తంగళ్ళపల్లి మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన….

తంగళ్ళపల్లి మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటా 125 రోజుల పని కల్పించాలని లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వి వి జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చిందని అదేవిధంగా తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందని. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత .ఏడాదిన పార్లమెంట్ నియోజకవర్గంలో 32 కోట్ల 13 లక్షల ఖర్చు చేసి రోడ్లను నిర్మించడం మొత్తంగా చూస్తే ఇప్పటివరకు దాదాపు 700 కోట్ల రూపాయలు నిధులను మన పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేశామని. కేంద్రం 2026. 27. కేంద్ర బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన. VB -G.RAM.G. పథకానికి 95,692 కోట్లను కేటాయించిన.మని. గ్రామ అభివృద్ధి శాఖ బడ్జెట్లో ఒక్కొక్క పథకానికి 40 శాతం నిధులు కేటాయించిన.మని మన తెలంగాణ విషయానికి వస్తే ఈ పథకం కింద ₹3,000 కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందని. రాష్ట్రంలో సుమారు 32 లక్షల జాబ్ కార్డ్స్ హోల్డర్స్ ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారని ఏటా 125 రోజుల పాటు పని కల్పించాలని లక్ష్యంతో ఈ పథకాన్ని .తీసుకొచ్చినము. కానీ తెలంగాణలో ఆశించిన విధంగా పరిధిలో కల్పించడంలో విఫలమవుతున్నారని. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలోని ఆశించిన స్థాయిలో పని దినాలు కల్పించలేక.పోతున్నారని ఈ జిల్లాలలో 92000 జాబ్ కార్డులు ఉంటే సగటు 50 రోజుల లోపు మాత్రమే పని కల్పిస్తున్నారని 6000 లోపు కుటుంబాలకు మాత్రమే వందల పని దినాలు కల్పించారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరుతున్నామని. ఈ పథకానికి అయ్యే వ్యయంలో 60 శాతం నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సైతం జాప్యం లేకుండా 40% నిధులను విడుదల చేయాలని కోరుతున్నామని. పంచాయతీలకు మున్సిపాలిటీలకు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదని కానీ నిత్యం కేంద్రంపై .దుమ్మెoతి పోయడం .అలవాటైందని మోడీ ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా కావాల్సినవన్నీ ఎరువులను సరఫరా చేస్తున్న వాటిని అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ పెట్టడం లేదని ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సీఎం రేవంత్.రెడ్డి .లాగులలో తొండలు.విడిస్తా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని. అలాగే దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ధార్మిక చింతనలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది అని ఏ గ్రామం వెళ్లిన ఏ ఆలయం వెళ్లిన సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలతో కల.కలాడుతూ ఉన్నాయని. ముందుగా అంకిరెడ్డిపల్లి గ్రామ. శివారులో గ్రామ సర్పంచ్ బిజెపి సభ్యుల నాయకుల కార్యకర్తల గ్రామ ప్రజల.ఆధ్వర్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కి గజమాలతో .ఘనంగా స్వాగతం పలికారు. అంకిరెడ్డిపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన ఐదు లక్షల తో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే గ్రామ కూడలిలో చత్రపతి శివాజీ మహారాజ్ .క్యాష్య విగ్రహాన్ని. కేంద్రమంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. గ్రామంలోని పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయినీ.గోపి .బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డిపల్లి సర్పంచ్ రాగుల రాజిరెడ్డి. సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ఆడెపు.రవీందర్. తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు .వేన్నమనేని శ్రీధర్ రావు బిజెపి నాయకులు బీజేవైఎం. నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వనపర్తి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తన్న బిజెపి నేతలు…

వనపర్తి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తన్న బిజెపి నేతలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు శ్రీవెంకటేశ్వర దేవాలయం నుండి మార్నింగ్ వాకింగ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు అమలు అబివృద్ది గురించి పట్టణ బిజెపి అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ బచ్చు రాం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ ప్రజలకు తెలుపుతున్నామని తెలిపేరు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని వారుపేర్కొన్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితరేషన్ ప్రధాన మంత్రి ఆవాస్ యువజన ద్వారా నాలుగు కోట్లపైగా ఇళ్ల నిర్మాణం గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జెల్ యోజన ద్వారా నల్ల కనెక్షన్లు సురక్ష బీమా ద్వారా బీమా ముద్ర రుణ సదుపాయం అదేవిధంగా ప్రధానమంత్రి స్వనిది ద్వారా వీధి వ్యాపారులకు పూచికత్తు లేని రుణాలు రైతులకు ఫసల్ బీమా యోజన బీమా క్లైముల పరిష్కారం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు మద్దతు ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి దానికి వార్షిక ఐదు లక్షల ఉచిత వైద్యం పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా 300 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌభాగ్య యోజా న ద్వారా విద్యుద్దీకరణ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ చేశారని వారు ప్రజలకు వివరించారు వార్డు ల పర్యటనలో బిజెపి రాష్ట్ర నేత అయ్యగారి ప్రభాకర్ రెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు డి నారాయణ బచ్చురాం కూన శ్రీకాంత్ పట్టణ బిజెపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని బచ్చు రాం తెలిపారు

“క్రీడలకు ఖేలో ఇండియా బలమైన తోడు”

*క్రీడల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా అమలవుతోంది..

*క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు చేయూతనిస్తోంది..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడి..

*ఖేలో ఇండియా‌ పథకం ముఖ్య ఉద్దేశం, దాని వివరాలను కోరిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు..

*సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ.

చిత్తూరు(నేటి ధాత్రి)

 

క్రీడల అభివృద్ధి కోసం
ఖేలొ ఇండియా పథకం భారతదేశంలో విజయవంతంగా అమలవుతోందనీ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు. ఇది క్రీడలను ప్రోత్సహించడానికి, క్రీడాకారులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడిందని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ సమావేశాలకు
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
హాజరయ్యా
రు,ఆంధ్రప్రదేశ్ ప్రగతితో పాటు,తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు అభివృద్ధికి సంబంధించి, అంశాలను లోక్ సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా కోరారు.
దీనికి భారత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి, లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు సోమవారం మీడియాకు తెలిపారు.
తాజాగా ఖేలో ఇండియా పథకం ముఖ్య ఉద్దేశాన్ని, దేశ వ్యాప్తంగా ఒక రాష్ట్రం ఒక ఆట చొరవ కింద రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందించిందా..అలాగే కోచింగ్, క్రీడా పరికరాలు,సహాయక సిబ్బంది వంటి సాఫ్ట్ కాంపోనెంట్స్ల మంజూరు కోసం విడుదల చేసిన నిధులకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా కోరగా ఇందుకు తక్షణమే స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ,సంబంధిత డేటాను సవివరంగా తెలియపరుస్తూ తనకు అందించినట్లు
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
తెలిపారు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..,
అంతేకాకుండా
ఆ పథకం అమలు వల్ల ఆంధ్రప్రదేశ్ కు, చిత్తూరు పార్లమెంటుకు వనగూడిన ప్రయోజనాలను తెలియాలని కేంద్ర యువజనుల వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖను కోరానని, దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ,ఖేలో ఇండియా పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేయడమే కాకుండా
తాను కోరిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు.
నైపుణ్యమున్న
క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఖేలో ఇండియా బాటలు వేస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కృతజ్ఞతలు తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version