కార్మికుల సీఐటీయూ కమిటీ ఏర్పాటు

కార్మికుల సీఐటీయూ కమిటీ ఏర్పాటు

అధ్యక్షుడిగా మడికొండ ప్రమోద్ కుమార్‌

పరకాల,నేటిధాత్రి

పరకాల మున్సిపాలిటీ కార్మికుల సీఐటీయూ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా మడికొండ ప్రమోద్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమం సీఐటీయూ జిల్లా నాయకులు తలారి ఉప్పలయ్య బోట్ల చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఐటీయూ సంస్థ కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.గౌరవ అధ్యక్షుడిగా బొచ్చు ఐలయ్య,గౌరవ సలహాదారుడిగా పసుల సారయ్య నియమితులయ్యారు.అధ్యక్షుడిగా మడికొండ ప్రమోద్ కుమార్,కార్యదర్శిగా చెరుకునాగరాజు,కోశాధికారిగా మడికొండ వసంత బాధ్యతలు స్వీకరించారు.వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుర్రం సరోజన, ఉపాధ్యక్షులుగా కోకిల సుమన్,మంద మహేష్, దుప్పటి తిరుమల నియమితులయ్యారు.సలహాదారులుగా మడికొండ సుధాకర్,ఒంటేరు సరోజన, సహాయ కార్యదర్శులుగా సుదమల్ల సతీష్,సాంబరాజు బాధ్యతలు చేపట్టారు.కార్యవర్గ సభ్యులుగా బొచ్చు సుశీల,బొచ్చు సురేష్,ఎర్ర సదయ్య,చిలువేరు శుభకళ, బుస రవి,ఇనుగాల తిరుపతి,ఒంటేరు ప్రకాష్ ఎంపికయ్యారు.ఈ కమిటీని కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.సహకరించిన మున్సిపాలిటీ కార్మికులకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి…

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి

సెప్టెంబర్ 15 న మహాసభ

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు

సిరిసిల్ల టౌన్ *(నేటిధాత్రి)

 

 

 

సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్లలో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా 3 వ. మహాసభల కరపత్రాలను ఈరోజు బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో నాయకులు ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికుల ఉపాధి , సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గత పోరాటాలను సమీక్షించుకొని ఉద్యమ కార్యచరణను రూపొందించుకోవడం కోసం యూనియన్ జిల్లా 3 వ. మహాసభలను సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు , గురజాల శ్రీధర్ , కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version