అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న ముడిమ్యాల పంచాయతీ కార్యదర్శి
* పంచాయతీ పరిధి111జీవోలో అక్రమ వెంచర్, పదుల సంఖ్యలో భారీగా ఫామ్ హౌస్ నిర్మాణాలు
* పిర్యాదు చేసిన చర్యలు శూన్యం, నోటీసులతో చేతులు దులుపుకున్న వైనం
* కార్యదర్శి అండతోనే అక్రమనిర్మాణాలు కొనసాగుతున్నయన్న ఆరోపణలు
•పరోక్షంగా అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నరన్న ఆరోపణలు
* పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలపరిధిలోని ముడిమ్యాల గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి తీరే వేరు. ముడిమ్యాల గ్రామపంచాయతీ పరిధిలో 111జీవోలో అక్రమంగా లే అవుట్లు చేసి, ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అంశాన్ని స్థానికులు గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకుపోయిన కానీ చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు . మొదట నోటీసులిచ్చామని సెప్పిన
కార్యదర్శి తరువాత 2 నెలలుగా పట్టించుకోలేదని
గ్రామస్తులు పలువురు ఆరోపించారు.
వివరాల్లోకి వెళితే… చేవెళ్ల మండలం 111జీవో పరిధిలోని ముడిమ్యాల రెవెన్యుపరిధిలో సర్వే నెంబర్ 121 లో 9 ఎకరాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా లే అవుట్లు చేసి యదేచ్చగా భారీగా ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎక్కడ చూసిన అక్రమానిర్మాణాలే కళ్ళకు కట్టినట్టే కనిపిస్తున్నాయి.
* కార్యదర్శి అండతోనే అక్రమాలు :
కార్యదర్శికి అక్రమపద్దతిలో ముడుపులు చెల్లించడంతోనే
అక్రమార్కులను ప్రోత్సహస్తున్నారనే విమర్శలు వెళువేత్తు న్నాయి. దీనితో ముడిమ్యాల పంచాయతీ కార్యదర్శి అండదండలు మెండుగా ఉన్నట్లు స్థానికులు గుసగుసలు
గట్టిగా వినిపిస్తున్నాయి. అక్రమనిర్మాణాలను మొదటి దశలోనే నిలిపి వేయాల్సిన పంచాయతీ కార్యదర్శి 111జీవోలో అక్రమనిర్మాణాలు పూర్తికావస్తున్న నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారిస్తున్నారు. నెలరోజుల క్రితం నోటీసులు మాత్రమే ఇచ్చారు. అయినా నిర్మాణాలు యతేచ్చగా కొనసాగిస్తుండటంతో కార్యదర్శి తమకేమి తెలియదన్నట్టు వ్యవహారిస్తున్న తీరు సరైనది కాదని
పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి పాత్ర భారీగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
