కనిపించని కాంగ్రెస్ నేతలు
* మూడు చింతలపల్లి లో మూతపడ్డ పార్టీ కార్యాలయం
* మధ్యాహ్నం 12 గంటలైన తెరుచుకొని కార్యాలయం
* కాంగ్రెస్ లో బీఫారం తలనొప్పి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు కాలమేనా. కనిపించని నేతలు, మూతపడ్డ కార్యాలయం కార్యకర్తలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది. ముఖ్య నేతలు దూరం ఉండడానికి కారణమేమిటి. ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్కరోజు సమావేశానికి పరిమితం కావడం అనేక సందేహాలకు ఆస్కారమిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలను కలవర పెడుతుంది. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతమైన మేడ్చల్ నియోజకవర్గం లో మూడు చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ముఖ్య నేతలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సన్నాక సమావేశం పేరుతో జిల్లా ఇంచార్జి కోమటిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్, ఇంచార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్, మాజీ డీసీసీ హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక రోజు మాత్రమే కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తున్న తరుణంలో ముఖ్య నేతలు కనుమరుగవడం, నామినేషన్ చివరి రోజు మధ్యాహ్నం 12 గంటలైన పార్టీ కార్యాలయం మూతపడడం అభ్యర్థులతో పాటు కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేసింది.
