సీ.ఐ.టీ.యూ ఆధ్వర్యంలో చేనేత జాతీయ దినోత్సవం
వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలి
( త్రిఫ్ట్ ) నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలి
చేనేత – పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలి
కార్మికులందరికీ 6వెయ్యిల రూపాయల పెన్షన్ అమలు చేయాలి
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ఆగస్టు – 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ – CITU ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండులోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి వర్కర్ టూ ఓనర్ , త్రిఫ్ట్ , మరియు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం , అధికారులు చేనేత దినోత్సవం రోజున సంబరాలు జరుపుకోవడానికి పరిమితం కాకుండా చేనేత , పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కర్ టూ ఓనర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని , త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ , వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , ఉడుత రవి , సూరం పద్మ , దాసరి రూప , జిందం కమలాకర్ , బెజుగం సురేష్ , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , బింగి సంపత్ , కారంపురి మహేష్ , చింత కింది సుధన్ , దోమల రాము , సందుపట్ల పోచమల్లు , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు