సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.
బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ముశం రమేష్
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ ఈనెల 27వ తారీకు ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో బీడీ అండ్, సిగార్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఇట్టి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమా రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి గార్లు హాజరవుతున్నారు
ఈ మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సందర్భంగా 4000 పెన్షన్ అమలు చేస్తానని ఇప్పటికి కూడా అమలు చేయకుండా పోయింది
బీడీ కార్మికులను విపరీతంగా దోపిడీ చేస్తున్న కంపెనీ యజమానులపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో బీడీ కంపెనీలో బీడీ కంపెనీ యజమాన్యం విపరీతమైన దోపిడీకి పాల్పడతా ఉంది ప్రతి కార్మికుల నుండి కంపెనీ యజమానులు 2000 కూలీని దోచుకుంటున్నారు అనేక రకాల పేర్లతో కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.పెద్ద మొత్తంలో బీడీల నుండి ఆదాయం వస్తున్న కూడా బీడీ కార్మికులకు పనికి తగ్గ వేతనం నిర్ణయించడం లేదు రాబోయే కాలంలో బీడీ కార్మికులందరికీ పిఎఫ్ తో సంబంధం లేకుండా నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని కనీస వేతనం 1000 బీడీలకు 600 రూపాయలు చెల్లించాలని ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని 2000 బీడీల కోత విధించకుండా చేయాలని 26 రోజుల పని కల్పించాలని బీడీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాణ్యమైన ఆకు తంబాకు అందించాలని ము శం రమేష్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర జిందo కమలాకర్, దాసరి రూప, బేజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.