ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిదాత్రి ,

పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన , శాంతమ్మ రాములు కు చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం లబ్దిదారుల తో కలిసి భూమిపూజ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయని మంజూరైన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు
కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగ గ్రామంలో సోమవారం రోజున బుడగ జంగాలకు 10 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన భూపాల పెళ్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోరే ప్రభుత్వమని అందులో భాగంగా బుడగ జంగాలకు పది లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయడం జరిగిందని బుడగజంగాలకు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు, అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని తొందరగా ఇందిరమ్మ లబ్ధిదారులు ఇండ్లను పూర్తి చేసుకోవాలని పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి టేకుమట్ల మాజీ జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో జయ శ్రీ, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల రాజిరెడ్డి బుచ్చిరెడ్డి జయపాల్ రెడ్డి జంపయ్య ఎంపీడీవో పాల్గొన్నారు

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన..

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన జిల్లా కమిటీ

మంచిర్యాల జులై 23, నేటి ధాత్రి

ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నం బట్టి వాడ 100 పిట్ల రోడ్డులో గల భారతీయ మజ్దూర్ సంఘ్(బి.ఎమ్.ఎస్) జిల్లా కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావించి నేటితో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్ బి.ఎమ్.ఎస్. జెండా ఎగరవేసి కార్మికులతో కలిసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటాల శంకర్ మాట్లాడుతూ, జూలై 23, 1955 సంవత్సరంలో బాల గంగాధర్ తిలక్ జన్మదినం సందర్భంగా దత్తోపంత్ టెన్గ్డే జీ భారతీయ మజ్దూర్ సంఘ్(బి.ఎమ్.ఎస్) కార్మిక సంఘాన్ని ప్రారంభించారు,కార్మిక హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ దేశములోని రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న ఏకైక సంఘం బి.ఎమ్.ఎస్. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఎం.ఎస్. జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, ఉపాధ్యక్షులు కృష్ణ రెడ్డి, రత్నాకర్ మహానంద్,సంగెం లక్ష్మణ్, వేల్పుల స్వామి,బండి వెంకటేశ్వర్లు, సిద్దు, సంతోషం లో పాల్గొన్నారు

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన.

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో పర్యటించారు. రూ.52 లక్షలతో వివిధ గ్రామాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ధర్మారావుపేట గ్రామంలో ఎమ్మెల్యే యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలోని శివాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బసవరాజుపల్లి గ్రామంలో యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, రూ.12 లక్షలతో నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. గొల్లపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో పంచాయతీరాజ్ రోడ్డు నుండి పోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్దే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి, రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, ఎంపీడీవో ఎల్ భాస్కర్ మండల అధ్యక్షుడు జిల్లా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఎంపీటీసీ భవిత సుధాకర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్ల మల్లయ్య భాస్కరరావు చింతకుంట్ల శ్రీను పైసా మొగిలి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భవ దినోత్సవం జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో చిట్యాల పట్టణ అధ్యక్షుడు బుర్ర అభిజ్ఞ గౌడ్ ఆధ్వర్యంలో ఎబివిపి జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం అభిజ్ఞ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని 1949లో నలుగురి విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ ఈరోజు అన్ని యూనివర్సిటీలలో కళాశాలలో అత్యధికంగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీ పని దేశం ధర్మం కోసం పనిచేసే విద్యార్థి సంఘం జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థి సంఘం ఎబివిపి అని వారు అన్నారు..

జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జైపూర్,నేటి ధాత్రి:

రాష్ట్ర కార్మిక,ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు జైపూర్ మండలంలో శనివారం రోజున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు అందరికీ పథకంలో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు మంజూరైన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,హౌసింగ్ శాఖ ఏఈ కాంక్ష,గ్రామ కార్యదర్శి ఉదయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్,మాజీ ఉప సర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి,తడిసిన కల్కి రమేష్,ప్రశాంత్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు ఇరిగిరాల శ్రావన్ కుమార్,అరిగేలా శ్రీనివాస్ గౌడ్,ఇరిగిరాల లింగయ్య  పాల్గొన్నారు.

ఈసారీ దాటవెతలే .

ఈసారీ దాటవెతలే…..

◆ నిర్మాణానికి నోచుకోని ప్యాలవరం బ్రిడ్జి

◆ రూ.3కోట్లతో ఆరు నెలల క్రితం శంకుస్థాపన

◆ వర్షకాలంలోపు పూర్తి చేస్తామని హామీ

◆ ఇప్పటికీ ప్రారంభంకాని పనులు

◆ వాగోస్తే రాకపోకలు తీవ్ర ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిలోని ప్యాలారం వాగు ఏటా వానకాలంలో పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు రాకపోకలు తీవ్ర మబ్బందులు పడుతున్నాడు. ఆరు నెలల క్రితం ఈ వాగు పై నూతనంగా బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి.

అంతేకాకుండా బహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్. ఇహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్తేపు, స్థానిక ప్రజాప్రతిఙ్ఞడు లతో కలిసి పనులకు శంకుస్థావన కూడా చేశారు. రానున్న వానకాలం లోపు బ్రిడ్జి నిర్మాదాని పూర్తి చేస్తామని వారు అప్పట్లో ప్రజలకు భరోసా ఇచ్చారు. దీంతో ఎన్నో ఏళ్ల అవస్థలకు దేక్ పడుతుందని గ్రామస్థులు బావించారు. కానీ ఇప్పటికి పసులు ప్రారంభంకాకపోత తో ఈ సారీ కూడా ఇక్కట్లు తప్పడం లేదు. 10 రోజుల క్రితం కురి సేన వర్గానికి వాగు ప్రవాహించడంతో రాకపోకలు స్తంభించి ప్రయాణి కులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

రాకపోకలకు తప్పని ఇబ్బందులు

 

ఎన్నో సంవత్సరాల నుంచి ప్మాలవరం వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు వర్ష కాలం వచ్చిదంటే నానా తంటాలు పడుతు న్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా పసులు ముందుకు సాగలేదు. ప్రస్తుత కాంగ్రెస్: ప్రభుత్వమైనా పనుణు వేగవంతంగా చేస్తుందనుకుంటే కాల యాపనికే పరిమితమైందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ముఖ్యంగా ప్యాంవరం, దేవరంపల్లి గ్రామానికి రాకపోకలు సాఫీగా సాగుతాయి.

ప్రతీ ఏటా తిప్పలే..

ఎలా వాగు ఉద్భత్తంగా ప్రవహిస్తుండ మతే రాకపోవకు ఇబ్బందులు పడు తున్నాయి.నీళ్లు తగ్గుముఖం పట్టింతవరకు నిరీక్షణ తప్పడంలేదు తప్పని పరిస్థితల్లో దేవరంపల్లి ఈదులపల్లి మీదుగా చుట్టూ తిరిగి జహీరాబాద్ పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది.

-మాణిక్యం యాదవ్. ప్యాలవరం

 

 

అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.

అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే,మేయర్

#ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని…

#31 డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ, నేటిధాత్రి :

 

 

 

 

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ గార్లతో కలిసి 31 వ డివిజన్ హంటర్ రోడ్డులో వాసవి కాలనీ మరియు గాయత్రి కాలనీ లలో రూ.88.73 లక్షలతో నూతన అంతర్గత రోడ్లు నిర్మాణ పనులకు. శంకుస్థాపన చేశారు.తొలుత ఎస్సీ కాలనీలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల చేతుల్లో అభివృద్ధికి నోచుకోని అన్ని ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.గతంలో కూడా ఎన్నికల ముందు,ఎన్నికల తరువాత పర్యటించిన క్రమంలో నా దృష్టికి వచ్చిన అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ,విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా ముందుకు వెళ్తుందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు సకాలంలో పనులను ప్రారంభించుకోవాలని సూచించారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షుడు సురేందర్,నాయకులు సత్తు రమేష్,కృష్ణ,తాళ్లపల్లి రాజు,బింగి రమేష్ యాదవ్,మామిండ్ల సురేష్ మరియు మునిసిపల్ అధికారులు స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ.

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ.

బాలానగర్ /నేటి ధాత్రి :

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బిల్డింగ్ తండా గ్రామంలో MGNREGS నిధుల కింద మంజూరైన రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రతి గ్రామానికి పంచాయతీ భవనం ఒక కేంద్ర బిందువుగా ఉంటుందని, గ్రామపంచాయతీ భవనం గ్రామ అభివృద్ధి ప్రజల అవసరాలను తీర్చే దిశగా గ్రామపంచాయతీ కార్యాలయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనతో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే.ఇప్పటికే ఎన్నో గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించామన్నారు. బిల్డింగ్ తండా గ్రామపంచాయతీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సేవలోకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, దత్తాత్రేయ, తిరుపతి, కె.ఎస్.ఆర్ వెంకట్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

కల్వకుర్తి నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సామాజిక సేవలో ముందుంటున్న మిత్ర ఫౌండేషన్ మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కల్వకుర్తి పట్టణానికి చెందిన అరవింద్ చారి యొక్క ఇద్దరు పిల్లలను శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం లో పదవ తరగతి చదివే వరకు వారి విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులను మిత్ర ఫౌండేషన్ భరిస్తుందని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దే దిశగా మిత్ర ఫౌండేషన్ విద్యా భరోసా కృషి చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షులు రసూల్ ఖాన్, పాఠశాల యాజమాన్యం, మిత్ర సభ్యులు శ్రీకాంత్ నేత, నరేష్, శ్రీనేష్, కార్తీక్, హలీం ,తరుణ్, మహేష్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం చేపట్టనైనది. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం మరియు ఎం.ఈ.ఓ అధ్యక్షత వహించగా దూస రఘుపతి ఎం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందించడం ఒక మంచి కార్యక్రమం అని తెలియజేశారు అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో విద్య ద్వారా అభివృద్ధి చెందాలని కోరడం జరిగినది. స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు కోమాకుల ఆంజనేయులు,కార్యదర్శి శ్రీపతి కాశీరాం సభ్యులు నవీన్ గోవర్ధన్, సతీష్, రమేష్ తదితరులు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించినారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ కార్యదర్శి మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో ఫౌండేషన్ స్థాపించామని 2011 నుండి వెంకంపేట పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నమని తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగించుటకు పాఠశాల అధ్యాపక బృందాన్ని కోరడమైనది. సంస్థ సభ్యులు ఇకముందు కూడా ఇదే విధిగా కొనసాగించడానికి అంగీకరించినారు ..కావున పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్ఫూర్తి ఫౌండేషన్ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇకముందు కొనసాగించాలని పాఠశాల అధ్యాపకులు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్.ఎం రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయినీలు పద్మ, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.

ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రం గా స్థానిక రభాసా అతిథి గృహంలో అబ్రహం మాదిగ అధ్యక్షతన ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు రామరాపు శ్రీనివాస్ మాదిగ,విఎస్ రాజు మాదిగలు  మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత,మందకృష్ణ  తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత  మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారా మాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ,  వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో… పెద్ద గీత మాదిగ మాదిగ మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు,ఆనంద్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,బుచెంద్రయ్య మాదిగ ఎమ్మార్పియిస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,జాన్ సోషల్ మీడియా ఇంచార్జి సంగారెడ్డి,వివిధ మండల అధ్యక్షులు జైరాజ్ మాదిగ, టీంకు మాదిగ, మైకీల్ మాదిగ,నిర్మల్ మాదిగ, ప్రభాకర్ మాదిగ,సుకుమార్, కిట్టు, శ్రీనివాస్, ప్రేమ్, సుదర్శన్, దాస్, జీవన్,వీరయ్య మాదిగ,దేవయ్య, చంద్రకాంత్, శాంతకుమార్, మోహన్, చంద్రపాల్, దిలీప్, సంతోష్, సునీల్ కుమార్, ప్రశాంత్, లాజర్, సుందర్, సుశీల్ కుమార్, ప్రవీణ్, దుర్గాదాస్, మాదిగలు పాల్గొన్నారు.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు ఎంపీడీవో సుధాకర్ మరియు హౌసింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్.

మరిపెడ కురవి నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ని
జుజ్జూర్ తండాలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా హాజరైన కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద వాడికి సొంత ఇంటి నిర్మాణం అని ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని ద్రుడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు,జిల్లాలో జూన్ పదవ తారీకు వరకు ప్రోసిడింగ్ కాపీలు మంజూరు చేసి బేస్మెంట్ లెవెల్ పూర్తిచేసిన అన్నిటికీ డబ్బులు వెంటనే ఇస్తామన్నారు , గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి పేదవారికి సొంత ఇల్లు నిర్మాణ పథకం ప్రవేశ పెట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావలసిన ఇసుక రిచ్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్ గౌడ్, జుజుర్ తండా గ్రామ అధ్యక్షుడు బానోత్ రవి, ఉపాధ్యక్షుడు ధరావత్ మోతిలాల్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు డాక్టర్ ధరావత్ వీరన్న నాయక్, పూల్ సింగ్ నాయక్ , నవీన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భవాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాయకులు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇందిర ఇండ్ల లకు. భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పేద ప్రజల అభివృద్ధిలో లో. పేద రాష్ట్రపతిగా అభివృద్ధి.లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగిస్తూ. దేశంలో ఇందిరమ్మ. కన్న కలలు సహకారం చేస్తూ నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయిస్తూ. వారి కుటుంబాల కల సహకారం చేస్తున్నారని. అలాగే ఇప్పటివరకు మండలంలో 85 ఇండ్లకు గాను గ్రౌండ్ వర్కింగ్ చేయడం జరుగుతుందని. ఇప్పటివరకు. 45 ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేయడంతో పాటు. ముగ్గు పోసి నూతన గృహాలు ప్రారంభించామని. అలాగే గత ప్రభుత్వాలతో పోల్చితే. ఈ ప్రభుత్వ. హయాంలో. అలాంటి అవినీతికి తావియ్యకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అని. ఇకముందు కూడా గ్రామాలలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికై. నిరుపేద కుటుంబాల కలసహకారం చేసుకోవాలని. కుటుంబ. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నది అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం మాట్లాడుతూ. ఇప్పటివరకు మండలంలో చాలామందికి ఇందిర ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేయడం జరిగిందని మండలంలో ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం. మహోద్యమంగా మొదలుపెట్టిన. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను. మాకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు. రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో. ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. లింగాల భూపతి. సుద్దాల శ్రీనివాస్. సుద్దాల కర్ణాకర్. సామల గణేష్. సత్యనారాయణ రెడ్డి. మచ్చ. మధు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..

22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..

నేటిధాత్రి, పోచంమైదాన్.

 

 

వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో 22వ డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి డివిజన్ ప్రజల సౌకర్యార్ధం, వారి సమస్యను కొన్ని సంవత్సరాల నుండి ఫంక్షన్స్ కు ఇతర కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్న పరిస్థితిని గుర్తించి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన మంత్రి కమ్యూనిటీ హాల్ కు 50 లక్షల నిధులతో నిర్మాణం చేయించాలని కోరారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ.

 

Minister Konda Surekha

 

శుక్రవారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లు విచ్చేసి కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. నగర మేయర్ సైతం తనవంతు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డివిజన్ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మొత్తం 24 మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రంజిత్ నోటు పుస్తకాలను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ రామచంద్రయ్య తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన.

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద ప్రజల కొరకు ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఝరాసంగం మండలం లో గల కొల్లూరు,కక్కరవాడ,జోనవాడ,ప్యారవరం మరియూ లో గల వివిధ గ్రామాలలో ఈ రోజు ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల అధికారి MPDO సుధాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ గారు,కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, నందు పాటిల్, యూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, లక్ష్మారెడ్డి,ఆలయ ఛైర్మన్ రాజేందర్, వీరన్న పాటిల్,నర్సింలు, విజయ్ కుమార్, ఎం విష్ణు, సి సుబాకర్, సి ప్రకాష్, సతీష్ గౌడ్,మాజీ సర్పంచ్ సిద్ధిరాములు, శ్రీశైలం,రమేష్, దేవదాస్, నర్సింలు మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మరియు వివిధ పార్టీల మండల నాయకులు,సంఘనాయకులు, వివిధ గ్రామల ప్రజలు పాల్గోని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చెయ్యడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version