సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి పునాది…

సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు

మూడుచింతలపల్లి, అలియాబాద్ మునిసిపల్ లో ఎన్నికల ప్రచారం, రోడ్ షో

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి పునాదిగా నిలుస్తాయని, మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి – అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన, ఎమ్మెల్సీ చీఫ్ విప్ పత్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ లతో కలిసి బుధవారం పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వంగా రెండు సంవత్సరాల వ్యవధిలో అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్నికల హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ముఖ్యమంత్రి సహాయ నిధి, గృహజ్యోతి పథకం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయన్నారు. మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం అందించాలని ఆయన కోరారు.

అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మహేందర్ రెడ్డి లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని మూడు చింతలపల్లి, అలియా బాద్, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రత్నాల శ్రావణి మహేష్, బసవరెడ్డి ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నారాయణపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పరి రాంచంద్రయ్య, జిలకరి మహిపాల్ ఎస్సి కమిటీ అధ్యక్షుడు, జీలకర్ర బన్నీ, మల్లికార్జున్, జీవన్, రఘుపతి, ఉప్పరి నర్సిములు తదితరులు పార్టీ లో చేరగా కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నర్సింహా యాదవ్, జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, అలియాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తుంకి రమేష్, మేడ్చల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తాం…

అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తాం

14వ వార్డు అభ్యర్థి ఉమాదేవి రఘుపతి గౌడ్

పరకాల,నేటిధాత్రి

బుధవారం రోజున పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ వార్డులో ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన కాలంలో వార్డులో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ,మరోసారి అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు,మహిళా నాయకురాల్లు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

బారాస కౌన్సిలర్ అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకుల బెదిరింపు

బారాస కౌన్సిలర్ అభ్యర్థిని విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బెదిరింపు…

బారాస నాయకులు రాజా రమేష్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డ్ బారాస కౌన్సిలర్ అభ్యర్థి గండమాల కృపానందం (గ్యాస్ నాని) ని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి,బలవంతంగా విత్ డ్రా చేసుకోవాలని భయభ్రాంతులకు గురిచేసి మున్సిపాలిటీ కార్యాలయంలోని ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా సమయం అయిపోయిన గంట తర్వాత తీసుకుని రావడంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారులు సమయం దాటి పోయిందని అనుమతించలేదు. ఆ అభ్యర్థి కంట నీరు పెడుతూ గజగజ వనికి పోతుండగా గమనించిన బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ నాయకులు రాజా రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సిపిఐ జిల్లా అధ్యక్షుడు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్, ఇరు పార్టీల నాయకులు అభ్యర్థిని ఏం జరిగిందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ను మా పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థిని బెదిరించి ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా చేసుకోవాలని తీసుకురావడం ఏంటని నిలదీశారు. అప్పటికే అభ్యర్థిని దబాయిస్తూ నిన్ను మేము బెదిరించామా అంటూ అభ్యర్థిని గద్దించాడు.అభ్యర్థి గ్యాస్ నాని వనికిపోతూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు. బారాస నాయకులు, అధికార పార్టీ నాయకులను అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసి తీసుకురావడం ఏంటని ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న స్థానిక ఎస్సై జె శ్రీధర్ గొడవ జరిగేలా ఉందని గమనించి అందర్ని కార్యాలయం బయటికి పంపించి వేశారు.

29వ వార్డులో పుల్ల మహేష్‌కు మద్దతుగా ఎమ్మెల్యే గండ్ర

29 వార్డులో పుల్ల మహేష్ ను గెలిపించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేషు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29వ వార్డు స్థానిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి ఇతర వార్డులో వాళ్లు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కావున స్థానికుడు పుల్ల మహేషు కావున ప్రజలందరూ మహేష్ చెయ్యి గుర్తుపై ఓటు వేయాలని ఓటర్ మహాశీలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

ప్రచారంలో దూసుకుపోతున్న తుమ్మలపల్లి లీల సంజీవులు

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఇంటింటికి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు మరియు ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మలపల్లి లీల సంజీవులు గారిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని అన్నారు వార్డు అభ్యర్థి తుమ్మనపల్లి లీల సంజీవులు మాట్లాడుతూ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లింగంపల్లి శ్రీనివాస్, సార్ల లింగం ముదిరాజ్, బొచ్చు ఎల్లయ్య యాదవ్, ఏర్పుల రాజు, ఉప్పల వంశీ కృష్ణ, ఈగ కనకరాజు, రుద్రారం దుర్గయ్య, చింతల రమేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బీర్తీ కమల మధునయ్య కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్తీ కమలను మధునయ్య 17వ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కావున వార్డు ప్రజలు అందరూ ఆలోచించి బీర్తీ కమల చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి వార్డు అభివృద్ధికి అందరూ సహకరించండి అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 17వార్డు ఇన్చార్జి టౌన్ యూత్ అధ్యక్షుడు పృథ్విరాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు…

మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు – రిటర్నింగ్ అధికారులకు బి–ఫారంలు అందజేత

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అభ్యర్థులతో కలసి అధికారికంగా బి–ఫారంలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన ఉందని, అభివృద్ధి – సంక్షేమమే తమ లక్ష్యమని తెలిపారు. పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నరసింహులు యాదవ్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ తోటకూర అజయ్ యాదవ్, అమర్ సింగ్, మాజీవైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

దాట్ల విజయ శ్రీనివాసుని గెలిపించండి…

దాట్ల విజయ శ్రీనివాసుని గెలిపించండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 16 వ వార్డు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల విజయ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల విజయ శ్రీనివాసుకు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలరు అని వారు అన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

23 నామినేషన్ల ఉపసంహరణ…

23 నామినేషన్ల ఉపసంహరణ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

ఎల్లంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ మొదటిరోజు అయిన సోమవారం 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో బిఆర్ఎస్ కు చెందిన ఏడు మంది, కాంగ్రెస్కు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒకరి తో పాటు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆలియా బాద్ లో బిఆర్ ఎస్ కు చెందిన ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలో పదిమంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అందులో బిజెపికి చెందిన ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన నలుగురు, బిఆర్ఎస్ కు చెందిన ఒకరు, ఒకటి జనసేన ఒకరు జనకు జనసేనకు చెందిన ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలి ఎమ్మెల్యే జిఎస్ఆర్…

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలి ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో సీపీఐ, సీపీఐ(యం)పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19, 30 వార్డులు ఎల్బీ నగర్, రెడ్డి కాలనీ, బానోత్ వీధి, సత్తార్ నగర్ కాలనీలల్లో సీపీఐ , సీపీఐ(యం)పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు మరియు ఆయా వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అందుకు కాంగ్రెస్ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతి ఇంటి గడపను తట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తోందని తెలిపారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి ఇప్పటికే చేపట్టిన పలు కార్యక్రమాలను కొనసాగిస్తూ, మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అత్యంత అవసరమని అన్నారు. ప్రజలకు మెరుగైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, పేదల సంక్షేమం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసినట్లయితే భూపాలపల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పదేళ్లు పాలించిన వాళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటీలకు సరైన నిధులు కేటాయించకపోవడం, అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. ఎన్నికలు వస్తే హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని గాలికి వదిలేయడం బీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని పార్టీకి ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపాలిటీలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు బీఆర్‌ఎస్ మోసపూరిత రాజకీయాలను గుర్తించి, అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ బద్దెనపల్లి ఇందిరమ్మ .కాలనీలొకాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లిశ్యామ్.గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగ్ మేము చేయలేదు అని చెప్పిన కేసీఆర్ కు తన కూతురు కల్వకుంట్ల కవిత గారే స్వయంగా ముఖ్య సాక్షిగా నా ఫోను నా భర్త ఫోన్ టాప్ చేసింది మా నాన్న మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పడం. గత ప్రభుత్వంలో ఇలాంటి అధికారులు ఎన్నో అక్రమాలు చేసిన వారిని వదల వద్దని. గతంలో ప్రభుత్వ పరిపాలన చేస్తూ టాపింగ్ చేస్తూ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని. గత ప్రభుత్వం అనేది అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని అవినీతి అక్రమాలు ప్రజలకు. తెలవాలని. ఇలా తెలంగాణ పేరు చెప్పి ఎన్ని అక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువు దోపిడీ చేశారని దీనిపై సిట్ అధికారులు గత ప్రభుత్వంలొ జరిగినటువంటి అక్రమాలను ప్రజలకు తెలియజేసేలా సీట్ విచారణ చేస్తున్నారని. ఇలాంటి అవినీతి వెలికి తీయాలని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అన్ని విషయాలు బయటకు రావాలని మన సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మన ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన ప్రభుత్వంలో పెద్దల ఇతర మంత్రుల సహాయంతో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి నిరసిస్తూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పరిపాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఓర్వలేక అనేక అబండాలు వేస్తూ. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా. ఇలా. ఇలా చేస్తే వ్యతిరేకత రాదు అనే ఉద్దేశంతో చేస్తున్నారని. ప్రజాక్షేత్రంలో తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని. ఎలాంటి తప్పు చేయని మీకు భయం ఎందుకని సిట్ విచారణ చేస్తే తప్పేము ఉంటుందని దానికి సహకరించాలి తప్ప ఇలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఇకనైనా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వాటి సభ్యులు. వడ్డేపల్లి రామా. ముందాటి శారద. భరత్. కాంగ్రెస్ నాయకులు. శ్రీరామ్. నరేష్. లక్ష్మిపతి. రంగయ్య. సుదర్శన్. రాజు. శ్రీనివాస్. రమేష్. కిషన్. గురునాథ్. రవి. రామచంద్రం. రాజు. కిరణ్. శ్రీనివాస్. లక్ష్మణ్. మహిళ నాయకులు. యమునా. భాగ్యలక్ష్మి. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు

ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్…

ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్
33 వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని గెలిపించాలి
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవి భర్త ఎస్ ఎల్ ఎన్ మిడిదొడ్డి రమేష్ నేత నరహరి నరేష్ ప్రజలను కోరారు 33 వ వార్డు ఎన్నికల ప్రచారంలో బాగంగా శ్రీ బాలాజీ వాకింగ్ టీం సభ్యుల ను ఆర్యవైశ్యులను కలిశారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆశీస్సులతో 33 వ వార్డు ను అభివృద్ధి చేస్తామని చేసేది చాలా ఉన్నదని అభివృద్ధి చేసి చూపిస్తామని మాధవి రమేష్ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు రేషన్ కార్డ్ లు లేని పేద ప్రజలకు ఇప్పి స్తామని హామీ ఇచ్చారు వార్డు లో హైమాట్స్ లైట్స్ నూతన డ్రైనేజీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయిస్తామని 33 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్య మహిళాకు వచ్చే అవకాశం ఉన్నదని మాధవి ప్రజలకు వివరించారు ఈమేరకు వనపర్తి 33 వ వార్డు ప్రజలు కౌన్సిలర్ గా గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ కోరారు ఎన్నో సంవత్సరాలకు మహిళ జనరల్ కు 33 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం వచ్చిందని వారు పేర్కొన్నారు ఆర్యవైశ్య చిరు వ్యాపారులకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత దృష్టికి తీసుకువెళ్లి రాజీవ్ యువశక్తి ద్వారా రుణాలు ఇప్పించుటకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ గతంలో కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాతకు ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవి అప్పగించారని మాధవి గుర్తు చేశారు ఈ మేరకు వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వ్యాపారి నరహరి నరేష్ వనపర్తి శ్రీ బాలాజీ వాకింగ్ టీం అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు పోలిశెట్టి మురళి గోకారం కృష్ణమూర్తి రాజు చిదిరే రాజు కందికొండ సాయిరాం సి వి రామన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ లగిశెట్టి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ కుటుంబ సభ్యులను తిరుమ లయ్య గుట్టకు తిరుమల లేషుని దర్శనానికి రావాలని వాకిoగ్ టీము సభ్యులు కలకొండ శ్రీనివాసులు గోకారం రాజు పొలిశెట్టి మురళీ కాంగ్రెస్ నేత నరహరి నరహరి నరేష్ ఆహ్వానిoచారు ఈమేరకు 33 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి విజయం సాధించుటకు కృషి చేస్తామని సంపూర్ణ మద్దతు ఇస్తామని అవొప బాలాజీ వాకింగ్ టీము సబ్యలు ఎస్ ఎల్ ఎన్ రమేష్ కు హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య లు బచ్చురాం మోహన్ కోలాటము శిక్షణ పొందే వారు తదితరులు పాల్గొన్నారు

డ్రైనేజీ సమస్య పరిష్కరం మురికి కాలువ నిర్మాణం…

డ్రైనేజీ సమస్య పరిష్కరం మురికి కాలువ నిర్మాణం

◆-: నేతాజీ నగర్ కాలనిలో సమూలమైన అభివృద్ధి : కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ గౌస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: ఫయాజ్ నగర్ వార్డు అభివృద్ధి కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా చంద్రశేఖర్ సహకారంతో వార్డును సమూలంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే రోజుల్లో ఇంచార్జ్ సహకారంతో పట్టణంలోనే ఆదర్శంగా కాలనీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామాని ఫయాజ్ నగర్ కాలనీ 21 వ వార్డు అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ అన్నారు. ఆదివారం నాడు పట్టణంలోని నేతాజీ నగర్ కాలనిలో డ్రైనేజీ సమస్య పరిష్కరం కోసం కాంగ్రెస్ వార్డు అధ్యక్షుడు గౌస్ కలనివాసులతో కలిసి టెంకాయ కొట్టి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాలనీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే డా చంద్రశేఖర్ సహకారంతో అభివృద్ధి పనులు చేసి కాలనిలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మొహమ్మద్ నబి, మొహమ్మద్ ఆర్షద్, మొహమ్మద్ ఇర్ఫాన్, మొహమ్మద్ గౌస్, అజిం, యూసుఫ్, మహేతబ్ తదితరులు పాల్గొన్నారు.

5.6వార్డులలో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్…

5.6వార్డులలో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5, 6 వార్డులలో ఎన్నికల ప్రచారంని నిర్వహించిన ఎమ్మెల్యే జిఎస్సార్ అనంతరం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 5, 6 వార్డులకు సంబంధించిన వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఇంతర ముఖ్య నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి, వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉడుత సరోజన రాయమల్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ ఉడుత మహేందర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు

4వ వార్డు అభివృద్ధే లక్ష్యం: కాంగ్రెస్ అభ్యర్థి సవిత్రమ్మ

వార్డును సమూలంగా అభివృద్ధి చేస్తాం : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సవిత్రమ్మ

◆-: 4 వ వార్డు రాంజోల్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్: 4 వ వార్డును సమూలంగా అభివృద్ధి చేసి, పట్టణంలోనే ఆదర్శ వార్డుగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అందరూ సైనికుల్లా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెట్టాలని మాజి ఎంపిటిసి అల్గోల్ సవిత్రమ్మ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సవిత్రమ్మ పట్టణంలోని 4 వ వార్డు నుంచి తన నామినేషన్ ఫారం ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రవి కుమార్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటలను అమలు చేస్తూ ఇప్పటివరకు ఒక్క హామీని విస్మరించలేదని, మంత్రి దామోదర్ రాజనర్సింహ, స్థానిక ఎంపీ సురేశ్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ల కృషితో 4 వ వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామాని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మవుర్ మల్లన్న, అల్గోల్ మల్లన్న, చౌల సంజీవ్ రెడ్డి, పిట్టల రవీందర్, మునిపల్లి రచన్న, మవుర్ వెంకట్, శ్రీశైలం, నర్సింలు, ఉమాకాంత్, సిద్దు, చంద్రకళ, భాగ్యమ్మ, శ్రావణి, అనుషమ్మ, రాధిక, హరిణి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

కరకగూడెంలో ఘనంగా మహాత్మా గాంధీ 78వ వర్ధంతి

ఘనంగా మహాత్మా గాంధీ గ 78వ వర్ధంతి.

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.,నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామంలో జాతి పిత మహాత్మా గాంధీ గారీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీ స్మారక కరకగూడెం మేనేజర్ నాగ బండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేనమరియు సర్పంచ్ పోలేబోయిన సుజాత.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
అహింసా అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రధాత జాతిపిత మహాత్మా గాంధీ , ఆయన చూపిన శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీజీ అని కొనియాడారు.
భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీని విడదీసి చూడలేం, అలాంటి మహాత్ముడి జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు..
ఈ కార్యక్రమంలో
గ్రామ పెద్దలు కొంపెల్లి రామలింగం గారు, చిట్టి ప్రసాద్ , గొగ్గలి రవి , షేక్ రఫీ , తిప్పని శ్రీను , ప్రజా ప్రతినిదులు, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు…

గాంధీ జయంతి సందర్భంగా బుచ్చిరెడ్డి నివాళులు

ఘనంగా జాతిపిత మహా త్మాగాంధీ వర్ధంతి

మహాత్మా గాంధీ సిద్ధాంతా లు, ఆశయాలు ఎప్పటికీ ఆదర్శం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట, నేటిధాత్రి:

జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి బుచ్చిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లా డుతూ అహింసా విధానంతో కోట్ల మంది దేశప్రజలను ఒక్క తాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడని గుర్తు చేశారు. గాంధీజీ బోధన లైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని, స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో నాయకులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, దుబాసి కృష్ణ మూర్తి, నిమ్మల రమేష్, మస్కే కుమా రస్వామి, మారపెల్లి వర ద రాజు, డీటీరెడ్డి, మార్కండే య, రఫీ, దామరకొండ కొము రయ్య, సుదర్శన్, కుమార స్వామి పాల్గొన్నారు.

మేడ్చల్‌లో కనిపించని కాంగ్రెస్ నేతలు… కార్యకర్తల్లో కలవరం

కనిపించని కాంగ్రెస్ నేతలు
* మూడు చింతలపల్లి లో మూతపడ్డ పార్టీ కార్యాలయం
* మధ్యాహ్నం 12 గంటలైన తెరుచుకొని కార్యాలయం

* కాంగ్రెస్ లో బీఫారం తలనొప్పి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు కాలమేనా. కనిపించని నేతలు, మూతపడ్డ కార్యాలయం కార్యకర్తలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది. ముఖ్య నేతలు దూరం ఉండడానికి కారణమేమిటి. ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్కరోజు సమావేశానికి పరిమితం కావడం అనేక సందేహాలకు ఆస్కారమిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలను కలవర పెడుతుంది. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతమైన మేడ్చల్ నియోజకవర్గం లో మూడు చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ముఖ్య నేతలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సన్నాక సమావేశం పేరుతో జిల్లా ఇంచార్జి కోమటిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్, ఇంచార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్, మాజీ డీసీసీ హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక రోజు మాత్రమే కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తున్న తరుణంలో ముఖ్య నేతలు కనుమరుగవడం, నామినేషన్ చివరి రోజు మధ్యాహ్నం 12 గంటలైన పార్టీ కార్యాలయం మూతపడడం అభ్యర్థులతో పాటు కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేసింది.

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్..

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్

 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు.

హైదరాబాద్, జనవరి 30: పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) విచారణ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) విచారణ చేపట్టారు. దానంపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దానం తరఫున న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
దానంపై పిటిషన్ ఎందుకు వేశారు?.. పార్టీ మారారని చెప్పేందుకు గల ఆధారాలపై పాడి కౌశిక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అందజేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి దానం పోటీ చేసి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, దానం ప్రచార ఫొటోలు, వీడియోలు.. దానం కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలను స్పీకర్‌ ముందు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో స్పీకర్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది.

సమయం ఇవ్వండి: మహేశ్వర్ రెడ్డి

ఇక, దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు.. స్పీకర్ ముందు హాజరయ్యారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు ఎవిడెన్స్ అఫిడవిట్‌ను పొందుపరిచానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటే సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇస్తే తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్‌లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీజేపీ పిటిషన్‌పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారించనున్నారు.ఇక, పార్టీ ఫిరాయింపుల కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా.. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి అయ్యింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉండగా… నేడు దానంను స్పీకర్ విచారిస్తున్నారు. దానం చెప్పే విషయాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ సమయంలోనూ ఇదే జరిగింది. విచారణ సమయంలో ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రశ్నించగా.. వారంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు.

ఇక దానం నాగేందర్ కూడా మొన్నటి వరకు తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, అవసరమైతే ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే గత రెండ్రోజులుగా దానం యూటర్న్ తీసుకున్న పరిస్థితి. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేస్తే.. ఉప ఎన్నికకు సిద్ధమని దానం పదేపదే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా అవతరించిన అనంతరం రెండో సారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి మిత్ర పక్షంగా మెలిగి గెలుపుకు సహకరించామని,సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో స్నేహబంధమే కోరుకుంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ తో పాటు కలిసి పనిచేసేందుకు ఇష్టపడని నేపథ్యంలో సిపిఐ పార్టీ మునిసిపాలిటీలోని 22 వార్డులలో కౌన్సిలర్లు గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని అన్నారు..

CPI Fields Candidates in 22 Wards of Kattanpalli Municipality.

మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే కలిసివచ్చే సెక్యులర్ పార్టీలతో సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వార్డులలో నామినేషన్ వేస్తామని తెలిపారు. సిపిఐ కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, ఈరవేన రవీందర్, రాజేశం ,మనమ్మ, లక్ష్మణ్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version