రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ బీడీ & సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 3 వ. మహాసభలు సిరిసిల్ల పట్టణంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర నాయకత్వం సమక్షంలో 21 మందితో నూతన కమిటీనీ ఎన్నుకోవడం జరిగినది. ఈ ఎన్నికల్లో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా – ముశం రమేష్,అధ్యక్షులుగా, శ్రీరాముల రమేష్ చంద్ర,
ప్రధాన కార్యదర్శిగా,సూరం పద్మ,కోశాధికారిగా – జిందం కమలాకర్,ఉపాధ్యక్షులుగా దాసరి రూప , కావేటి సత్యం,లక్ష్మణ్ కార్యదర్శిలుగాబెజుగం సురేష్ ,బోనాల లక్ష్మి , కీసరి పుష్పల,కమిటీ సభ్యులుగా మాడుగుల మల్లయ్య , గట్ల సప్న , లింగంపల్లి జ్యోతి,గురజాల మమత, సులోచన,
వాణి,మానస తదితరులను ఎన్నుకోవడం జరిగినది.ఈ సందర్భంగా సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ నూతన కమిటీగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేసి రాబోయే కాలంలో జిల్లాలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నూతన కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ₹4,000 పెన్షన్ అమలు కొరకై అదేవిధంగా బీడీ కంపెనీ యజమాన్యం బీడీ కార్మికుల శ్రమను విపరీతంగా దోపిడీకి పాల్పడుతుందని కార్మికులు పనిచేసినటువంటి బీడీల నుండి 2500 బీడీల కూలీని దోచుకోవడమే కాకుండా దీనితో పాటు అనేక రకాల కోతల పేరుతో కార్మికుల వేతనాల నుండి నెలకు దాదాపు ₹1000 రూ!! ల వరకు కట్ చేయడం జరుగుతుందన్నారు.
బీడీ పరిశ్రమ మరియు కార్మికుల పట్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బీడీ కంపెనీల యజమాన్యాలు చేస్తున్న దోపిడీపై కార్మికులను ఐక్యం చేసి రాబోయే కాలంలో నూతన కమిటీ పనిచేస్తుందని అన్నారు.కార్మికులందరూ కంపెనీ యజమాలకు,టేకేదారులకు భయపడకుండా ఐక్యం కావాలని సంఘం కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు.