ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజావాణికి 149 దరఖాస్తులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీపృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 149 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఇప్పటివరకు ఆయా శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కారమయ్యాయి? తదితర వివరాలపై ఆరా తీశారు. అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని పెండింగ్ పెట్టవద్దని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. మండలాల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇతర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు పరిశీలించాలని సూచించారు.

రెవెన్యూ కు 58, డీఆర్డీఓ కు 20, హౌసింగ్ కు 14, ఎస్డీసీకి 11, డీపీఓ కు 7, డీఈఓ 6, డీఎంహెచ్ఓ, సెస్ కు ఐదు చొప్పున, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, ఉపాధి కల్పన అధికారికి మూడు చొప్పున, డీసీఎస్ఓ, ఎక్సైజ్ ఆఫీసు కు రెండు చొప్పున, డీసీఓ, ఫారెస్ట్ అధికారి, రిజిస్ట్రార్, డీఎస్సీడీఓ, డీవీహెచ్ఓ, డీ ఎం ఆర్టీసీ సిరిసిల్ల, జిల్లా సంక్షేమ అధికారి, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎల్ డీ ఎం కు ఒకటి చొప్పున వచ్చాయి.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

*దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక..

*దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక..

*వైసీపీ ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప్ర‌శంస‌..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
https://youtu.be/foreloAmve0?si=EykeHX2ZzSIIlHhM

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక పోషిస్తుందని తిరుపతి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి ప్ర‌శంసించారు. తిరుప‌తి ఐఐటీ శాశ్వ‌త క్యాంప‌స్ అభివృద్ధి ప‌నుల్లో భాగంగా రూ.2313 కోట్ల అంచనాలతో ఫేజ్‌-బీ ప‌నుల‌కు శ‌నివారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ విధానంలో భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఈ ప్రాంతానికి గర్వకారణమ‌న్నారు. అలాగే చారిత్రక రోజన్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు యువ‌త ఉజ్వ‌ల భ‌విష్య‌త్ నిర్మాణ‌మ‌న్నారు. ఇందుకోసం సుస్థిరమైన మౌలిక సదుపాయాలను క‌ల్పిస్తూ, విద్యార్థుల ఆవిష్కరణలకు, పరిశోధనలకు కొత్త దారులు తీసుకువస్తున్న ప్రాజెక్టుగా ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఐఐటీ ప‌రిశోధ‌న ఫ‌లితాలు అందుతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన డీఆర్‌డీఏ, టాటా, జేఎస్‌డ‌బ్ల్యూ లాంటి సంస్థ‌ల‌తో తిరుప‌తి ఐఐటీ స‌మ‌న్వ‌యంతో ముందుకెళుతూ పరిశ్రమలకు బలం చేకూర్చి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు.
అదే సమయంలో ఈ ప్రాంతంలోని మామిడి, టమాటా రైతులకు ఉపయోగ‌ప‌డేలా ఆహార ప్రాసెసింగ్ రంగంపై కూడా ఐఐటీ తిరుపతి దృష్టి సారించిందన్నారు. వ్య‌వ‌సాయ రంగానికి కూడా త‌న ప‌రిశోధన ఫ‌లాల్ని అందిస్తోంద‌ని ఆయ‌న కొనియాడారు. దీని ద్వారా రైతులకు సాంకేతికత, ఆవిష్కరణలు, వృద్ధి అందుబాటులోకి వస్తాయన్నారురెండో దశలో సుమారు 2,500 మంది విద్యార్థులకు సేవలందించనున్న ఈ సంస్థ యువతకు, ప్రాంత అభివృద్ధికి గొప్ప తోడ్పాటు అందిస్తోంద‌న్నారు.
ఈ ప్రాజెక్టును ఆమోదించి తిరుపతికి కేటాయించినందుకు గాను ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి నిజమైన దూరదృష్టి గల నాయకుడైన ఆయన ఎప్పుడైనా తిరుపతి అభివృద్ధి కోసం కోరినప్పుడు అపారమైన సహకారం అందిస్తున్నారని ఆయ‌న కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామ‌ని ఎంపీ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు.
ప్ర‌ధాని చొర‌వ‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డంతో విద్యార్థులు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. దేశాన్ని ముందుకు న‌డ‌పడంలో ఐఐటీ నుంచి వ‌చ్చే యువ‌త కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆయ‌న కొనియాడారు. మ‌రీ ముఖ్యంగా త‌న సొంత మండలంలో ఉన్న ఐఐటీకి అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పించిన ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాల‌న్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ఐఐటీ మొదటి ఫెజ్ నిర్మాణానికి ఎంతో తోడ్పాటు అందించార‌న్నారు. దేశం ప్ర‌గ‌తి ప‌థంలో ముందుకెళ్ల‌డానికి ప్ర‌త్యేక భూమిక తిరుప‌తి ఐఐటీ పోషిస్తోంద‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మంలో తాను పాల్గొన‌డం సంతోషంగా, గ‌ర్వంగా వుంద‌న్నారు.

అటవీ ఉత్పత్తులను దగ్గరలోని డిఆర్డిపోలో అమ్ముకోవాలి.

అటవీ ఉత్పత్తులను దగ్గరలోని డిఆర్డిపోలో అమ్ముకోవాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

అటవీ ఉత్పత్తులను జిసిసి కొనుగోలు కేంద్రంలోనే కాకుండా దగ్గర్లోని డిఆర్ డిపోలో కూడా అమ్ముకునే సౌకర్యం కల్పించినట్లు జిసిసి మేనేజర్ నరసింహ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులను మధ్య దళారులకు అమ్మి మోసపోకూడదని సూచించారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కిలో ముష్టి గింజలు 75,కుంకుళ్ళు 40,ఇప్ప పూలు 30,ఇప్ప పలుకు 29,కరక్కాయ 15,కానుగ కాయ 10 రూపాయలు,కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున గ్రామాలలోని ఉత్పత్తుల సేకరణ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.మంగళవారం సేల్స్ మెన్ శ్రీనివాస్ కు గుండాల డి ఆర్ డిపోను అప్పగించినట్లు చెప్పారు. గతంలో పనిచేసిన పగడయ్యను బదిలీపై పంపించినట్లు చెప్పారు.కార్యక్రమంలో అకౌంటెంట్ బూసేయ్య, జిసిసి సేల్స్ మెన్లు పూనం లక్ష్మయ్య, గలిగ చెన్నయ్య, అంబటి శ్రీనివాస్, మోల్కం పగడయ్య, గుండాల, అల్లపల్లి రెండు మండలాల సేల్స్ మెన్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version