*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో…..

*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో..

+ఘనంగా 77.వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు..

తిరుపతి(నేటి ధాత్రి:

 

తిరుపతిలోని గాంధీ రోడ్డులో కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చమంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డా. పి.సి. రాయులు మాట్లాడుతూ, కస్తూర్భా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జనవరి 26ను దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలతో మనంగా జరుపుకుంటారని చెప్పారు. దాదాపు 200 సంవత్సరాల బొటిష్ పాలన అనంతరం 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో సంపూర్ణ స్వయంప్రభుత్వం లభించిందని గుర్తు చేశారు.
ఆనాటి నుండి నేటి వరకు భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతర దేశాలతో పోటీపడుతూ ముందుకు సాగుతోందన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కస్తూర్భా గాంధీ ట్రస్ట్ పేదలు, వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని,
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
గాంధీ స్మృతి & దర్శన్ సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్ పేదలు, అవసరమైన వారికి సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ సమితి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుండగా, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చైర్మన్ గా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షులు
చమంతి శ్రీనివాస్, గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. సమానత్వం, న్యాయం. స్వేచ్ఛ. ఆర్థిక స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరి అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, గత నేతలు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా ముందుకెళోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప మేయర్ ఆర్.సి. ముని కృష్ణ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యాలయ సిబ్బంది. బండి మధుసూదన్ రెడ్డి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version