నర్సంపేట మున్సిపల్ ఎన్నికల బరిలో 120 మంది అభ్యర్థులు…

నర్సంపేట మున్సిపల్ ఎన్నికల బరిలో 120 మంది అభ్యర్థులు

బిఆర్ఎస్, కాంగ్రెస్,భాజపా నుండి అన్ని వార్డుల్లో త్రిముఖ పోటీ

ఎంసిపిఐ(యు) 5 సిపిఎం నుండి ఇద్దరు పోటీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికలలో 120 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ తెలిపారు.నామినేషన్ల ముగింపు వరకు 291 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందులో వివిధ కారణాలతో 66 నామినేషన్లు తిరస్కరణ అయ్యాయి. కాగా మొత్తం 225 ఉండగా నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం చివరి రోజు కావడంతో 105 మంది అభ్యర్థులు వారి వారి నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారు.వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 120 ఎన్నికల బరిలో ఉన్నట్లు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ప్రాటించారు.కాంగ్రెస్ పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు, బిఆర్ఎస్ పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు,భాజపా పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఎంసిపిఐ(యు) పార్టీ నుండి 1,4,16,19,20, వార్డులల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిపిఎం పార్టీ నుండి 10,23 వార్డులల్లో బరిలో ఉన్నారు.జనసేనా పార్టీ నుండి ముగ్గురు, ఇతర పార్టీల నుండి నలుగురు అభ్యర్థులు, మిగతా మొత్తం మంది స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 120 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

23 నామినేషన్ల ఉపసంహరణ…

23 నామినేషన్ల ఉపసంహరణ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

ఎల్లంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ మొదటిరోజు అయిన సోమవారం 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో బిఆర్ఎస్ కు చెందిన ఏడు మంది, కాంగ్రెస్కు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒకరి తో పాటు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆలియా బాద్ లో బిఆర్ ఎస్ కు చెందిన ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలో పదిమంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అందులో బిజెపికి చెందిన ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన నలుగురు, బిఆర్ఎస్ కు చెందిన ఒకరు, ఒకటి జనసేన ఒకరు జనకు జనసేనకు చెందిన ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.

కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఖాయం

*కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం*

*మేయర్ పీఠం కాంగ్రెస్ దే- వెలిచాల రాజేందర్ రావు*

కరీంనగర్, నేటిధాత్రి:

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపిలకు ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమని, ఘోరంగా ఓడించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. గల్లి గల్లి లో పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ బిజెపి పార్టీ ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని మండిపడ్డారు. గురువారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో 28వ డివిజన్ చెందిన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ నాయక్ నేతృత్వంలో ఆడివిజన్ కు చెందిన వంద మంది యువకులు ప్రజలు వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా రాజేందర్ రావ్ వారందరికీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని ప్రజలంతా కాంగ్రెస్ ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బిజెపిలను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలంతా కంకణం కట్టుకున్నారని కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అవినీతి అక్రమాల్లో మాత్రం మించిపోయారని ఆరోపించారు. ఎన్నికల రాగానే ప్రజలపై ప్రేమను వలకబోస్తున్నారని వారి మాటలను నమ్మవద్దని రాజేందర్రావు కోరారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రెండుసార్లు ఎంపీగా గెలిచినా కరీంనగర్ అభివృద్ధిని మాత్రం మర్చిపోయారని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని రాజేందరో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో 28 డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ నాయక్, పులి రమేష్, పులి అనిల్, బోయిని దేవరాజు గుండేటి అనిల్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా పార్టీ సత్తా చాటుతుంది.

స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా పార్టీ సత్తా చాటుతుంది. మెట్ పల్లి బీజేపి కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు..
మెట్ పల్లి ఆగస్ట 1 నేటి దాత్రి
రాబోయే స్థానిక సర్పంచ్,ఎంపీటీసి ఎన్నికల్లో బిజెపి పార్టీ సత్తా చాటుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బుద్ధి చెబుతారని బిజెపి రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు అన్నారు .మెట్పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేసిందని, వర్షాకాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో దోమల బెడదతో పాటు ఇతర సమస్యలతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో సర్పంచ్,ఎంపీటీసి ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండడంతో పోటీ చేసిన ప్రతి వద్ద గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు, అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ సంవత్సర కాలంలోనే వ్యతిరేకత వచ్చిందని అందుకు ఉదాహరణ గాని రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు దీంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు కాంగ్రెస్ బిజెపి మధ్యనే పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలు గమనిస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత ఎంతో ముందు చూపుతో బిజెపి ఎన్నికలలో గెలిపిస్తారని అన్నారు స్థాయి నాయకులు భాజపా పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పసుపు బోర్డు రావడం రైతుల్లో ఆనందం వెల్లులిసిందని రానున్న రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అటు ప్రజలకు రైతులకు అందిస్తామని ఆయన అన్నారు అత్యధిక మెజార్టీలతో అత్యధిక స్థానాలు భాజపాటి స్వాధీనం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బిజెపి నాయకులు సుఖేందర్ గౌడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి పార్టీ పై బురదల్లే ప్రయత్నం మానుకోవాలి

బిజెపి పార్టీ పై బురదల్లే ప్రయత్నం మానుకోవాలి

మహాదేవపూర్ నేటిధాత్రి

 

బిజెపి పార్టీ బీసీలను మోసం చేసిందని ఇటీవల బీసీ సంఘం డివిజన్ నాయకుడు విజయగిరి సమ్మయ్య ఆరోపణలు చేయడం బిజెపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేయడమేనని అటువంటి వ్యాఖ్యలు చేయడం వెంటనే మానుకోవాలని బిజెపి మహాదేపూర్ సీనియర్ నాయకుడు కన్నెబోయిన ఐలయ్య యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.

మహాదేవపూర్ మండల కేంద్రంలో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ…. ఇటీవల బీసీ సంఘం డివిజన్ నాయకుడు విజయగిరి సమ్మయ్య బిజెపి పార్టీ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిజెపి పార్టీ అన్ని కుల,మత, సంఘాలను కలుపుకుపోయే పార్టీగా రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల అవతరించిందని అన్నారు. బిజెపి పార్టీపై బూరదల్లే ప్రయత్నం కొన్ని దుష్టశక్తులు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీయే బిజెపి పార్టీ అని, ఒక బీసీ బిడ్డను దేశానికే ప్రధానమంత్రిగా చేసినటువంటి ఘనత బిజెపి పార్టీ కే దక్కుతుందని గుర్తు చేశారు. అంతేకాకుండా గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి బండి సంజయ్ ఒక బీసీ బిడ్డ కాదా….? అని ప్రశ్నించారు. పార్టీ ఎక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలను చేస్తామని హామీ ఇవ్వలేదని అన్నారు. సంఘాల పేరుతో పబ్బం గడుపుకునే కొంతమంది నాయకులు బిజెపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి ఆలోచనలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. మీరు పని చేసే పార్టీలో ఎంత మంది బీసీ బిడ్డలు గ్రామస్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు వారికి అవకాశం కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, కనీసం మండలి చైర్మన్ గానైనా బీసీలకు అవకాశం కల్పించారా అని ప్రశ్నించారు. బిజెపి పార్టీకి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్ర రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది.

బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది

కుల మత విద్వేషాలు రెచ్చగోడుతుంది

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన
జై బాపు జై భీమ్ జై సంవిదన్
అను కార్యక్రమం న్ని కొత్తగూడ మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు..మండల కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య విచ్చేసి ముందుగా మండల కేంద్రం లోని బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహని కి పూలమాల వేసారు అనంతరం జెండా ఎగరేశారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న కార్యక్రమం లో భాగంగా ఈరోజు నుంచి దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధన్
కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పిలుపు నేడు కొత్తగూడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భారత రాజ్యాంగం నీకి అన్యాయం చేసే కుట్ర బీజేపీ చేస్తుందని రాజ్యాంగం ని నిర్లక్ష్యం చేస్తూ కులాల చిచ్చు మతాలరొచ్చు దేశం లో అలజడులు సృష్టి స్తుంది రాజ్యాంగం కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని.. జై బాపు జై భీమ్ జై సంవిధన్ అని అన్నారు..ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, టీపీసీసీ ఆర్గనైజ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఇర్ఫా రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బిట్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, యూత్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి, యూత్ జిల్లా జనరల్ సెక్రెటరీ నోముల ప్రశాంత్, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ మల్లెపూ రంజిత్, యూత్ మండల ఉపాధ్యక్షులు చొప్పారి కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, వివిధ గ్రామా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు…

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో మండేపల్లి గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ. M.G.NREGS. పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి ఒక కోటి 75 లక్షల రూపాయల నిధులను కేటాయించారు అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి ఒక కోటి 75 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అట్టినిధులను మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిని గోపి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి ఓబిసి మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ బిజెపి నాయకులు గోనెపల్లి శ్రీనివాస్ నే వూరి సురేష్ గుర్రం రంజిత్ రాము బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రాజు రామలింగారెడ్డి దుమాల శ్రీకాంత్ వంతడుపులసుధాకర్ సండే వేణి రాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version