పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్..

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్

 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు.

హైదరాబాద్, జనవరి 30: పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) విచారణ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) విచారణ చేపట్టారు. దానంపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దానం తరఫున న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
దానంపై పిటిషన్ ఎందుకు వేశారు?.. పార్టీ మారారని చెప్పేందుకు గల ఆధారాలపై పాడి కౌశిక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అందజేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి దానం పోటీ చేసి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, దానం ప్రచార ఫొటోలు, వీడియోలు.. దానం కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలను స్పీకర్‌ ముందు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో స్పీకర్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది.

సమయం ఇవ్వండి: మహేశ్వర్ రెడ్డి

ఇక, దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు.. స్పీకర్ ముందు హాజరయ్యారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు ఎవిడెన్స్ అఫిడవిట్‌ను పొందుపరిచానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటే సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇస్తే తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్‌లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీజేపీ పిటిషన్‌పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారించనున్నారు.ఇక, పార్టీ ఫిరాయింపుల కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా.. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి అయ్యింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉండగా… నేడు దానంను స్పీకర్ విచారిస్తున్నారు. దానం చెప్పే విషయాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ సమయంలోనూ ఇదే జరిగింది. విచారణ సమయంలో ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రశ్నించగా.. వారంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు.

ఇక దానం నాగేందర్ కూడా మొన్నటి వరకు తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, అవసరమైతే ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే గత రెండ్రోజులుగా దానం యూటర్న్ తీసుకున్న పరిస్థితి. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేస్తే.. ఉప ఎన్నికకు సిద్ధమని దానం పదేపదే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు

 

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది.

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. ఈనెల 6 నుంచి ఈ కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. 6వ తేదీన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లను విచారించనున్నారు. 13న కామారెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కేసు విచారించనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి బీఆర్ఎస్‌కు సానుకూల తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version