నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి…

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

పట్టణంలో కార్మిక వర్గం భారీ ప్రదర్శన

నర్సంపేట,నేటిధాత్రి:

కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణంలో బిఆర్టియు, ఏఐఎఫ్టియు (న్యూ), ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, టియుసి సంఘాల ఆధ్వర్యంలో* వరంగల్ రోడ్డు కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యాకూబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎఫ్టియు
న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేష్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు,ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుంపేల్లి మునీశ్వరు,హమాలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మినారాయణలు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేటు బహుళ జాతి యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా 4 లేబర్ కోడులను తీసుకువచ్చారని కనీస వేతనం అమలు చేయాలని, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సవరణలు చేయడం సరికాదని రైతాంగం హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న విధంగా కార్మికుల కూడా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువల లలిత కార్యదర్శి సంధ్య సిఐటియు పట్టణ కార్యదర్శి కందికొండ రాజు, ఆయా సంఘాల నాయకులు రాజు, నాగులు,మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

వాగ్దానం పట్ల అడుగుతే అక్రమ అరెస్టులా…

వాగ్దానం పట్ల అడుగుతే అక్రమ అరెస్టులా

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని అడుగుతే అరెస్టు చేస్తారా అని బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు ఆరోపించారు.
మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఆదుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్ కి నెలకు జీవన భృతి కింద ఇస్తామన్న ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శాంతియుతంగా వెళ్తున్న కార్మికులను నవతెలంగాణ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్, జిల్లా నాయకులు పెండం వెంకటేశ్వర్లు, గణేష్, నరసయ్యలను అరెస్టు చేయడం సరికాదన్నారు.ఆర్థిక ఇబ్బందులకు గురై రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేసియ చెల్లించాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లకి జీవన భృతి కింద నెలకు 20 వేల రూపాయలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆటో డ్రైవర్లకి రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి తద్వారా అర్హులైన కార్మికులకి సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version