టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

కార్మికుల కూలి పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడాలి

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి కూలీ పెంచాలి

సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమం చేపట్టిన టెక్స్టైల్ పార్క్ కార్మికులు

కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుంది

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కులో కార్మికులకు ప్రభుత్వ వస్త్రాలకు రోజుకు 1000 /- రూపాయల వేతనం వచ్చే విధంగా పెంచాలని అదేవిధంగా ఒప్పంద గడువు ముగిసిన ప్రైవేటు వస్త్రానికి వెంటనే కూలి పెంచాలనే డిమాండ్లతో కార్మికులు చేపట్టిన సమ్మె 3 వ. రోజుకు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న విగ్రహం వరకు డిమాండ్లతో కూడిన ఫ్లకార్లతో ర్యాలీ చేపట్టి సమస్యలపై నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగినది.

ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడి వెంటనే చర్చలు జరిపి కార్మికులకు ప్రభుత్వ , ప్రైవేటు వస్త్రాల కూలి పెంచి సమ్మె విరమింపజేయాలని అన్నారు.యజమానులు కూలి పెంచే విధంగా సంబంధిత చేనేత జౌళి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే కూలి పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , శ్రీకాంత్ , కిషన్ , ఆంజనేయులు , సంపత్ , వేణు , శ్రీధర్ , వేణు , రాజు , మనోహర్ , రాజశేఖర్ , ప్రశాంత్ , గణేష్ , రామచంద్రం , కనుకయ్య ,వరప్రసాద్ , మహేష్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version