అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తాం…

అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తాం

14వ వార్డు అభ్యర్థి ఉమాదేవి రఘుపతి గౌడ్

పరకాల,నేటిధాత్రి

బుధవారం రోజున పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ వార్డులో ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన కాలంలో వార్డులో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ,మరోసారి అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు,మహిళా నాయకురాల్లు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తా…

ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తా

14వ వార్డ్ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి భూస శిరీషరాజు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి కోసం సేవకుడిగా పనిచేస్తానని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ అభ్యర్థి భూస శిరీష-రాజు అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వచ్చే నాయకులను నమ్మవద్దని కోరారు. అలాగే ,ప్రజా సమస్యలు తీర్చేవారికి అండగా ఉండాలని వేడుకున్నారు.తనకు డబ్బుల మీద ఆసక్తి లేదని, ప్రజలకు సేవ చేయాలనేదే తన అభిమతమన్నారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవకుడిగా పని చేస్తానని ఈ సందర్భంగా వార్డు ప్రజలను కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version