ఘనంగా సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ సభలు…

ఘనంగా సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ సభలు

గుండాల,నేటిధాత్రి :

సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలో గుండాల,కాచనపల్లి జగ్గుతండ,కొడవటంచ, ముత్తాపురం, మోదుగులగూడెం, నడిమిగూడెం,తూరుబాక, చెట్టుపల్లి,రేగులగూడెం గ్రామాలలో జెండాలు ఎగరవేసి సభలు, సమావేశాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, పూణెం రంగయ్య, బచ్చల సారయ్యలు మాట్లాడుతూ సిపిఐ ,సిపిఎం రిజనిజం, వ్యతిరేకిస్తూ 1969 ఏప్రిల్22 తేదీన లెనిన్ జయంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ పార్టీఆవిర్భవించి పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించింది,
ముఖ్యంగా గోదావరి లోయ పరివాహక ప్రాంతాల్లో దున్నేవానికి భూమి కావాలని నినాదంతో లక్షలాది ఎకరాలు పోడు భూములను కొట్టించి వాటి పట్టాల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాల మెడలు వంచి పట్టాలు సాధించింది అన్నారు.
ఈ పోరాటాలలో భాగంగా బాటన్న, కొండన్న , లింగన్న, మురళి, కాచనపల్లి అమరులు, కోటన్న,నంబూరి సీతారామారావు, నోముల పరశురాములు,సుశేన,చింత లక్ష్మి అనేకమంది తమ విలువైన ప్రాణాలను ప్రజల కోసం రక్తర్పణ చేశారని అన్నారు.వీరి ఆశయ సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు తిప్పికొట్టేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా, మండల నాయకులు అరేం నరేష్,పర్శక రవి, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, పెండకట్ల పెంటన్న,ఇసం కృష్ణన్న,ఈసం మంగన్న, పాయం ఎల్లన్న,మణాల ఉపేందర్,తాటి రమేష్,గోగ్గల శ్రీను,భూఖ్య వెంకన్న, ఈసం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ హామీల అసలు స్వరూపం బహిర్గతం చేస్తాం….

కాంగ్రెస్ హామీల అసలు స్వరూపం బహిర్గతం చేస్తాం.

#బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

#కాంగ్రెస్ మోసాలను వెలుగులోకి తేవడమే బిఆర్ఎస్ లక్ష్యం.

#మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి700 రోజులు గడిచిన ఏ ఒక్క హామీ సంపూర్ణంగా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని. రైతులు, కూలీలు,మహిళలు, యువకులు, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. బాకీ కార్డుల ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసగించడంపై ప్రజల సమక్షంలోనే బహిర్గతం చేస్తామని. ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ మోసం వెలుగులోకి తీసుకువచ్చి మండల, గ్రామస్థాయి నాయకులు బాకీ కార్డులను గ్రామాలలో విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బాకీ కార్డులను బ్రహ్మస్త్రంగా వినియోగించుకొని ఎన్నికలకు సన్నద్ధం కావాలని అలాగే గ్రామాలలో రాజకీయ చైతన్యం పెంచి ప్రజలకు నిజాలను తెలియజేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, నాయకులు పోగుల చిరంజీవి, ఇంగ్లీ శివాజీ, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల మోహన్ రెడ్డి, తిరుపతి, చేరాలుగౌడ్, గుండాల కుమారస్వామి, ఊరటి అమరేందర్ రెడ్డి, నూటెంకి సూరయ్య, పోడేటి ప్రకాశం, ఖ్యాతం శ్రీనివాస్, నాగెల్లి ప్రకాష్, శ్రీనివాస్, గుమ్మడి వేణు, వై నాలా మధు, పరికినవీన్, మేడిపల్లి రాజు గౌడ్, మురాల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version