దాతల చేయూత అభినందనీయం
•చేవెళ్ల మండల విద్యాధికారి పురందాస్
చేవెళ్ల, నేటిధాత్రి :
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు చేయూతనివ్వడం అభినందనీయమని చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్. పురందాస్ అన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల ఎన్కెపల్లిలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఇదే పాఠశాలలోఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జి. కమల మనోహర్ బాబు దంపతులు శుక్రవారం మండల విద్యాధికారి ఎల్.పురన్ దాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి మునీర్ పాషా చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి పురందాస్ మాట్లాడుతూ దాతలు పేద విద్యార్థులకు ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించినప్పుడు ఇదే తరహాలో పేదవారికి సహాయం చేయాలని అన్నారు. ధనం చాలామంది దగ్గర ఉన్నప్పటికీ దానగుణం కొందరిలోనే ఉంటుందని,అలాంటి వారిలో కమల టీచర్ దంపతులు ఒకరని అభినదించారు. వారు చేసిన మంచి ఎప్పటికీ వారి వెంట ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా దాత మనోహర్ బాబు మాట్లాడుతూ భగవంతుడు తనకిచ్చిన దానిలో కొంత విద్యార్థులతో పంచుకుంటున్నాను అని అన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తదుపరి పాఠశాల పక్షాన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం కలసి దాతను విద్యాధికారి సమక్షంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రేణు అంగన్వాడి కార్యకర్త స్వరూప ,ఆశ కార్యకర్త సుజాత విద్యార్థులు పాల్గొన్నారు.