సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ఓటింగ్ ద్వారా అభిప్రాయ సేకరణ
కంపేటి రాజయ్య, బంద్ సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత రెండు రోజులపాటు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కార్మికుల అభిప్రాయాల సేకరణ చేపట్టారు.
ఈ మేరకు శనివారం స్థానిక శ్రామిక భవనంలో విలేకర్ల సమక్షంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పెట్టారు. ఈనెల 11, 12 తేదీలలో నిర్వహించిన ఓటింగ్ లో సొంతింటి కల నెరవేర్చాలని 3000 మంది కార్మికులు పాల్గొని వారీ అభిప్రాయాన్ని బ్యాలెట్ పత్రంపై తెలియజేశారు. 21 మంది సొంతిల్లు, క్వార్టర్ కావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటీ రాజయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ… 40 వేల మంది సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా వేలకోట్ల రూపాయల లాభాల్లో సింగరేణి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు డివిడెంట్ రూపంలో సింగరేణి చెల్లిస్తూ ఉన్నదనీ, ఇంత శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికులకు మాత్రం సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 వేల సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని, 3200 క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకున్నయని తెలిపారు. వేలాదికరాల భూమి సింగరేణి ఆధీనంలో ఉందని కార్మికులకు సొంతింటి నిర్మాణానికి ఇంటి స్థలం కేటాయించి, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చే వరకు కార్మిక సంఘాలు సంఘాల కతీతంగా పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు బాధ్యత తీసుకోవాలని, మిగతా కార్మిక సంఘాలను ఏకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం దేవేందర్, దీకొండ ప్రసాద్, ఎం రాజేందర్, తోట రమేష్, బిక్షపతి, రవి కుమార్, రాజాకు, శంకరు తదితరులు పాల్గొన్నారు.