ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరానికి ప్రతీక…

ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరానికి ప్రతీక

3వ వార్డ్ కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరానికి ప్రతీక అని భూపాలపల్లి మున్సిపాలిటీ 3వ వార్డ్ కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు అన్నారు సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ హనుమాన్ నగర్ కాలనీలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునేందుకు బుధవారం12 ఇందిరమ్మా ఇళ్లకు ముగ్గు పోయడం జరిగింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు మాట్లాడుతూ పేదలకు సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అదేవిదంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎంతో కృషి చేస్తున్నారని వారు అరుణ్ రావు అన్నారు.అదేవిధంగా గతంలో 15 ఇల్లు రాగా 12 ఇల్లు ప్లాస్టింగ్ కంప్లీట్ అయినయ్ కాగా ఇంకా 18 ఇండ్లు ముగ్గు పోయాల్సి ఉంది అని అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంకు ఇందిరమ్మ ఇల్లు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, తుమ్మల నాగేశ్వరావుకి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్,మోటo శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు.

శిరిడి సాయిబాబాకు పూజలు చేసిన వైస్ చైర్మన్ శ్రీనివాస్…

శిరిడి సాయిబాబాకు పూజలు చేసిన వైస్ చైర్మన్ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కి శాలువాతో సన్మానం చేసి శ్రీ షిరిడి సాయిబాబా దివ్య ఆశీస్సులు నీపై నీ గెలుపుకు కృషి చేసిన 15వ వార్డు ప్రజలకు ఉండాలని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చన అభిషేకాలు చేపించడం జరిగిందిa

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక…

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక

వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు17 సిపిఐ1 మొత్తం 18 మంది కౌన్సిలర్ల గెలుపొందడం జరిగింది ఆర్డిఓ హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ జోన ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిలర్ సభ్యులు అందరూ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది అనంతరం 2వార్డ్ కౌన్సిలర్ సభ్యుడు బుర్ర కొమురయ్యను ఏకగ్రీవంగా భూపాలపల్లి పురపాలక సంఘం చైర్మన్ గా ఎన్నుకున్నారు అలాగే వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎక్సెప్షన్ నెంబర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుల దేవన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు…

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో 163 బీఎన్ ఎస్ఎస్ (సెక్షన్ 144) అమల్లో ఉండగా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. డీజేలు, మైకులు, బాణాసంచా వంటి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు కూడా నిషేధించబడ్డాయి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

భూపాలపల్లి మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండానే….

భూపాలపల్లి మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండానే

మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

మున్సిపాలిటీ సాధారణ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరైనారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుది అలాగే పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను నూతన మండలాలు నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులోని భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేశారు కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ జిల్లాలను తగ్గిస్తామని అంటున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను తీసేస్తామని అసత్య ఆరోపణలు చేస్తున్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూపెట్టాలి గతంలో బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం సిసి రోడ్ల నిర్మాణం స్మశాన వాటికల నిర్మాణం సైడ్ డ్రైనేజీలు కోర్టు భవనం మిషన్ భగీరథ నీరును పట్టణ ప్రజలకు అందివ్వడం జరిగింది వారు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు అలాగే మహిళలకు 2500 ప్రతినెల ఇస్తా అని హామీ ఇచ్చారు ఆ హామీని కూడా అమలు చేయలేదు కల్యాణ లక్ష్మి ధార మహిళలకు తులం బంగారం ఇస్తా అని పగడ్బాలు పలికారు కానీ ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. వానకాల సీజన్ స్టార్ట్ అయింది అంటే రైతులకు ఎరువులు యూరియా అందక రైతులు చెప్పులను ఎరువుల దుకాణాల ముందు లైన్ లో పెడుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకు నిదర్శనం రైతులు చెప్పులు లైన్లో పెట్టడమే. దీనికి నిదర్శనం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏనాడూరియా కోసం ఎరువుల కోసం ఇబ్బంది పడలేదు అలాంటి పరిపాలన అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని వారు అన్నారు
రైతులు కష్టాలు పడుతున్నారని ఆలోచించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు రైతు బీమా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అలాగే రైతులకు ఏకారాన పదివేల రూపాయలు రైతుబంధు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని వారు అన్నారు సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు ఇవ్వలేదు కార్మికులకు పేరు మార్పిడి సమస్యతో అనేక బాధలు పడుతున్నారు అయినా వారి సమస్యలను పట్టించుకోవడం లేదు సింగరేణిలో ఉన్న నిధులను పార్టీ అవసరాల కోసం వాడుకుంటున్న సీఎం మన కాంగ్రెస్ పార్టీ సీఎం కావున వారికి తగిన గుణపాఠం ప్రజలు ఓటు ద్వారా చెప్పాలి అని వారు అన్నారు భూపాలపల్లిలో నిరంతరం బొగ్గు లారీలు ఇసుక లారీలతో అనేకమంది వాహనదారులు యాక్సిడెంట్లు ప్రాణాలు దానితో మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి నాకు చెప్పడంతో వెంటనే ఆ రోజులలో భూపాల పెళ్లికి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం సాంక్షన్ జీవో తీసుకురావడం జరిగింది కానీ దానిని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటివరకు భూములు సేకరించి పనులు చేపట్టడం లేదు వారు మున్సిపాలిటీ అభివృద్ధి ఎలా చేస్తారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గండ్ర గౌతంరెడ్డి టీజీపీకే నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

చెయ్యి గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ గెలిపించండి….

చెయ్యి గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సొత్కు రామ సమ్మయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

8వార్డు ప్రజలు ఆదరించి మున్సిపల్ కౌన్సిలర్గా చెయ్యి గుర్తుకు ఓటేవేసి గెలిపించండి పాలకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానని
కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి సొత్కు రామ సమ్మయ్య ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలే ఎజెండాగా 8వార్డులోని అన్నికాలనీలను అన్ని రంగాల్లో ఎమ్మెల్యే సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ సహకారంతో నిధులు తీసుకువచ్చి కాలనీలను సుందరంగా తీర్చిదిద్ధి అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. జోహార్ నగర్ కాలనీల్లో మంచి నీరు అందేవిదంగా, డ్రైనేజి సమస్యలేకుండా, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం, లేని వారికి రేషన్ కార్డుల అందించేవిధంగా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు, ఆలయాల అభివృద్ధికి, అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమం అందేలా కృషి చేస్తానని తెలిపారు. కాలనీ ప్రజల కోరిక, సహకారం మేరకు అభివృద్ధే లక్ష్యంగా ఎలాంటి అవి. నీతి లేకుండా, నిజాయితీగా తోడ్పడుతానని తెలిపారు. చెయ్యి గుర్తకు ఓటేసి నాపై నమ్మకంతో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండని ఓటర్లను అభ్యర్ధించారు.

“4వ వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం”

కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయండి కన్నం యుగదీశ్వర్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 4వార్డ్ బిజెపి పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కన్నం యుగదీశ్వర్ యుగేందర్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగో వార్డ్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ పంపియండి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను నాలుగో వార్డు పక్కకు వారం సంతను తీసుకువస్తాను ప్రతి వార్డుకు ఒక బోరు వేసి నీటి సౌకర్యం కల్పిస్తాను కాలనీ సమస్యలను అన్నిటిని పరిష్కరిస్తానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బీర్తీ కమల మధునయ్య కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్తీ కమలను మధునయ్య 17వ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కావున వార్డు ప్రజలు అందరూ ఆలోచించి బీర్తీ కమల చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి వార్డు అభివృద్ధికి అందరూ సహకరించండి అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 17వార్డు ఇన్చార్జి టౌన్ యూత్ అధ్యక్షుడు పృథ్విరాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

దాట్ల విజయ శ్రీనివాసుని గెలిపించండి…

దాట్ల విజయ శ్రీనివాసుని గెలిపించండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 16 వ వార్డు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల విజయ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల విజయ శ్రీనివాసుకు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలరు అని వారు అన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5వార్డు యాదవ కాలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును ఇటీవల కోరడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీవాసుల కోరిక మేరకు నూతన విద్యుత్ స్తంభాలు విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలను వేయించడం జరిగింది అలాగే సీట్ లైట్లను ఏర్పాటు చేసి వాటిని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను కావున భూపాలపల్లి ప్రజలు ఆలోచించి రాబోవు మున్సిపల్ ఎన్నికలలో 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లిని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇండ్లు రైతులకు సన్నబడ్లకు 500 బోనసు ఇలా అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు కావున ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉడత సరోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ విజయ్ ఉడత మహేందర్ కాలనీవాసులు పాల్గొన్నారు

భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి

భూపాలపల్లి మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ
బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన భూపాలపల్లి పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటే అధికార పార్టీకిచ్చే సరైన సమాధానం కావాలి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు శక్తితో అధికార పార్టీ వైఫల్యాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…

అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన…

అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7 మరియు 26వ వార్డులలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు, మహిళా సంఘాలకు కోటి రూపాయలు బ్యాంకు లింకేజీ, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు అలాగే పురపాలక పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులు నివాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు వచ్చేస్తున్నాయని ప్రజల రక్షణకు 3 కోట్ల రూపాయల వ్యయంతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి మహిళలు పట్ల అపారమైన గౌరవం ఉందని తాము అధికారం చేపట్టిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన తెలిపారు. సంక్రాంతి సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరెలు ఇస్తామన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్తు అర్హత ఆధారంగానే ఇస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టిసి బస్సులు, పెంట్రోల్ బంకులు ఇస్తున్నామని తెలిపారు. నిధులు, నీళ్లు, నియమాలు కోసం ఏర్పడిన తెలంగాణలో గత 10 సంవత్సరాలు వెనుకబాటుకు గురైందని, ఉద్యోగాలు రాలేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం చేయకట్టగానే గ్రూప్ 1,2 3 వన్ ఉద్యోగాలతో శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం మీకు అన్నివేళల్లో అండగా ఉంటుందన్నారు. అన్ని కులాల వారికి మున్సిపల్ పరిధిలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి సమ్మక్క సారక్క దీవెనలు మెండుగా ఉండాలని కోరారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు, పేరు మార్పిడి సొంతింటికలను సాకారం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పిడి రాజేశ్వరి, ఎంపీడిఓ తరుణ్ ప్రసాద్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి…

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం ఐడీఓసి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ, 30 వార్డులకు గాను ఎస్టీ – 2, ఎస్సి – 6, బిసి – 7, అన్ రిజర్వ్డ్ – 15 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే ఎస్టీ వార్డుల్లో 1 మహిళకు,
ఎస్సి వార్డుల్లో 3 మహిళలకు,
బిసి కేటాయించిన 7 స్థానాల్లో 3 మహిళలకు,
అన్ రిజర్వ్డ్ 15 స్థానాల్లో 8 మహిళలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు.
రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియో గ్రఫీ మధ్య లాటరీ పద్ధతిలో నిర్వహించామని, ఈ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన రీజినల్ డైరెక్టర్…

మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన రీజినల్ డైరెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మునిసిపల్ 2వ సాధారణ
ఎన్నికలలో భాగంగా షాహిద్ మసూద్, రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వరంగల్ పురపాలక సంఘ వారు భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎన్నికలకు సంబంధించిన పనుల యొక్క పురోగతిని పనుల వివరాలను మున్సిపల్ కమిషనర్ కే. ఉదయ్ కుమార్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పి సునీల్ కుమార్ మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ సుభాష్ కుమార్ కార్యాలయపు అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అదేవిదంగా వేశాలపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వేషాల రవీందర్ అడ్వకెట్ తన సొంత ఖర్చులతో భక్తుల సౌకర్యార్ధం నీటి ట్యాంక్ ఏర్పాటు చేయగా నల్లా తిప్పి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన ఇప్పకాయల మనస్విని మొదటి బహుమతి రూ. 5016,పొట్ల రజని ద్వితీయ బహుమతి రూ. 3016/-,నల్ల మౌనిక తృతీయ బహుమతి రూ. 2016/- లను అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ప్రజలందరికి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు.
ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఇదే స్పూర్తితో వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని కోరారు.
మన ప్రతిభను,మన గొప్ప సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఈ రోజు ముగ్గుల పోటీల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిలు, ఐదో తరగతి చిన్నారులు, డిగ్రీ చదువుతున్న యువతులతో పాటు పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఈ తరం ఆ తరం మధ్య ఏర్పడిన ఈ కలయిక మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు మన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో ఘనంగా భోగి సంబరాలు

భూపాలపల్లిలో భోగి మంటలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో సంక్రాంతి భోగి పర్వదినం సందర్భంగా భోగిమంటలు వేసి భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామునే ప్రజలు వాడవాడలా భోగి మంటలు వేసి పండగను ఆనందోత్సవంలో నిర్వహించుకున్నారు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ముంగిళ్లలో రంగువల్లులు తీర్చిదిద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. రేగుపళ్లు, నవధాన్యాలు కలిపిన నీటితో చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకల్లో మునిగితేలారు. ఈ పండుగ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు

వీబీజీఆర్‌జీ చట్టం రద్దు చేయాలి – ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని యెడల పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటేలా, ప్రతీ ఒక్క కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకువెళ్లాలని సూచించారు. క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

బతుకమ్మ నిధులలో అవకతవకలకు పాల్పడ్డ మున్సిపాలిటీ అధికారులు…

బతుకమ్మ నిధులలో అవకతవకలకు పాల్పడ్డ మున్సిపాలిటీ అధికారులు

గ్రీన్ బడ్జెట్ నిధులను పక్కదారి పట్టిస్తున్న మున్సిపాలిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి లోని కాకతీయ ప్రెస్ క్లబ్ ఎదురుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్పీకే సాగర్ పత్రిక మీడియా సమావేశం నిర్వహించారు అందులో భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం సద్దుల బతుకమ్మ గ్రీన్ బడ్జెట్ నిధుల విషయాలలో అవకతవకలకు మున్సిపాలిటీ కార్యాలయం పాల్పడిందని ఆరోపించారు సద్దుల బతుకమ్మ 2025 సంవత్సరం 30 లక్షల రూపాయలు మరియు గ్రీన్ బడ్జెట్ వనమహోత్సవం కొరకు 18 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము కేటాయించడం జరిగింది. మొత్తం 48 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ నిధులను సకాలంలో మున్సిపాలిటీ కార్యాలయం వినియోగించకుండా తప్పుదారి పట్టిస్తూ ప్రజలకు అధికారుల కల్లు కప్పి పనులు చేయని పనులు చేసినట్టుగా ఫోటోలను చిత్రీకరిస్తూ ఫోటోలను క్రియేట్ చేస్తూ బడ్జెట్ రిలీజింగ్ కొరకు కలెక్టర్ కి భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం లెటర్ పెట్టింది చేయని పనులు చేసినట్టుగా చిత్రీకరించి 48 లక్షల రూపాయలను ప్రజాసమము ప్రజల సొమ్మును దుర్వినియోగ పరుస్తున్న అధికారుల పట్ల తక్షణమే జిల్లాస్థాయి అధికారుల చేత సమగ్ర విచారణ జరిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు వాస్తవాలను తెలపాలని ఈ నిధులు ఏమయ్యాయో భూపాలపల్లి ప్రజలకు తెలుపాలని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే లోకల్ బాడీ కలెక్టర్ని తక్షణమే సమగ్ర విచారణ కొరకు సమర్థిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఎస్ పీ కే సాగర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గంధం రాకేష్ జష్వంత్ మామిడి శ్రీకాంత్ కళ్యాణ్ శ్రీకాంత్ రాజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version