ సూట్స్ ను ఏపీస్తామని అన్యాయానికి గురైన ప్రజల పక్షాన నిలబడి చట్టపరంగా వీరికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని జాగో తెలంగాణ వ్యవస్థాపకులు పి. రాములు నేత అన్నారు వాస్తవానికి ఈ స్థలంలో గతంలో కూడా కొందరు ప్రైవేట్ వ్యక్తులు మాకు పది ఎకరాలు ఉన్నదని మా 10 ఎకరాల స్థలాన్ని ఖాళీ చేయాలని అక్కడ నివాసం ఉండే వారికి ఇబ్బందులు పెడుతుంటే వారి పక్షాన నిలబడి పోరాడు తున్నందుకు పి.రాములు నేత గారి పైన ఆ స్థలంలోకి వెళ్లకుండా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చినారు ఇందుకు పి. రాములు నేత చట్టాన్ని గౌరవిస్తూ ఆ స్థలంలోకి వెళ్లడం లేదు వాస్తవానికి తనకు కూడా ఆ స్థలంలో ఇంటి స్థలం ఉన్నది తను కూడా తెలవక అప్పటి నాయకుల చేతిలో మోసపోయినారు ఈ కార్యక్రమంలో జాగో తెలంగాణ వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్లదశరథ్ అరవింద్ బాలు పాల్గొన్నారు,