ఎగసిన యువ కెరటం.. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ సూపర్ షో..
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది . పోటీ చేసిన 5 స్థానాల్లోనూ గెలిచింది. అంత విజయం సాధించినప్పటికీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ 20 స్థానాలకు మించి ఎల్‌జేపీకి ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో చిరాగ్.. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీతో చర్చలు ప్రారంభించారు. చివరకు ఎన్డీయే పక్షాలు దిగి వచ్చి చిరాగ్ పార్టీకి 29 స్థానాలు కేటాయించాయి. ఎన్డీయే ప్రభుత్వంలో చిరాగ్ పాశ్వాన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
