మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
* మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణి చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల, నేటిధాత్రి :
చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య శనివారం నవాబ్ పేట్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి పేరిట డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వెలుగు ప్రార్థనను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి, సంక్షేమ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని,గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవిత స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రధానంగా అమలు అవుతున్న పథకాలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఆదర్శ పాఠశాలలో మహిళా అధ్యక్షురాలు నియామకం, ఆర్టీసీ బస్సుల కొనుగోలులో మహిళా సమాఖ్యల భాగస్వామ్యం, వడ్డీ రహిత రుణాలు, విద్యార్థుల వసతి మెస్ చార్జీల తగ్గింపు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు . మహిళలను ఆర్థికంగా స్వావలంబి, సామాజికంగా బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళ సంఘం ప్రతినిధులు, సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
