సొంతింటి కల నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం…

సొంతింటి కల నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

శ్రీరాంపూర్, మంచిర్యాల నేటి ధాత్రి:

 

 

సింగరేణి కార్మికులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న సొంతింటి కల పథకం ప్రభుత్వం, యాజమాన్యం నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధమేనని కార్మికులు, యూనియన్లకు అతీతంగా కార్మిక నాయకులు సూచనలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం ఇందారం 1ఎ గనిలో సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో ఆయన పాల్గొని పొంతింటి పథకంపై బ్యాలెట్ నమూనా వాల్ పోస్టర్ ను కార్మికులతో ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11,12వ తేదీలలో సొంతింటి పథకంపై సిఐటియు నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో భాగంగా నమూనా బ్యాలెట్ నిర్వహిస్తున్నందున కార్మికులు పాల్గొనాలని అన్నారు.అలాగే 15 వ తేదీన వాస్తవ లాభాలు ప్రకటించాలని,35 శాతం వాట కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిఎం కార్యాలయాల ముందు చేపట్టే ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళనలు ధర్నాలకు పిలుపునిస్తుంటే దసరా దగ్గర పడుతున్న ఇంకా లాభాల వాటా ప్రకటన చేయకపోవడం గుర్తింపు,ప్రాతినిధ్య సంఘాలకు సిగ్గుచేటని విమర్శించారు.తక్షణమే వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు లాభాల వాట చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.యాజమాన్యంపై గతంలో పోరాటాలు చేసిన గుర్తింపు,ప్రాతినిథ్య సంఘాల నాయకులు ఇప్పుడు వినతి పత్రాలకు పరిమితమయ్యారని ఆరోపించారు.ఇప్పటికైనా అన్ని సంఘాలను కలుపుకొని కార్మిక వర్గ శ్రేయస్సు కోసం యాజమాన్యంపై పోరాటాలు చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్,వెంగళ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి,కిషన్ రెడ్డి,నవీన్, ఐత శ్రీనివాస్,షేక్ షావలి,మొయినుద్దీన్,ఇప్ప నరేష్,వినయ్,సుదీర్ పాల్గొన్నారు.

కార్మికుల ప్రధాన సమస్యలపై గని మేనేజర్..

కార్మికుల ప్రధాన సమస్యలపై గని మేనేజర్ కి ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మెమోరాండం అందజేత

మంచిర్యాల,నేటి ధాత్రి:

సింగరేణిలో నెలకొన్న ప్రధాన సమస్యలైనా సొంతింటి కలను నెరవేర్చాలని,ఆదాయపు పన్నును మాఫీచేయాలని,మెడికల్ అటెండెన్స్ నియమాలను మార్చాలని కోరుతూ గురువారం ఐఎన్టియుసి నాయకులు గని మేనేజర్ కు మల్లారెడ్డి అధ్యక్షతన మెమోరాండం అందజేశారు. అనంతరం కేంద్ర కమిటీ నాయకులు గరిగే స్వామి మాట్లాడుతూ…నూతన బదిలీ విధానం,నూతన గనులు, తదితర కార్మికుల ప్రధాన సమస్యలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు.గని యాజమాన్యం అవసర నిమిత్తం తీసుకుని పనిచేస్తున్న జనరల్ అసిస్టెంట్ డ్రెస్ కోడ్ ధరించాలని,వారు అధికారులు లాగా కార్మికులతో వ్యవహరిస్తున్నారని,మాన్ వే వద్ద ఇన్,అవుట్ కు రావట్లేదని,ఫోన్ ద్వారానే వారికి ఇన్,అవుట్ వేయడం జరుగుతుందన్నారు.వీరికి యాజమాన్యాన్ని సర్కులర్ రిలీజ్ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే 5 ఫిట్ సెక్రటరీ నంబయ్య,అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు రవి,రాజేందర్, ఏరియా నాయకులు మహేందర్ రెడ్డి,పెద్ది రాజు,చందు,రామకృష్ణ,గని. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version