శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం…

శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

సుభాష్ కాలనీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో
ధర్మ ప్రచారంలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం రాష్ట్రంలోనే మొట్టమొదట భూపాలపల్లి పట్టణం సుభాష్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి హాజరై, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… సనాతన ధర్మపరిరక్షణకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ధర్మ ప్రచారం ద్వారా సమాజంలో నైతిక విలువలు, శాంతి ఐక్యత పెంపొందుతాయని ఎమ్మెల్యే అన్నారు. దివ్య కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

 పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్..

 పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే

 

బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు.

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో పలువురు బూత్ లెవల్ అధికారుల (BLOs) మరణాలకు బీజేపీని కాంగ్రెస్ తప్పుపట్టింది. పని ఒత్తిళ్ల కారణంగా బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. హడావిడిగా ఎస్ఐఆర్ అమలు చేయాలనుకోవడం గతంలో పెద్దనోట్ల రద్దు, కోవిడ్ 19 లాక్‌డౌన్ పరిస్థితిని గుర్తుచేస్తోందని విమర్శించింది.
బీజేపీ ‘ఓట్ చోరీ’ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు. తీవ్రమైన పని ఒత్తిళ్లతోనే బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

‘ప్రాణాలు కోల్పోయిన అధికారుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. క్షేత్ర స్థాయిలో అందుతున్న సమాచారం బట్టి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఇది చాలా బాధాకరం. ఈ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు?’ అని ఖర్గే ప్రశ్నించారు. అధికారాన్ని తస్కరించిన ఆనందంలో బీజేపీ ఉంటే, ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా చూస్తోందని ఆయన ఆరోపించారు. హడావిడిగా, ఏమాత్రం ప్రణాళిక లేకుండా బలవంతంగా ఎస్ఐఆర్ అమలు చేస్తుండటం పెద్ద నోట్ల రద్దు, కోవిడ్-19 లాక్‌డౌన్ నాటి పరిస్థితిని తలపిస్తోందని విమర్శించారు. ‘జరిగిందేదో జరిగింది. ఇక చాలు. ఇప్పటికైనా మనం మేలుకోని ప్రజాస్వామ్య మూలస్తంభాలను కాపాడుకోకుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. అమాయక బీఎల్‌ఓల మరణాలకు ఎస్ఐఆర్‌, ఓట్ చోరీపై మౌనం వహిస్తున్న వారే బాధ్యులు. మీ గళం వినిపించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని ఖర్గే కోరారు.

పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో బీఎల్ఓగా పనిచేస్తున్న ఒక మహిళ శనివారంనాడు తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. ఎస్ఐఆర్‌ పని ఒత్తిళ్ల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు తెలిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగానే పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని అన్నారు. బీఎల్ఓ సూసైడ్ నోట్‌ను కూడా ముఖ్యమంత్రి షేర్ చేశారు. అయితే ఈ సూసైడ్ నోట్ అబద్ధమని బీజేపీ నేత రాహుల్ సిన్హా కొట్టివేశారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని రైసేన్, దమోహ్ జిల్లాల్లోనూ బీఎల్ఏ పనుల్లో ఉన్న ఇద్దరు టీచర్లు అస్వస్థత కారణంగా గత శుక్రవారం మరణించడం మరింత ఆందోళనకరంగా మారింది.

జోరుగా ఇందిరమ్మ చీరల పంపిణీ…

జోరుగా ఇందిరమ్మ చీరల పంపిణీ

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వ లక్ష్యం

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోమహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందని భూపాలప ల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. మం డల కేంద్రంలో హన్మకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీకార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు హాజరై ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహి ళల అభ్యున్నతికి సీఎం రేవం త్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఎన లేని ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తు న్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదా లు, లోటుపాట్లకు తావులే కుండా ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆడబిడ్డలకు చీర,సారె పెట్టడం

 

 

 

మనసంప్రదాయమని అన్నా రు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులకు వారిని యజమానులను చేశామని అన్నారు. స్కూల్స్ యూనిఫాం లు కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగిం చామని అన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్‌ తో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కూడా మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కుటుంబ అభ్యున్నతిలో మహి ళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని ఎమ్మె ల్యే హితువు పలికారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్య క్రమం అనంతరం మండ లంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 18 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారు లకు రూ.5,23,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గోపాలపురంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ…

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరి పత్రాలు అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలంలోనీ గోపాలపురం గ్రామంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి మరియు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో ఇదిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్, భూపాలపల్లి జిల్లా సేవదల్ అధ్యక్షులు ఏకు రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు నీలం కుమారస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గన్నారపు సదయ్య, మాజి గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందుల భద్రయ్య, బత్తిని సదయ్య, గోవిందుల శంకరయ్య, చళ్ళ కుమార్, అంబాల రవి, గూడెపు చిన్ని, సంపెల్లి రాజు, చెవుల రమేష్, మరియు ఇతర పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version