క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా అవతరించిన అనంతరం రెండో సారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి మిత్ర పక్షంగా మెలిగి గెలుపుకు సహకరించామని,సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో స్నేహబంధమే కోరుకుంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ తో పాటు కలిసి పనిచేసేందుకు ఇష్టపడని నేపథ్యంలో సిపిఐ పార్టీ మునిసిపాలిటీలోని 22 వార్డులలో కౌన్సిలర్లు గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని అన్నారు..
మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే కలిసివచ్చే సెక్యులర్ పార్టీలతో సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వార్డులలో నామినేషన్ వేస్తామని తెలిపారు. సిపిఐ కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, ఈరవేన రవీందర్, రాజేశం ,మనమ్మ, లక్ష్మణ్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
